-అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్న ముఖ్యమంత్రి -రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించనున్న సీఎం -మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్ లో పాల్గొననున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లపై …
Read More »Daily Archives: July 12, 2025
2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఏపీ ఉత్తమ పనితీరు కనబరచడంపై పారిశుధ్య సిబ్బంది, అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. దీనికి కారణమైన మున్సిపల్ శాఖ, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, పారిశుధ్య కార్మికులు, పౌరులకు అభినందనలు తెలియచేస్తున్నాను. విజయవాడ, గుంటూరు తిరుపతి ప్రతిష్టాత్మక సూపర్ స్వచ్ఛ లీగ్‌లో చేరాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కేటగిరీ కింద మినిస్టీరియల్ అవార్డు గెలుచుకుంది. రాజమహేంద్రవ రం రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్ అవార్డు అందుకుంది. ఈ అవార్డులు రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో పాటు సమిష్టి కృషితో అందుకున్నాం. …
Read More »రాష్ట్రానికి మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు
-వివిధ కేటగిరీల్లో అవార్డులకు ఎంపికైన పలు మున్సిపాలిటీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17 న డిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్న మంత్రి పొంగూరు నారాయణ సూపర్ స్వచ్ లీగ్ అవార్డుల కేటగిరీ (జనాభా ప్రాతిపదికన) 1) 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 2) 3 లక్షల నుంచి 10 లక్షల లోపు కేటగిరీ లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 3) 50 వేల నుంచి …
Read More »దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐ.ఆర్.ఎం.ఎస్ ) కు చెందిన సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జూలై 11, 2025న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వారు 1988 బ్యాచ్ ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ (ఐ.ఆర్.ఎస్.ఈ) కు చెందినవారు. ఈ పదవికి పూర్వం ఆయన సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (సి.ఓ.ఆ.ఈ ) జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన వివిధ సాంకేతిక పురోగతులు మరియు విధానాలను అమలు చేయడంలో ఆయన …
Read More »దేశ పురోగతిలో యువత భాగస్వాములై నిబద్ధతతో సేవలు అందించాలి
-కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గుంటకల్లు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రోజ్గార్ మేళ ప్రధాన లక్ష్యమని, అందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. గుంతకల్లు డివిజన్‌లో శనివారం నిర్వహించిన 16వ రోజ్గార్ మేళా కార్యక్రమానికి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో 16వ రోజ్ గార్ …
Read More »రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : యార్లగడ్డ
-కృష్ణా డెల్టా కి సకాలంలో సాగునీరు విడుదల చేసాం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తమ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ గత ఏడాదికాలంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న …
Read More »సెంట్రల్ డివిజన్ సురక్షా కమిటీ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు డి.సి.పి. కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో సెంట్రల్ ఏ.సి.పి. కె.దామోదర రావు ఆద్వర్యంలో ఈ రోజు పటమట పోలీసు స్టేషన్ పరిదిలోని ఆటోనగర్ క్రాంతి రెసిడెన్సీ నందు సెంట్రల్ డివిజన్ పరిదిలోని సురక్షా కమిటీ మెంబర్స్ తో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఏ.సి.పి.తోపాటు సురక్షా కమిటీ కన్వీనర్ నరసయ్య, పటమట ఇన్స్పెక్టర్ పవన్ కిశోర్, మాచవరం ఇన్స్పెక్టర్ ప్రకాష్, గుణదల ఇన్స్పెక్టర్ …
Read More »భక్తులు సులభతరంగా ఇంద్రకీలాద్రి చేరుకోవడానికి అన్ని మార్గాలు సుగమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భక్తులు సులభతరంగా ఇంద్రకీలాద్రి చేరుకోవడానికి అన్ని మార్గాలు సుగమం చేసే పనిలో అన్ని ప్రభుత్వశాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ అన్నారు. శనివారం ఉదయం దేవస్థాన కార్యాలయంలో నగర పోలీస్ శాఖ అధికారులు, దేవస్థానం సిబ్బంది, వైదిక సిబ్బందితో జరిగిన సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి కొన్ని గంటల్లోనే విజయవాడ చేరుకుని కుమ్మరి పాలెం సెంటర్ నుండి దేవస్థానం పైకి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని భక్తులు పేర్కొన్న విషయాలుపై ప్రత్యామ్నాయ దారులు …
Read More »పాదయాత్రలో వినూత్న దృశ్యం: మంత్రి చేతుల మీదుగా మగ్గం నేశారు…
-మగ్గం నేసిన మంత్రి -చేనేతకు మద్దతిచ్చిన మంత్రి ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన నియోజకవర్గమైన ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పాదయాత్రలో భాగంగా ఈ రోజు 20వ వార్డును సందర్శించారు. పాదయాత్ర సమయంలో అక్కడి స్థానికులతో కలిసిమెలిసి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మవరం చేనేత సాంప్రదాయానికి తగిన గౌరవం తెలియజేస్తూ ఒక చేనేత మగ్గం వద్ద కూర్చొని స్వయంగా మగ్గం నేసారు. ఈ వినూత్న చర్య …
Read More »ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమంతో కూడిన సుపరిపాలన అందించారని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ పేర్కొన్నారు. శనివారం 13వ డివిజన్ లో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ తో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పధకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్, తల్లికి వందనం …
Read More »
Prajavartha Online Telugu News