Daily Archives: September 29, 2026

వైసీపీ ఐదేళ్ల కంటే.. ఈ రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం

-పల్లె పండుగ 1.0, 2.0తో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు -100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు -బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థితి నుంచి.. సొంతంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీలను తీసుకొచ్చాం -ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 6,500 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం -అడవి తల్లిబాటలో 1,500 కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం -గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0 -పల్లె పండుగ 3.0లో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు …

Read More »

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

-సంక్షేమానికి-సంక్షోభానికి వ్యత్యాసం చూడండి… మంచికి అండగా నిలవండి -ప్రధాని మోదీ సహకారం… నా అనుభవం… పవన్‌ హుషారుతో రాష్ట్రాభివృద్ధి -నాడు వందల కిలో మీటర్లు… నేడు వేల కిలో మీటర్లలో సీసీ రోడ్ల నిర్మాణం -2024 కంటే కూటమికి ఆదరణ పెరిగింది… స్థానిక ఎన్నికల్లోనూ కూటమిదే హవా -ఉదయగిరి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయగిరి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం పేదలకు పట్టాభిషేకం చేస్తుంటే.. మరోవైపు కొందరు విధ్వంసంతో రక్తాభిషేకం చేస్తామంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి విధ్వంసానికి, …

Read More »

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

-ప్రజలు వేసిన ఓటు వృధా కాలేదు… నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన -దూసుకెళ్తున్న డబులింజన్ పాలన… జెట్ స్పీడ్ వేగంతో అభివృద్ధి -గ్రామాభివృద్ధిలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు -ఉదయగిరి పల్లె పండుగ-3.0 బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు -పల్లె పండుగ-3.0లో భాగంగా రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం వీబీ జీ రాంజీ శ్రామికుల వద్దకెళ్లి శ్రమదానం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉదయగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సేవ చేయడమే కూటమి …

Read More »

గడ్డపార చేతబట్టి… డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…

-కొకులవారిపల్లి గ్రామంలో శ్రమదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -శ్రమదానంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ -వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి పొలాల మధ్యకు డొంక రోడ్డుకు శ్రీకారం -కాలినడకన పల్లెపండుగ అభివృద్ధి పనుల పరిశీలన -పూల జల్లులతో స్వాగతించిన గ్రామస్తులు -కొత్త రోడ్లపై గ్రామంలోకి నడిచి వెళ్లిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ -గ్రామ సచివాలయం వద్ద వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో అమరావతి, నేటి పత్రిక …

Read More »

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్దికి చోదకశక్తి

-టెక్నాలజీతో పాలనా విధానాలు మరింత సరళీకృతం -పౌరసేవల్లో నాణ్యతే సామర్ధ్యాల పెరుగుదలకు గీటురాయి -మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ తొలి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు -ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి మొదటి స్థానం, తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా -సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మూడు రాష్ట్రాల అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశాభివృద్ధిలో వచ్చే 20 ఏళ్లు అత్యంత కీలకమని, ఈ కాలంలో ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉందని ముఖ్యమంత్రి …

Read More »

రూ.35కే కేజీ ఉల్లిపాయలు

– ధరల స్థిరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం – తొలి దశలో విజయవాడలోని అన్ని రైతు బజార్లలో నేటి నుండి అమలు – ఆధార్/రేషన్ కార్డు ఆధారంగా కుటుంబానికి నెలకు 2 కేజీలు – ప్రజల డిమాండ్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర …

Read More »

ఉపాధ్యాయుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారు చేయుటకై షెడ్యూలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం, న్యూడిల్లీ వారు కృష్ణా -గుంటూరు జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారు చేయుటకై షెడ్యూలు ఇచ్చియున్నారు. కృష్ణా – గుంటూరు జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఎన్నికల ముందు ప్రతిసారి కొత్తగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ నియోజకవర్గానికి సంబందించి అర్హత గల ఉపాధ్యాయులందరూ కూడా నిర్ణీత ఫారం-19లో తాజాగా సంబంధిత తహశీల్దార్ / MPDO / మున్సిపల్ కార్యాలయములలో దరఖాస్తులను తేది 06.11.2026 లోగా సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్ …

Read More »

మిషన్ కర్మయోగి అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామి

-దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు iGOTలో నమోదు.. 2 కోట్లకు పైగా కోర్సుల పూర్తి -ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాలు, సేవాభావం పెంపొందించడమే లక్ష్యం -ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని ‘కర్మయోగి’గా తీర్చిదిద్దడమే మిషన్ కర్మయోగి లక్ష్యం -కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC) ఛైర్‌పర్సన్, భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి (DoPT) ఎస్. రాధా చౌహాన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘సేవాభావం–నాగరిక్ దేవోభవ’ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ఉద్యోగుల భాగస్వామ్యం 900 కు పైగా శిక్షణా సంస్థలను అనుసంధానించే ‘ఉన్నతి’ ప్లాట్‌ఫామ్ అని …

Read More »

నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంటుగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి

-మచిలీపట్నం జీజీహెచ్ కి డాక్టర్ పద్మశ్రీ -పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ బుజ్జిబాబు -పదోన్నతులు పొందిన 9 మంది ఏడీఎంఈల పోస్టింగులను ఆమోదించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల ప్రభుత్వ సర్వజనాసుపత్రి నూతన సూపరింటెండెంటుగా ప్రముఖ కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ సి.ప్రభాకరరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతo కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలు, సర్వజనాసుపత్రుల్లో ప్రొఫెసర్లగా పనిచేస్తోన్న వారిలో తొమ్మిది మంది ఇటీవల …

Read More »

నూతన డీహెచ్ గా డాక్టర్ వెంకటరమణ –

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజారోగ్య శాఖ (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) ఇంఛార్జి సంచాలకులుగా డాక్టర్ వెంకట రమణ నియమించాలని ప్రభుత్వ నిర్ణయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం తెలిపిన ఆమోదం మేరకు వెంకటరమణ డీహెచ్ గా అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. గత 33 నెలల నుంచి డీహెచ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గా సేవలు అందించిన డాక్టర్ కె. పద్మావతి బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. అడిషనల్ డైరెక్టర్ (ఎన్ఎల్ ఈపీ) హోదాలో …

Read More »