Monthly Archives: August 2026

ప్రజా అర్జీలకు సత్వర, నాణ్యమైన పరిష్కారం..

– అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు.. – నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్ర‌త్యేక గ్రీవెన్స్‌కు 170 అర్జీలు – జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గ స్థాయి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా, అర్జీలను …

Read More »

శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం

గుంటూర, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్తాయిలో నిషేధించుట జరిగిందని, వ్యాపారస్తులు ఎవరైనా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించినట్లైతే అటువంటి వారికి అపరాధ రుసుము విధించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ శానిటరీ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం …

Read More »

తెలగమాంబ చెరువుని ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయడానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువుని ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా తొలుత చెరువులోని జంగిల్ (పిచ్చి మొక్కల)ను వేగంగా క్లియర్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్లపాడులోని తెలగమాంబ చెరువు, రైల్వే స్టేషన్ రోడ్, మెయిన్ రోడ్ లో జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, …

Read More »

ఐఆర్‌సీఎస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏడుగురు జిల్లా కలెక్టర్లకు గవర్నర్ గోల్డ్ మెడల్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్)లో చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏడుగురు జిల్లా కలెక్టర్లు గవర్నర్ గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. సెప్టెంబర్ 1న ఉదయం 11 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఐఆర్‌సీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ పతకాలను ప్రదానం చేయనున్నారు. గోల్డ్ మెడల్స్ స్వీకరించేందుకు ఏడుగురు కలెక్టర్లు వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పతకాలు అందుకోనున్న వారిలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ …

Read More »

ధరణి దుర్గా దేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

-శాంతినగర్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలు.. భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 61వ డివిజన్ శాంతినగర్‌లో శుక్రవారం నిర్వహించిన ధరణి దుర్గా దేవి అమ్మవారి పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం  పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భక్తులకు స్వయంగా అన్నం …

Read More »

విశ్వమాత మరకత వాసవి దేవస్థానం 5వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 62వ డివిజన్ సుందరయ్య నగర్ విశ్వమాత మరకత వాసవి దేవస్థానం 5వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, శివ స్వామి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రాఖీ కడుతున్నట్లుగా …

Read More »

శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో భక్తులను అలరించిన శ్రీ మహంకాళి అమ్మవారు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ మహంకాళి అమ్మవారు శ్రావణమాసం మూడో శుక్రవారం శ్రీ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు. శుక్రవారం కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లాలో కొలువై ఉన్న ప్రసిద్ధ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మహంకాళి అమ్మవారు శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా వేదమంత్రాల సాక్షిగా జరుపుకోవడం …

Read More »

శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానంలో ఘనంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానం నందు ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్‌రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం నెలకొల్పబడి రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన తరువాత ద్వితీయ వార్షికోత్సవ వేడుకల దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి …

Read More »

మంగళగిరిలో మోడరన్ రైతు బజార్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

-5.90 ఎకరాల్లో రూ.18.55 కోట్ల వ్యయంతో మోడరన్ రైతు బజార్ నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగ‌ళ‌గిరిని తీర్చిదిద్దేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముందుగా నిడమర్రు రోడ్డులోని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ …

Read More »

రాజధాని అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

-NIELIT నేతృత్వంలో రూ.730 కోట్లతో ఏర్పాటు కానున్న దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్శిటీ -వచ్చే నెల 13 నుంచి ANUలో NIELIT తరగతులు -8.5 ఎకరాల్లో NIELIT క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికత, ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రీకృతమైన జాతీయ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ …

Read More »