జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ ఆవరణలో ఈరోజు నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధునికీకరించిన కృష్ణ ఫార్మర్స్ సొసైటీ భవనాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. భవనంలో చేపట్టిన ఆధునికరణ పనులను పరిశీలించిన నెట్టెం రఘురాం, సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా తీసుకున్న ఈ చర్యలను అభినందించారు. ముఖ్యంగా ఈ పనులను సమర్థవంతంగా అమలు …
Read More »Tag Archives: jaggaiahpeta
జగ్గయ్యపేట లో ఈద్గాలో రంజాన్ వేడుకలు
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ పండుగను పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో గల ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు సామరస్యానికి, సౌహార్దానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పవిత్ర సందర్భంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘు రామ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి, వారికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కూడా పాల్గొని వేడుకకు మరింత గౌరవాన్ని చేకూర్చారు. అయితే …
Read More »నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు
-విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి -షేర్ మహమ్మద్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్‌పేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వంటశాల మరియు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి స్వయంగా భోజనం చేసి ఆహార …
Read More »డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో సైకిల్ యాత్ర
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలనే సదుద్దేశంతో పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర్ బాబు ఐ.పి.ఎస్., నేతృత్వంలో అడ్మిన్ డి.సి.పి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. స్వీయ పర్యవేక్షణలో డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో 34 రోజులపాటు 510 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో బాగంగా 28వ రోజు ఈ సైకిల్ యాత్ర కార్యక్రమం జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిదిలో అత్యంత ఘనంగా ముగిసింది. ఈ రోజు డ్రగ్స్ పై దండయాత్ర 28 వ రోజు 15 కిలోమీటర్ల మేర సాగింది. …
Read More »కమ్యూనిటీ గోకులం ను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సందర్శన
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామంలో కమ్యూనిటీ గోకులం (యానిమల్ హాస్టల్) ను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సందర్శించారు. అక్కడ పశు పోషణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. రూ. 10 లక్షల నిధులతో పల్లెపండగ 2.0 ద్వారా నిర్మించిన గోకులంలో 24 పశువుల సంరక్షణకు సరిపడా సౌకర్యాలు ఉన్నాయి. స్థానిక పాడి రైతులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. షెడ్డుతో పాటు పశువులను కట్టుకునేందుకు సౌకర్యాలు కల్పించారు. ఎండుగడ్డి లేదా పచ్చి మేతను చిన్న, ఏకరీతి …
Read More »గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో యానిమల్ హాస్టళ్లు కీలక పాత్ర
-సీఎం చంద్రబాబు పాలనలో గ్రామాభివృద్ధే లక్ష్యం – ప్రజాసేవే ధ్యేయం : ఎంపీ కేశినేని శివనాథ్ -గుండ్రాయి గ్రామంలో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటన -పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలో బహిరంగ సభ -పల్లె పండుగ 2.0 కార్యక్రమం లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కెడిసిసిబి బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్, విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు లతో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ -రాష్ట్రంలోనే తొలి ‘యానిమల్ హాస్టల్’ ప్రారంభించిన ఎంపీ -గ్రామాభివృద్ధికి ఊతమిచ్చే పలు పనులకు ఘనంగా ప్రారంభోత్సవాలు -కమ్యూనిటీ …
Read More »జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీ నియామకం
-మాజీ మంత్రి కేడీసీసీ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం హర్షం జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీని మొత్తం 17 మంది సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు నియమించడం జరిగింది జరిగింది అని రఘురాం తెలియజేశారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా షేక్ అక్బర్, జనరల్ సెక్రటరీగా గాలిబ్ సైదా షేక్, వైస్ ప్రెసిడెంట్లుగా మిరాహుస్సేన్ షేక్, సోనుమియా షేకూ, ఆడమ్ షేక్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు నియమించబడ్డారు. ఈ నియామకాల …
Read More »సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఎస్.హెచ్.జి మహిళల స్వయం ఉపాధికి ఎంపీ కేశినేని శివనాథ్ తోడ్పాటు
-ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతాయ్య) -హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక బస్సులో బయలుదేరిన 40 మంది ఎస్.హెచ్.జి మహిళలు -జెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) -కేశినేని ఫౌండేషన్ – ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీ పై శిక్షణ -పిబ్రవరి 9వ తేదీ నుంచి 13 వరకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాలయంలో ఐదు రోజుల శిక్షణ -ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో ఎస్.హెచ్.జి మహిళలకు 11వ నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం జగ్గయ్యపేట, …
Read More »అర్హులైన లబ్ధిదారులకు KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ చేతులమీదుగా పెన్షన్ల పంపిణీ
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో అర్హులైన లబ్ధిదారుల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మరియు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెట్టెం రఘురామ్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని వ్యక్తిగతంగా కలిశారు. వారి సమస్యలు, అవసరాలు మరియు అభ్యర్థనలను గమనించి, వ్యక్తిగతంగా పెన్షన్ నగదు అందజేశారు. లబ్ధిదారుల సమస్యలపై చూపిన ప్రత్యేక శ్రద్ధ, వారిలో నమ్మకం మరియు సంతృప్తిని …
Read More »శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మరియు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఈ రోజు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఇరువురు అమ్మవారి దర్శనాల నిర్వహణ, భక్తులకు ప్రసాదాల పంపిణీ విధానం, అలాగే నిర్వహించబడనున్న రంగుల మహోత్సవ ఏర్పాట్లపై కమిటీ సభ్యులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. …
Read More »
Prajavartha Online Telugu News