నూతన డీహెచ్ గా డాక్టర్ వెంకటరమణ –

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) ఇంఛార్జి సంచాలకులుగా డాక్టర్ వెంకట రమణ నియమించాలని ప్రభుత్వ నిర్ణయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం తెలిపిన ఆమోదం మేరకు వెంకటరమణ డీహెచ్ గా అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. గత 33 నెలల నుంచి డీహెచ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గా సేవలు అందించిన డాక్టర్ కె. పద్మావతి బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. అడిషనల్ డైరెక్టర్ (ఎన్ఎల్ ఈపీ) హోదాలో పద్మావతి డీహెచ్ ఇంచార్జిగా వ్యవహరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఆమె 37 ఏళ్ల పాటు వివిధ స్థాయుల్లో పని చేశారు.

ఏడుగురి పేర్ల పరిశీలన

ఈ పోస్టు భర్తీ కోసం ఏడుగురు అధికారుల పేర్లను మంత్రిత్వ శాఖ సూచించింది. వీరిలో ఇద్దరిపై నమోదైన ఆరోపణలపై విచారణ సాగుతోంది. మరో ఇద్దరికి కీలకమైన డీఎంఅండ్ హెచ్ఓగా పనిచేసిన అనుభవంలేదు. ఒకరు కేవలం మూడు నెలలు మాత్రమే డీఎం అండ్ హెచ్ ఓ గా (అదనపు బాధ్యతలు) పనిచేశారు. మరోకరు జూన్ మాసంలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డీపీ హెచ్ గా వెంకటరమణ నియామకం జరిగింది. ఈయన ప్రస్తుతం డీపీహెచ్ కార్యాలయంలో అదనపు డైరెక్టర్ (డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం)గా పనిచేస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గడ్డపార చేతబట్టి… డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…

-కొకులవారిపల్లి గ్రామంలో శ్రమదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -శ్రమదానంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *