Breaking News

“ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమానికి ఏడో రోజూ విశేష ప్రజాదరణ

-ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 17.61 లక్షల ఇళ్లను సందర్శించిన కూటమి శ్రేణులు
-ఆదివారం అయినా కార్యక్రమం దిగ్విజయంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హర్షం
-టెలీ కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ శ్రేణులను అభినందించిన పల్లా
-కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తున్న యువనేత నారా లోకేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఏడో రోజూ విజయవంతంగా కొనసాగింది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

ఏడో రోజు రాష్ట్రవ్యాప్తంగా 3,01,197 ఇళ్లను సందర్శించగా, కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు రోజుల్లో 17,61,197 ఇళ్లను కూటమి శ్రేణులు సందర్శించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలన, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించారు.

కార్యక్రమ నిర్వహణపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదివారం జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సెలవు రోజు అయినప్పటికీ పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు.

ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు విశేష ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొనడం, అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి లభిస్తున్న సానుకూల స్పందన ఈ కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు నారా లోకేష్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *