Breaking News

స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి : జిల్లా జాయింట్ కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి. కె. బాలాజీ అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమoలో డి ఆర్ ఓ శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం అర్జీలు 68 రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 56 , పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 03, పోలీస్ శాఖ సంబంధించి 01, విద్యాశాఖకు సంబంధించి 01, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కు సంబంధించి 2, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖకు సంబంధించి 02, ఆర్&బి శాఖ కు సంబంధించి 1, డ్వామా 1, విద్యుత్ శాఖకు సంబంధించి 1 అర్జీలు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *