Breaking News

నిబద్దత గల అధికారిగా బి. సుబ్బారావుకు గుర్తింపు…

-కలెక్టరు మాథవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలనా దక్షతకు నిదర్శనంగా, నిబద్దతకు మారు పేరుగా జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు నిలుస్తారని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. ఇటీవల ఐఏఎస్ సర్వీసుకు నిర్థారణ అయిన నేపధ్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టరు సిహెచ్ శ్రీధర్, జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలుపుతూ డిఆర్వోను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ సుదీర్ఘమైన ప్రభుత్వ సర్వీసులో ఎన్నో హోదాలను భాద్యతతో నిర్వర్తించి నిబద్దత గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత సుదీర్ఘనమైన పాలనా అనుభవం ఉన్న బి. సుబ్బారావును తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా ఒత్తిడిని అధిగమించి అటు అధికారులు, ఇటు సిబ్బంది మన్ననలు పొందారన్నారు. ఆయన పని తీరను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ కేడరకు పదోన్నతి కల్పించడం సంతోషదాయమని కలెక్టరు తెలిపారు.

ఈ సందర్బంగా డిఆర్వో బి. సుబ్బారావు మాట్లాడుతూ 1990 సం.రం లో ప్రభుత్వ సర్వీసులో జాయిన్ అయి 2004 లో డిప్యూటీ కలెక్టరుగా పదోన్నది పొంది విశాఖపట్నం స్మాల్ సేవింగ్స్ డిప్యూటీ డైరెక్టరుగా వ్యవహరించాన్నారు. 2005 లో విశాఖపట్నం టూరిజం అధికారిగాను, 2006-2011 మద్య ఫారెస్టు సెటిల్ మెంట్ అధికారిగాను, 2011-2013 నూజివీడు ఆర్డీవో గాను, 2014-2016 మద్య కృష్ణా, గుంటూరు జిల్లాల జెడ్పీ సీఈవో గాను 2016 లో ఏపీ ఐఐసీ ఈడీ హోదాలోను పనిచేసామన్నారు. తదుపరి 2019-2022 మద్య విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ ఎస్టేట్ మేనేజరుగా భాద్యతలు నిర్వహిస్తూ 11.4.2022 వ తేదీన నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు రెవెన్యూ అధికారిగా భాద్యతలను చేపట్టానని డిఆర్వో బి. సుబ్బారావు తెలిపారు. ఈ సందర్బంగా పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టరు సమక్షంలో బి.సుబ్బారావును ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *