Breaking News

Daily Archives: July 29, 2025

ఏపీ సముద్ర తీరం…అభివృద్ధికి ముఖ ద్వారం

-పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు,షిప్ బిల్డింగ్ యూనిట్లు, టూరిజంలో అవకాశాలు -అవకాశాలు పుష్కలం- వచ్చి వినియోగించుకోండి -సింగపూర్ సీఈఓల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ… రాష్ట్రంలో సుదీర్ఘతీరప్రాంతం ఏపీకి అతిపెద్ద వనరు అని ప్రత్యేకంగా వివరించారు. రాష్ట్రంలో మారిటైం ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రణాళికల్లో భాగంగా..తాము పోర్టుల నిర్మాణం, …

Read More »

లాజిస్టిక్ కారిడార్ గా కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం

-సింగపూర్ లోని జురాంగ్ పెట్రోకెమికల్ ఐల్యాండ్ సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక-లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పోర్టులను అనుసంధానంతో పాటు, పోర్టులకు సమీపాన ప్రపంచశ్రేణి చమురు రిఫైనరీ ఏర్పాటు కానుందని సీఎం అన్నారు. సింగపూర్ లో మూడో రోజు పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రో కెమికల్ ఐ ల్యాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం సందర్శించింది. జురాంగ్ …

Read More »

ఆగస్టు 25 నుండి వారం రోజుల పాటు స్మార్టు రేషన్ కార్డుల పంపిణీ

-దీపం-2 పదకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాము -రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల 25 నుండి 31 వ తేదీ వరకూ వారం రోజుల పాటు స్మార్టు రేషన్ కార్డులను పంపిణీ చేయున్నామని రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ స్మార్టు రేషన్ కార్డులను రాష్ట్రంలోని …

Read More »

హంద్రీనీవాకు జలకళ

-సీమ ప్రజల మోముల్లో సంతోషం. -3850 క్యూసెక్కుల నీరు తరలించే పనులు పూర్తి. -హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి రామా నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా 3850 క్యూసెక్కుల నీరు తరలించే పనులు పూర్తయినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి పై ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ …

Read More »

సింగ‌పూర్ లో కొన‌సాగుతున్న సీఎం చంద్ర‌బాబు బృందం ప‌ర్య‌ట‌న‌.

-అమ‌రావ‌తి స్మార్ట్ సిటీ నిర్మాణంపై మంత్రి నారాయ‌ణ అధ్య‌య‌నం. -ఇవాళ ఉద‌యం పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్ షిప్ ను సంద‌ర్శించిన మంత్రి. -సుస్ధిర ప‌ట్ట‌ణాభివృద్దికి ఉప‌యోగ‌ప‌డే అంశాల‌ను అధ్య‌యనం చేసిన మంత్రి. -మ‌ధ్యాహ్నం డెల్ టెక్నాల‌జీస్ ప్ర‌తినిధుల‌తో మంత్రి నారాయ‌ణ స‌మావేశం. సింగ‌పూర్, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి నిర్మాణంలో ప‌లు అంశాల్లో సింగ‌పూర్ మోడ‌ల్ ను ఫాలో అవ్వాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.ఇప్ప‌టికే రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ సింగ‌పూర్ ప్ర‌భుత్వం అందించింది…దీంతో పాటు ఏపీలో సుస్థిర ప‌ట్ట‌ణాభివృద్ది సాధించేందుకు అవ‌స‌ర‌మైన అంశాల‌పై …

Read More »

డేటా సెంటర్ల ఏర్పాటుకు ఏపీ అనుకూలం

-అమరావతి క్వాంటం వ్యాలీ ప్రయోజనాలు అందుకోండి -సింగపూర్ లోని పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సింగపూర్ లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు సింగపూర్‌లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు …

Read More »

రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ

-కెప్పెల్, జీఐసీ, విల్మార్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ -రాష్ట్రంలో అవకాశాలు వివరించి.., భాగస్వామ్యానికి పిలుపు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : నగరాభివృద్ధి, వాణిజ్య సదుపాయాలు, మౌలిక వసతుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సింగపూర్‌కు చెందిన కెప్పెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్ వియ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సింగపూర్ లో మూడో రోజు పర్యటనలో భాగంగా సీఎం వివిధ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలతో బేటీ అయ్యారు. అమరావతి నగర అభివృద్ధిలో కెప్పెల్ భాగస్వామ్యంపై ప్రధానంగా ఇరువురి …

Read More »

ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుంది

-2019 తర్వాత ఏపీలో వచ్చిన ప్రభుత్వం నుంచి సహకారం ఆగిపోయింది. -సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలి -సింగపూర్ దేశ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన -ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ భాగస్వామ్యం విలువైందని ప్రకటన సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం …

Read More »

ఏపీలో ఏఐ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి…

-‘ఏఐ సింగపూర్’ సంస్థను ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -ఎస్ఐఏ ఇంజినీరింగ్ ప్రతినిధితోనూ భేటీ -రాష్ట్రంలో విమానయాన రంగంలో అవకాశాలు వివరించిన సీఎం సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పర్యటన 3వ రోజైన మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో 227 ఎఫ్‌.పి.వో ల‌కు ఈక్విటీ గ్రాంట్ – రైతుల సాధికారతకు కేంద్రం పలు చర్యలు

-కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స‌మాధానం -ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలపై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎంపీ క‌లిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, మార్కెట్ అవకాశాలను విస్తరించేందుకు, మహిళా రైతుల పాత్రను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం “10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థల స్థాపన మరియు ప్రోత్సాహం” పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,000 రైతు ఉత్పత్తిదారుల …

Read More »