రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పౌర సేవలు, ఇండ్ల నిర్మాణం, ఎస్ హెచ్ జి రుణాలు, నాడు నేడు లో చేపట్ట వలసిన పనులు పై నిరంతరం క్షేత్ర స్థాయి అధికారులకు దిశా నిర్దేశనం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కోన్నారు.
గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వివిధ శాఖల ఉన్నతాధికారులు స్పందన ఫిర్యాదులు, సచివాలయ సేవలు, ఇండ్ల నిర్మాణాలు, మెడికల్ పరంగా సుస్థిర ప్రగతి లక్ష్యాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డి ఆర్వో జీ. నరసింహులు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన బడి విసి కి క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్లు విషయంలో భాగంగా ఇప్పటి వరకూ 24,459 మంది లబ్ధిదారులకు అదనపు బ్యాంకు రుణాలు కల్పించడం ద్వారా ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేశామన్నారు. జిల్లాలో 47,936 మంది లబ్దిదారులు చేత ఇంటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పౌర సేవలు అందించే సామర్థ్యం పెంచే దిశలో ఈ వారంలో 27,393 సేవలు జిల్లాలోని 512 సచివాలయాలు ద్వారా సగటున 54 సేవలు అందించడం జరుగుతోందని, రాష్ట్ర సగటు కంటే 13 శాతం అధికంగా ఉందన్నారు. మరింతగా ప్రజా సమస్యకు పరిష్కారం చూపే అవకాశం పై దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మేరకు ఎనిమిది అంశాల తో కూడి జిల్లాలోని 6,49,315 ఇంటింటి సర్వే లో భాగంగా 5,63,229 (86.83 శాతం) ఇళ్ళ నుంచి డేటా సేకరణ పూర్తి చేశామన్నారు.
జగనన్న తోడు పథకం అమలులో మొత్తం 14651 మందిని గుర్తించి, వారిలో ఇప్పటి వరకూ 6,157 మందికి బ్యాంకు రుణాలు మంజూరు చేయించి నట్లు మాధవీలత పేర్కొన్నారు. స్పందన లో 509 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో పది రోజుల వ్యవధిలో పరిష్కారం చూపాల్సీనవి 401 ఉన్నాయన్నారు. జిల్లాలో తిరిగి వచ్చిన అర్జీలు 114 ఉండగా, వాటిని పరిష్కారం చూపడం జరిగిందనీ, ఆమేరకు 100 శాతం పరిష్కారం చూపినట్లు వివరించారు.
మన బడి నాడు నేడు కింద జిల్లాలో 675 , పాఠశాలలు,15 కళాశాలల్లో చేపడుతున్న 1012 పనుల్లో 1006 పనులకు సంబంధించి రూ.271 .97 కోట్లతో పనులు చేపట్టవలసి ఉందన్నారు. జిల్లాలో కొనసాగుతున్న నాడు నేడు పనుల్లో 53 శాతం పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మండలాలు వారీగా స్కూల్స్ లో జరుగుతున్న పనులపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ లక్ష్యాలను ఇస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News