అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
Read More »Monthly Archives: August 2026
జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం
-20 వేల హెక్టార్లలో 2 కోట్లకిపైగా సీడ్ బాల్స్ వెదజల్లారు -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం -50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో కీలక అడుగు -అడవుల పునరుద్ధరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్ సాంకేతికత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ 50 శాతం గ్రీన్ కవర్ సంకల్పం సాకారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. క్షీణించిన అడవుల పునరుద్ధరణ, …
Read More »వెస్ట్రన్ DFCపై తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-మార్గం: JNPT ముంబై నుంచి వడోదర వరకు – 422 కి.మీ. -లోడ్: 360 TEUs -రైలు నిర్మాణం: రెండు రేక్‌లను కలిపి నడిపించారు -కంటైనర్లు: ఒక్కో రేక్‌లో 45+1 కంటైనర్లు -మొత్తం బరువు: 3,922 టన్నులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : JNPT ముంబై నుంచి తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును నడిపిన భారతీయ రైల్వే వడోదర డివిజన్‌లోని వర్నామా CONCOR GCT టెర్మినల్‌కు 422 కి.మీ. దూరం వరకు 360 TEUs కంటైనర్ల రవాణా భారతీయ రైల్వే 21.08.2026న …
Read More »యువతే వికసిత్ భారత్‌కు చోదకశక్తి
-రాజకీయాల్లోకి వచ్చేవారు పదవుల కోసం కాదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి: గోవా సీఎం ప్రమోద్ సావంత్ -వికసిత్ ఆంధ్రప్రదేశ్‌తోనే వికసిత్ భారత్.. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి: ఎపి బిజెపి చీఫ్ పీవీఎన్ మాధవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే యువత పదవుల కోసం కాకుండా ప్రజా సమస్యల …
Read More »గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో సుజనా చౌదరి ఆత్మీయ భేటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ -2047 కార్యక్రమంలో భాగంగా విజయవాడ వచ్చిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మరియు ప్రజా ప్రతినిధులతో మాజీ కేంద్ర మంత్రి వర్యులు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే (సుజనా చౌదరి) భేటీ అయ్యారు. పర్యటనలో భాగంగా తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు సుజనా చౌదరి శాలువా కప్పి, బొకే ఇచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వారిని విందుకు ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు …
Read More »ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా” ఫౌండేషన్” ద్వారా శనివారం కొత్తపేట,కే బీ ఎన్ కళాశాల నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ …
Read More »జగన్‌ది రాజకీయ అవగాహన రాహిత్యం – ఎమ్మెల్సీ వర్ల రామయ్య
-మెగా డీఎస్సీపై అనుమానాలుంటే అధికారులను కలవాలి -16 వేల మంది ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దు -లోకేశ్ ప్రజాదరణ చూసి జగన్‌లో అసూయ.. బహిరంగ చర్చకు రావాలి -ఏపీపీఎస్సీ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది.. తీర్పు కోసం వేచి చూడాలి -బ్రిడ్జ్ క్రీడాకారులకు ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు.. ఒక్క దరఖాస్తూ రాలేదు -బ్రిడ్జి కోర్స్ అంటే తెలియని బుద్ధిహీనులే వైసిపి నాయకులు- ఎంపీ చిన్ని -ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న వర్ల రామయ్యకు అభినందనలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని -పార్లమెంటు ను అభివృద్ధి పదం …
Read More »డయల్ యువర్ ఎంపీ కార్యక్రమానికి విశేష స్పందన
-ఒక గంటలలోనే 45 నుండి 50 కాల్స్ మాట్లాడి పార్లమెంట్ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ చిన్ని -ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కొత్త వేదిక ఏర్పాటు చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని -ఫోన్లో తెలియజేసిన సమస్యలను పరితగతిన పరిష్కరించాలని పలు శాఖల అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో నందు డయల్ యువర్ ఎంపీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సైతం పాల్గొన్నారు. …
Read More »నగరంలో గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గాంధీనగర్ లోని ఎస్ కే సి వి ట్రస్ట్ ఆధ్వర్యంలోని విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. అలాగే చదువులో ప్రతిభను కనబరిచిన 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున మొత్తంగా 10,000 రూపాయల నగదుపురస్కారాలను అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి పేరిట కేక్ ని కట్ చేసి పంపిణీ చేశారు. ఇక్కడి కార్యక్రమంలో చిరంజీవి …
Read More »డుచెన్ వ్యాధిపై అవగాహనా కార్యక్రమం!
– సెప్టెంబర్ 7న వరల్డ్ డుచెన్ అవేర్‌నెస్ డే సందర్భంగా నిర్వహణ – అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) అరుదైన జన్యుపరమైన వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 7న వరల్డ్ డుచెన్ అవేర్‌నెస్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహాయసహకారాలు అందించాలని అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శోభారాణి సుంకర జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను కోరారు. ఈ …
Read More »
Prajavartha Online Telugu News