-మచిలీపట్నం జీజీహెచ్ కి డాక్టర్ పద్మశ్రీ
-పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ బుజ్జిబాబు
-పదోన్నతులు పొందిన 9 మంది ఏడీఎంఈల పోస్టింగులను ఆమోదించిన ముఖ్యమంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నంద్యాల ప్రభుత్వ సర్వజనాసుపత్రి నూతన సూపరింటెండెంటుగా ప్రముఖ కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ సి.ప్రభాకరరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతo కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలు, సర్వజనాసుపత్రుల్లో ప్రొఫెసర్లగా పనిచేస్తోన్న వారిలో తొమ్మిది మంది ఇటీవల అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ)గా పదోన్నతులు పొందారు. సీఎం చంద్రబాబు ఆమోదం మేరకు వీరికి పోస్టింగ్ స్థానాలు ఖరారయ్యాయి. ఈ 9 మందిలో ఆరుగురు బీసీ, ఇద్దరు ఎస్సీలు ఉన్నారు.
పోస్టింగుల వివరాలు
కర్నూలు ప్రభుత్వ బోధనాస్పత్రి లో ప్రొఫెసర్ గా ఉన్న డాక్టర్ ప్రభాకర్ రెడ్డి నంద్యాల జిజిహెచ్
సూపరిoడెంటెంట్ గా నియమితులయ్యారు
డాక్టర్ పి.బుజ్జిబాబు (రేడియాలజీ ప్రొఫెసర్-ఆంధ్ర వైద్య కళాశాల) పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా, డాక్టర్ జి.బాలేశ్వరి (పాథాలజీ ప్రొఫెసర్-కర్నూలు) పిడుగురాళ్ల జీజీహెచ్ సూపరింటెండెంటుగా నియమితులయ్యారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల (టీబీసీడీ ప్రొఫెసర్) సునీల్ కుమార్ పాడేరు జీజీహెచ్ సూపరింటెండెంటుగా, డాక్టర్ జి పద్మశ్రీ (జనరల్ సర్జరీ ప్రొఫెసర్- విజయవాడ) మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంటుగా, డాక్టర్ ఆనంద్ (జనరల్ సర్జరీ ప్రొఫెసర్, శ్రీకాకుళం) పలాస కిడ్నీ రీసెర్చి సెంటర్ సూపరింటెండెంటుగా నియమించారు.
కె రాంబాబు (జనరల్ సర్జరీ ప్రొఫెసర్-విశాఖ) రాజమహేంద్రవరం జిజిహెచ్ కు సూపర్నెంట్, కె. మాధవి (బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్- నెల్లూరు) నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంటుగా, డాక్టర్ కె.నవీన్ కుమార్ (ఎనస్తీషియా ప్రొఫెసర్, అనంతపురం) కడప జీజీహెచ్ సూపరింటెండెంటుగా నియమితులయ్యారు.
ఐచ్ఛికాల మేరకు
పదోన్నతులు పొందిన తొమ్మిది మందిలో ఎనిమిది మందికి వారు కోరుకున్న మూడు స్థానాల్లో ఒకచోట పోస్టింగు లభించింది. డాక్టర్ నవీన్ కు మార్ ఎటువంటి ఐచ్ఛికాలను సూచించలేదు.
Prajavartha Online Telugu News