Tag Archives: rajamendri

జోనోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు, పిల్లులకు ఉచితంగా వ్యాక్సినేషన్ డా రమేష్ చంద్ర

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం జోనోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు పిల్లులకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామని పశువుల ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. టి ఎస్ రమేష్ చంద్ర మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున పెంపుడు కుక్కలకు, పిల్లులకు బుధవారం స్థానిక పశువుల ఆసుపత్రి, దేవిచౌక్ సమీపం, రాజమహేంద్రవరం లో రాబీస్ వ్యాధి రాకుండా నివారణ కోసం ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని యజమానులు సద్వినియోగం చేసుకుని వారి పెంపుడు జంతువులకు ఉచితంగా వ్యాక్సిన్ …

Read More »

అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన తొలితరం వీరుడు….

-కలెక్టర్ డా.కె.మాధవిలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్వతంత్ర సంగ్రామంలో మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన తొలితరం వీరుడని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక పివి నరసింహారావు గోదావరి బండ్ వద్ద అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రం ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, అల్లూరి …

Read More »

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నతమైన శక్తి భారత స్వాతంత్య్రం కోసం స్ఫూర్తి దాతగా పోరాడిన యోధుడు, మన్యం వీరుడు అల్లూరి

-రుడా కార్యాలయంలో భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు -రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నతమైన శక్తి భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు. అగ్గిపిడుగు అల్లూరి సీతరామరాజు, ప్రజల హక్కు కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరుడని , అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధనకు కృషి …

Read More »

రాజమహేంద్రవరం కు విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజాను కలిసిన జిల్లా కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భీమవరం లో జరిగిన అధికారిక కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న అనంతరం రాజమహేంద్రవరం కు చేరుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజాను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత సోమవారం రాత్రి విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంలో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత కూడా ఉన్నారు

Read More »

సోమవారం జిల్లా కలెక్టరేట్లో స్పందన

-కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ – హర్లిక్స్ ఫ్యాక్టరీ …

Read More »

నగరపాలక సంస్థకు అన్ని విధాలా సహకరించాలి

-ఘాట్ల నిర్వాహణ కోసం ప్రత్యేక శానిటేషన్ ఎజెన్సీ -ఎంపి భరత్ రామ్, కమిషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది పరిరక్షణ దిశగా ఘట్లను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు చర్య తీసుకోవడం జరుగుతుందని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పుష్కర్ ఘాట్ లో చేపట్టిన కార్యక్రమంలో నగర్ కమిషనర్ దినేష్ కుమార్ రూడా చైర్మన్ షర్మిలా రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ …

Read More »

కమిటీ సభ్యులు నెలలో రెండు కాలేజీలలో తనిఖీ చెయ్యండి

-పర్యటించిన వాటిపై కమిటీ సమావేశం నిర్వహించాలి -జేసీ శ్రీధర్ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య నేపథ్యంలో జిల్లాస్థాయిలో జిల్లా పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. తనిఖీల్లో ర్యాగింగ్, తదితరు అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ అధ్యక్షులు గా, జిల్లా వృత్తి విద్యా అధికారి జే విఎస్ఎస్ సుబ్రహ్మణ్యం కన్వీనర్ గా, జిల్లా మానిటరింగ్ కమిటీ …

Read More »

బోధన వైద్య కళాశాల పి ఈ బి స్ట్రక్చర్ పనులను తనిఖీ చేసాము

-ముఖ్యమంత్రి ఆదేశాలతో మెడికల్ కాలేజీ పనులపై క్షేత్ర స్థాయి లో పర్యటించడం జరిగింది -మెడికల్ ఎడ్యుకేషన్ సంచాలకులు డా. రాఘవేంద్ర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బోధనా ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని, ఇందు కోసం పెద్ద మొత్తం లో నిధులను మంజూరు చేయడం జరిగిందని మెడికల్ ఎడ్యుకేషన్ సంచాలకులు డా. రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న భోధనా వైద్య కళాశాల “మేక్ షిఫ్ట్ – పిఈబి” పనుల పురోగతిని …

Read More »

నగరపాలక సంస్థ అభివృద్ది పనులపై సమీక్ష

-పౌర సేవలు అందించే క్రమంలో 9494060060 నంబర్ గల వాట్సాప్ ప్రారంభం. -అధికారులు, సిబ్బంది త్రాగునీరు, పారిశుధ్యం కి ప్రాధాన్యత ఇవ్వండి -తొలుత రూడా కార్యాలయం సందర్శన.. విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి -శానిటేషన్ సిబ్బంది జీతాలు రూ.18 వేలు చేసిన ఘనత జగన్ననదే -మంత్రి ఆదిమూలపు సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. …

Read More »

పి.ఎం.ఎ.వై. ( పట్టణ) వై ఎస్ ఆర్ జగనన్న నగర్ టిడ్కో ఇళ్ళు పంపిణీ..

-3424 మందికి ఇళ్ళ పత్రాలు, తాళాలు అందజేసాం.. -ఇళ్ల నిర్మాణం కోసం రూ.4,500 కోట్లు వెచ్చించాం. – పేదలకు స్వంత ఇంటి కలను నెరవేర్చి ఆస్తి హక్కు కల్పించాం … -మంత్రులు ఆదిమూలపు సురేష్, -సిహెచ్ వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు సొంతింటి కల సాకారం చెయ్యడం జరిగిందని, రూ.280 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి వారి జీవితాల్లో ఆనందం సంతృప్తి కలిగిస్తోందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , జిల్లా ఇంఛార్జి …

Read More »