Breaking News

అభివృద్ధికి చిహ్నం జగనన్న ప్రభుత్వం


-పేద బలహీనవర్గాల జీవితాలలో వినూత్న మార్పులు తీసుకువచ్చిన జగనన్న
-సంక్షేమ పథకాల అమల్లో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలిచింది
-హోం శాఖ మంత్రి తానేటి వనిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలలో పేదవారిని కూడా గుర్తించి చేయూత ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి జగనన్న వారి జీవితాలలో వినూత్నమైన మార్పులు తీసుకువస్తున్నారని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోం శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి తానేటి వనిత అన్నారు.
విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 43వ డివిజన్‌, భవానీపురం ఐరన్‌ యార్డ్‌ నందు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన సిసిరోడ్లును శనివారం స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడంతో పాటు సంక్షేమ అభివృద్ధి పథకాలను చేరువ చేస్తూ ఆదర్శవంతమైన యువ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ప్రఖ్యాతలు పొందుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు పేద ప్రజలకు ముఖ్యంగా మహిళమ్మతల్లులకు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆదరణతో ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టి 3 సంవత్సరాలలో పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలలోని పేదవారిని కూడా గుర్తించి వారికి కూడా సంక్షేమ ఫలాలను అందించిన ఎకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని మంత్రి అన్నారు. పేదల బ్రతుకులను మార్చడానికి వారి పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించడానికి అమ్మఒడి, జగనన్న కానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి అనేక పథకాల ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ను అందిస్తున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి సహసోపేతమైన నిర్ణయాలను తీసుకోలేకపోయారన్నారు. ఎన్నికల మ్యాన్‌ప్యాస్టోలో పేదవారికి 25 లక్షల ఇంటి స్థలాలు అందిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి మించి 32 లక్షల మంది పేదలకు నేడు ఇళ్ల స్థలాలను నేరుగా మహిళాల పేరున పట్టాలు ఇచ్చి గృహాలు నిర్మించేందుకు సహాయ పడుతున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్మికులను గుర్తించి వారికి వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయడంతో పాటు జగనన్న చేదోడు పథకం ద్వారా చిరువ్యాపారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఇటువంటి ముందుచూపు కలిగి అభివృద్ధి పథం వైపు వడివడిగా అడుగులు వేస్తూ అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, అన్నతమ్ములకు, విద్యార్థిని విద్యార్థులకు నేను ఉన్నానంటూ భరోసా ఇస్తున్న యువ ముఖ్యమంత్రి మనకు దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమని మంత్రి తానేటి వనిత హర్షద్వానాల మధ్య ప్రకటించారు.
మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారని ఏనాడు భవానిపురం ఐరన్‌ యార్డ్‌ అభివృద్ధి వైపు కన్నెత్తి చూడలేదన్నారు. తాను శాసనసభ్యునిగా ఎన్నికైన తరువాత ముఖ్యమంత్రి సహకారంతో ఈ ప్రాంతానికి నిధులు మంజూరు చేయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గం నుండి 19 మంది కార్పొరేటర్ల గెలుపే అభివృద్ధికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్‌ ఇతర అధికారుల సహకారంతో ఈ ప్రాంతాన్ని మరో గచ్చిబౌలి సిటిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని నివారించి జూట్‌ బ్యాగులను వినియోగించాలని పలుపు నిస్తూ జూట్‌ బ్యాగులను విడుదల చేసి ప్రజలకు పంపిణీ చేశారు.
తొలుత మంత్రి తానేటి వనిత, స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌రావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పునకర్‌ ఐరన్‌ యర్డ్‌లో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పునకర్‌, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, శాసన మండలి సభ్యులు రుహుల్లా, శాసన సభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి, స్థానిక నాయకులు దేవినేని అవినాష్‌, ఐరన్‌ యార్డ్‌ మర్చెంట్స్‌ వెల్ఫేెర్‌ అసోసియేషన్‌ అధ్యక్షలు కె కామేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్‌ బి. కోటిరెడ్డి, వివిధ డివిజన్‌లకు చెందిన కార్పొరేటర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *