విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు ఆదివారం ఉదయం సిబ్బందితో టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ, టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరయోధుడిగా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా, ఆంధ్ర ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని …
Read More »Monthly Archives: August 2026
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 24వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు శోభాయమానమైన ధీరోదాత్తుడు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా ప్రకాశం పంతులు జయంతి వేడుకలు -ఆంధ్రజాతి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రకేసరి -బ్రిటీష్ తుపాకులకు ఎదురొడ్డిన నిజమైన ఆంధ్రకేసరి -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు శోభాయమానమైన ధీరోదాత్తుడు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం …
Read More »పీజీఆర్ఎస్‌పై స్పందనకు ప్రత్యేక క్యూఆర్ కోడ్
– ఈ నెల 24న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ.. – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 24వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని.. అదే విధంగా అర్జీదారులు తమ స్పందన తెలియజేసేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ డా. …
Read More »నిరాడంబరత, ధైర్యం, పట్టుదలకు ప్రతీక ప్రకాశం పంతులు
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, ధైర్యసాహసాలకు ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులుగారని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి కలెక్టర్ లక్ష్మీశ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి ప్రకాశం …
Read More »ఉద్యోగుల ఉత్సాహానికి క్రీడలే ఊతం
-ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం.. క్రీడలతోనే సాధ్యం -టీమ్ స్పిరిట్‌తో విధుల్లోనూ మెరుగైన పనితీరు -ఉద్యోగుల మధ్య ఐక్యత, స్నేహభావానికి ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్ వేదిక -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యునైటెడ్ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్–ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మెగా క్రికెట్ టోర్నమెంట్ (ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్) పోటీలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడులోని ఆంధ్ర క్రికెట్ …
Read More »ఉయ్యూరులో డయేరియా పరిస్థితి అదుపులోనే
-19 మంది బాధితులు.. 15 మందికి ఆసుపత్రిలో చికిత్స 6గురి డిశ్చార్జ్ -నిలకడగా రోగుల ఆరోగ్యం -రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ కు చేరిన ప్రాథమిక నివేదిక -5, 7, 9వ వార్డుల్లో ప్రత్యేక పర్యవేక్షణ -కొనసాగుతున్న సర్వే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో నమోదైన డయేరియా కేసుల పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆగస్టు 19 నుంచి 23 వరకు 5, 7, 9వ వార్డుల్లో మొత్తం …
Read More »బ్యాంకు ఖాతాలను అనవసరంగా మార్చొద్దు
-ఆధార్ సీడింగ్ పూర్తికాక ఖాతాలు మారిస్తే ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో జాప్యం -NHM ఉద్యోగుల విషయమై జిల్లా అధికారులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చక్రధర్‌బాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు సహేతుకమైన కారణాలు లేకుండా బ్యాంకు ఖాతాలను మార్చుకోవద్దని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చక్రధర్‌బాబు సూచించారు. ఆధార్ సీడింగ్ పూర్తికాకముందే బ్యాంకు ఖాతాలను మార్చుకోవడం వల్ల ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం (ABPS)–డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT)లో …
Read More »మంత్రి సత్యకుమార్ చొరవతో ఆయుష్ కు భారీ ఊతం
-రూ.185.75 కోట్లతో వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం -ఏపీ ఆయుష్ చరిత్రలోనే తొలిసారి -2024-25 నుంచి 26-27 వరకు కలిపి రూ. 434 కోట్ల కేటాయింపులకు ఆమోదo -2014-15 నుoచి 2023-24 వరకు రూ.120 కోట్లు కేటాయింపు -తాజా కేటాయింపుల్లో ఐటీడీఏ ప్రాంతాల్లో 19 మొబైల్ మెడికల్ యూనిట్లు.. -డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఆల్కహాల్ డీ-అడిక్షన్ కేంద్రాలు, యోగా వెల్నెస్ కేంద్రాలు, ఇతర వాటికి నిధుల ఆమోదం -కేంద్రానికి కూటమి ప్రభుత్వం తరఫున మంత్రి సత్య కుమార్ కృతజ్ఞతలు -సీఎం చంద్రబాబు విజన్ తో వైద్య …
Read More »ఘనంగా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ మూడవ వార్షికోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ మూడవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ ఐదవ తరం మనవడు ముఖ్యఅతిథిగా హాజరయిన హైకోర్టు న్యాయవాది డొక్కా భాస్కర్ బాచి మీడియాతో మాట్లాడుతూ డొక్కా సీతమ్మ వారసులను మొదటిసారి ఏపీకి తీసుకువచ్చిన డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయ కుమారి ని అభినందించారు. చారిటబుల్ ట్రస్ట్ నెంబర్లు కు శుభాకాంక్షలు తెలిపారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ మూడవ …
Read More »
Prajavartha Online Telugu News