Breaking News

ఈకేవైసీలో పేర్లు లేని రేషన్ కార్డు దారులు వెంటనే నమోదు చేయించుకోవాలి…

-వాణిజ్య వ్వాపార సముదాయాల్లో నోమాస్క్ నో సేల్ విదానాన్ని పాటించాలి…
-డివిజన్ లో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం…
-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ పరిధిలో కోవిడ్ నియంత్రణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు.
బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కోవిడ్ కేసుల ప్రభావం తగ్గినప్పటికీ నియంత్రణే లక్ష్యంగా మాస్కు ధరిచండం, భౌతిక దూరం శానిటైజర్సు వినియోగం నిబంధలను పాటించాలని అన్నారు. డివిజన్ పరిధిలో 13 కోవిడ్ పాజటివ్ కేసులు మమోదయ్యాయన్నారు. గుడివాడ పట్టణంతో పాటు నందివాడ, మండవల్లి మండలాల్లో కోవిడ్ పాజటివ్ కేసులు నమోదు అవుతన్న దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి వారం వాలంటరీ, ఆశా, వైద్య సిబ్బంది ఇంటింటీకీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారన్నారు. వాణిజ్య వ్వాపార దుకాణాల్లో నోమాస్క్ నో సేల్ అనే విధానం పాటించాలన్నారు. వినియోగదారునితో పాటు దుకాణ యజమానులు తప్పనిసరిగా మాస్కులు ధరంచాలన్నారు. ఇందుకు విరుద్దంగా ఏవరైనా కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే అటువంటి దుకాణ దారులపై చర్యలు తీసుకుంటా మన్నారు. థర్డ్ వేవ్ లో చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
రేషన్ కార్డు దారులు తమ పేర్లును ఈకై వైసీలో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలి.. ఆర్డీవో శ్రీనుకుమార్
ఇప్పటి వరకు ఈకేవైసీ లో పేర్లు నమోదు లేని రేషన్ కార్డు దారులు ఈ నెల 25 లోపు నమోదు చేయించుకోవాలని లేకుండా సెప్టెంబరు మాసం నుంచి సరఫరా చేసే నిత్యావసర సరుకులు నిలుపు దల చేయడం జరుగుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్ అన్నారు. గుడివాడ పట్టణంలో ఈకేవైసీలో నమోదు నిమిత్తం పోష్టాఫీసు వద్ద మహిళలు గుంపులు గా ఉంటున్నారని, కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ క్యూ పద్దతి పాటించాలన్నారు. పట్టణ పరిధిలో మున్సిపల్ కమీషనరు ఈకేవైసీ నమోదు నిమిత్తం అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నారని అనుమతులు రాగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *