-కూటమి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
-తిరుపతి ఎస్టీవీ నగర నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
-మే నెలకు సంబంధించిన జూన్ లో పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు 2,60,379 మంది ఫించన్ దారులకు సుమారు 111.74 కోట్ల రూపాయలు పంపిణీకి చర్యలు
-పేదల సంక్షేమానికి కట్టుబడిన ప్రజా సంక్షేమ ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా…ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది వారి ఇంటి వద్దకు వెళ్ళి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేస్తున్నారని, జూన్1న ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒక రోజు ముందుగానే నేడు అందచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
శనివారం ఉదయం తిరుపతి ఎస్టీవీ నగర నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్ సి ముని కృష్ణ ,డిప్యూటీ కమిషనర్ అమరయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారనీ, అలాగే కొనసాగించాలని తెలిపారు. జిల్లాలో మే నెలకు సంబంధించి జూన్ లో పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను 2,60,379 మంది ఫించన్ దారులకు సుమారు 111.74 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ను జూన్ 01 వ తేది ఆదివారం అయినందున ఒక రోజు ముందుగానే ఈ రోజు లబ్దిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్ లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల ఒకటవ తేదీన మీ ఇంటి వద్ద కు వచ్చి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారా అని లబ్ధిదారులను అడిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని కలెక్టర్ కు తెలిపారు. ఎస్టీవీ నగర నందు జయ రామయ్య, వృద్ధాప్య పెన్షన్ రూ.4000, వితంతు పెన్షన్ కింద సుబ్బమ్మ , జమున వారికి రూ.4000 ను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందచేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు తమ జీవనోపాధికి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. tiruఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్, సచివాలయం సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News