గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులు పూర్తి కానున్నందున వెంటనే రోడ్ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులను, పట్టాభిపురం మెయిన్ రోడ్ లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్నిపరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు చివరి దశకు వచ్చినందున …
Read More »Monthly Archives: August 2026
వాకర్స్ కి కరూర్ వైశ్యా బ్యాంక్ వారు ఓపెన్ జిమ్ ఏర్పాటు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ కి కరూర్ వైశ్యా బ్యాంక్ వారు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. గురువారం బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో కరూర్ వైశ్యా బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం అందరూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతున్నారని, అటువంటి వారి కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ …
Read More »ఆగస్టు 21న ఇంద్రకీలాద్రిపై రూ. 52.50 కోట్లతో నిర్మించిన ‘అన్నప్రసాద సదనం’, ‘మహాప్రసాద భవనం’ ప్రారంభోత్సవం
-ఉదయం 11:32 గంటలకు శుభ ముహూర్తాన ప్రారంభించనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు -ఒకే విడతలో 800 మందికి భోజన సదుపాయం.. త్వరలో అందుబాటులోకి ‘యాంత్రీకృత వంటశాలలు’ ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూ. 52.50 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన “శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం” మరియు “శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనం” (లడ్డూ పోటు) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ భవనాలను ఆగస్టు …
Read More »వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే కీలకం
-బీజేవైఎం ఆధ్వర్యంలో ‘యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్’.. 22, 23 తేదీల్లో విజయవాడలో సదస్సు…బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి -28 జిల్లాల నుంచి 500 మంది యువ ప్రతినిధులు.. వివిధ రంగాల నిపుణులతో చర్చలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమాన్ని ఈ నెల 22, …
Read More »‘ఎన్‌పీఎస్ అవగాహన సదస్సు’కు విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సంయుక్త ఆధ్వర్యంలో ‘జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)’పై ఈరోజు విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, అసంఘటిత రంగ సభ్యుల (unorganised sector members) నుండి విశేష స్పందన లభించింది. పీఎఫ్‌ఆర్‌డీఏ, ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్స్ అధికారులు ఎన్‌పీఎస్ లక్షణాలు, పెట్టుబడి ఎంపికలు, పన్ను ప్రయోజనాలు మరియు ఇతర లాభాలను వివరించారు. …
Read More »రేర్ ఎర్త్ మినరల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మారుస్తాం
– పర్మినెంట్ మేగ్నెట్స్ స్థానికంగానే తయారు చేసేలా చర్యలు – ఏపీ సముద్ర తీరంలో అపారమైన వనరులున్నాయి – రేర్ ఎర్త్ మినరల్స్‌పై ఏపీలో ప్రత్యేక కోర్సులు ప్రారంభించాలి – మంత్రి కొల్లు రవీంద్రకు ప్రతిపాదనలు అందించిన ఏయూ ప్రొఫొసర్ల బృందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశ మైనింగ్ రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపుదామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర …
Read More »ఐటీడీపీ డిజిటల్ సైనికులు సమిష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి… : బుద్ధా వెంకన్న
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో నియోజకవర్గ ఐటీడీపీ (ITDP) సభ్యులతో గురువారం ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న ఐటీడీపీ సభ్యులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ మరియు పార్టీ సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రతి ఇంటికీ, ప్రతి వ్యక్తికీ తెలిసే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో డివిజన్ స్థాయి నుంచి ఐటీడీపీని …
Read More »బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో రూ.23.15 లక్షల రుణాల మంజూరు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలోని బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రూ.23.15 లక్షల రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేసి అందజేశారు. గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తొలిసారిగా …
Read More »దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి… : వడ్లమూరి కృష్ణ స్వరూప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులను తిరిగి ఎస్సీ జాబితాలో చేర్చి, ఎస్సీ రిజర్వేషన్లు ఇతర రాజ్యాంగ హక్కులు కల్పించాలని దళిత క్రిస్టియన్ ఫోర్స్ (డీసీఎఫ్) జాతీయ చీఫ్ అడ్వైజర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సంస్థ వ్యవ స్థాపకుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో డీసీఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని క్లాజ్–3 కారణంగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులు …
Read More »అర్బన్ ‘ఇ'(మీ) సేవ ఉద్యోగులకి ఇచ్చిన హామీ నెరవేర్చండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2003 సం:లో ప్రారంభించిన ‘ఇ’ సేవ వ్యవస్థలోని ప్రభుత్వ అర్బన్ ‘ఇ’ సేవ సెంటర్లలో గత 18 సంవత్సరాలనుండి విధులు నిర్వహించిన 607 మంది ఉద్యోగులను గత ప్రభుత్వం అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించింది. వారికి యువగళం పాద యాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం తిరిగి ఉద్యోగాలు కల్పించాలని కోరతూ ఇ సేవా రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ …
Read More »
Prajavartha Online Telugu News