అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధత కలిగిన నేతగా.. విధేయతతో పనిచేస్తూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, కార్యకర్తలకు నిరంతరం అండగా నిలవడంలో దేవినేని ఉమ చేస్తున్న కృషి అభినందనీయమని సీఎం ప్రశంసించారు. “నేటి శిక్షణ పొందిన కార్యకర్తే.. రేపటి సమర్థ నాయకుడు” అనే లక్ష్యంతో పార్టీ శ్రేణులకు …
Read More »Monthly Archives: August 2026
అద్దంకిలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్ పర్యటన
-శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దర్శనం.. ప్రత్యేక పూజలు -రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన 37 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం -వ్రిద్ది ఇన్ఫ్రాటెక్ ఆర్థిక సహకారంతో దేవస్థానానికి సోలార్ ప్లాంట్ -వాసవీ ఆర్యవైశ్య అన్నదాన సత్రానికి శంకుస్థాపన అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి సౌర విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. దేవస్థానం కోసం రూ.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 37 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి టీజీ భరత్ …
Read More »పీజీ వైద్యులను 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదు
-నైట్ డ్యూటీ తర్వాత మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు -వారానికి ఒక రోజు పూర్తి సెలవు ఇవ్వాలి -పూర్వ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసిన డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ -లేకుంటే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల విధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో ఇప్పటికే అమలులో ఉన్న ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. …
Read More »యర్రగొండపాలెం ఘటనపై విచారణ జరుపుతాం
-అనధికార వైద్య చర్యల (Quackery)ను ఉపేక్షించేది లేదు -రాష్ట్ర వైద్య మండలి అధ్యక్షుడు డాక్టర్ నంద కిశోర్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అనధికారికంగా నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్న అబార్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్‌లో సలహాలు ఇస్తుండగా, సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్లు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది. మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన …
Read More »చికెన్‌ను దుమ్ము, ఈగలు, కీటకాలు మరియు ఇతర కాలుష్య కారకాల నుంచి రక్షించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చికెన్‌ను దుమ్ము, ఈగలు, కీటకాలు మరియు ఇతర కాలుష్య కారకాల నుంచి రక్షించాలని ప్రజారోగ్యం అధికారులు అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం సిబ్బంది నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, చికెన్ షాపులు, జ్యూస్ షాపులు, ఆర్.ఓ. ప్లాంట్లు మరియు ఇతర ఆహార వాణిజ్య సముదాయాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా రాజరాజేశ్వరిపేట, రామలింగేశ్వరపేట, పటమట, వన్‌టౌన్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ఆయా వ్యాపార సంస్థల్లో …
Read More »ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వల్ల కలిగే వ్యాధులను నిర్మూలిద్దాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కండ్రిక పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ నగరంలో దోమల …
Read More »మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సర్కిల్-3 కార్యాలయం, పటమట లో మొబైల్ కోర్టు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రహదారులపై చెత్తాచెదారం వేయడం, రోడ్లపై పశువులు మరియు పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు వేయడం ద్వారా మురుగునీటి పారుదలకు …
Read More »ఏపీ ప్రజారవాణా శాఖ కమిషనర్, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీగా ఎం. శివప్రసాద్….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (పీటీడీ) కమిషనర్‌గా మరియు ఏపీఎస్‌ఆర్టీసీ ఎక్స్-అఫీషియో వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం. శివప్రసాద్ కు ప్రభుత్వం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఆయన ఈ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. …
Read More »రూ. 1,00,648 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
– 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనల ఆవిష్కరణ – గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ. 17,148 కోట్లు అదనం – ప్రాధాన్య రంగానికి రూ. 38,173 కోట్ల రుణ ప్రతిపాదనలు – స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో బ్యాంకులు చోదక శక్తిగా నిలవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని.. 2026-27 …
Read More »రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మహిళా అధికారులు నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ డా.లక్ష్మీశకు రాఖీ కట్టి మిఠాయి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. లక్ష్మీశ జిల్లాలోని మహిళలందరికీ హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళల …
Read More »
Prajavartha Online Telugu News