Breaking News

పొగాకు రైతులకు గిట్టుబాటు ధరే ప్రభుత్వ లక్ష్యం

-కొనుగోళ్లలో అక్రమాలు, కంపెనీల సిండికేట్‌ను సహించం – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఉన్నతస్థాయి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా ఎస్‌బీవీ స్వామి, టొబాకో బోర్డు ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని పొగాకు ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌లను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు సంస్థ తప్పనిసరిగా ఆక్షన్లలో పాల్గొనాలని, ఆక్షన్లకు దూరంగా ఉండే కంపెనీలపై టొబాకో బోర్డు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పొగాకు కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా టొబాకో బోర్డు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించిన మంత్రి, కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి నాణ్యమైన బేల్స్‌పైనా సీలింగ్ విధించి కృత్రిమంగా ధరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని హెచ్చరించారు. అలాంటి చర్యలు నిర్ధారణ అయితే సంబంధిత కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డు అధికారులను ఆదేశించారు.

పొగాకు రిజెక్షన్ రేటును గణనీయంగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి, అన్ని గ్రేడ్‌ల పొగాకును కంపెనీలు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రైతులు టొబాకో బోర్డు సూచనల మేరకు మాత్రమే తమ పొగాకును ఆక్షన్‌కు తీసుకురావాలని కోరారు. దీనివల్ల రైతులకు మెరుగైన ధర లభించడంతో పాటు రిజెక్షన్ రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. పొగాకును వెంటనే విక్రయించకుండా నిల్వ ఉంచాలనుకునే రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా టొబాకో బోర్డు, బ్యాంకర్లతో చర్చించి రుణ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని, పొగాకు రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సహచర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు స్వయంగా ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌లను సందర్శిస్తూ కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడైనా కంపెనీల సిండికేట్ లేదా అక్రమాలు వెలుగుచూస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డు ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పొగాకు కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదు. ప్రతి రైతుకు న్యాయమైన ధర లభించేలా, కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత ఉండేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అక్రమాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *