రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన అర్జీలకు సంబంధించి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కాల పరిమితి లోపుగా పరిష్కారం చూపడం జరగాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. రబీ సీజన్ లో ఈ క్రాప్ బుకింగ్ నమోదు సమాంతరంగా చేపట్టాలన్నారు.
గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి అమరావతి నుంచి రెవెన్యూ, భూసేకరణ, స్పందన, రీ సర్వే, కోర్టు కేసులు, హౌసింగ్, వ్యవసాయ అనుబంధ శాఖల, పి ఎం కిసాన్ నిధి, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల ప్రగతి, ఆరోగ్య పరంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ విసి హల్ నుంచి కలెక్టర్ కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , ఇతర జిల్లా, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లా పరిధిలో జాతీయ రహదారులు , తదితర అంశాలకు చెందిన 72 హెక్టార్ల మేర భూసేకరణ చేపట్టవలసి ఉందని, ఇందులో 5 హెక్టార్ల ప్రభుత్వ భూమి, ప్రవేటు భూమి సేకరణ కై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 149874 లబ్దిదారుల డేటా ను ఈ కేవైసి పూర్తి చేసి, 1,01,358 మందిని అర్హులుగా గుర్తించి, 99,758 మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. క్షేత్ర స్థాయి లో ప్రతి శనివారం లే అవుట్ లలో పర్యటించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇండ్ల స్థలాలకు చెంది మ్యూటేషన్ 651 కి గాను 389 పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఎన్ పి ఐ పేదలందరికీ ఇళ్లు 90రోజుల కార్యక్రమం లో మొత్తం 13,952 దరఖాస్తులు రాగా వాటిలో అర్హులు గా 9354 మంది కి సైట్స్, 65 మందికి టిడ్కో గృహాలకు అర్హులుగా గుర్తించామన్నారు. జగనన్న లే అవుట్ లలో విద్యుత్ , త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. స్పందన కి చెంది 3, 721అర్జీలు రాగా 3,499 లు పరిష్కరించి, మిగిలిన 212పురోగతిలో ఉన్నాయన్నారు. స్పందన అర్జిల్లో జిల్లాలో పారిశుధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ, రెవెన్యూ రికార్డులు, భూ సమస్యల పరిష్కారం, ఆక్రమణల తొలగింపు అంశాలపై దృష్టి పెట్టడం జరుగుతుందని మాధవీలత పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాలు కి సంబంధించి గృహ లబ్దిదారుల ఖాతాకు రూ.12 కోట్లు మేర జమ అయినట్లు తెలియ చేశారు.
అంతకు ముందు ఉదయం సిసిఎల్ఏ కమిషనర్ వైయస్ఆర్ జగనన్న భూ హక్కు & భూ రక్షా పథకం అమలు పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 134 గ్రామాల్లో 2051 కిమీ మేర డ్రోన్ సర్వే చేపట్ట వలసి ఉండగా 93 గ్రామాల్లో 1809 కిమీ పూర్తి చేసినట్లు కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. రీ సర్వే లో మొత్తం 1860 అప్పీల్స్ రాగా ఇప్పటి వరకు అన్ని అప్పీల్స్ పరిష్కరించా మన్నారు. సరిహద్దు రాళ్ళు ఏర్పాటు 31 గ్రామాలకు గాను 19 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. 35 హబిటేషన్స్ కు గానూ 13 చోట్ల పూర్తి చేసి, మిగిలిన 22 చోట్ల పురోగతి లో ఉన్నాయని తెలిపారు. మ్యూటేషన్స్ కి చెంది 1963 లో 1490 పరిష్కారం చేసి, 350 తిరస్కరించినట్లు, మిగిలినవి పరిశీలన దశలో ఉన్నాయన్నారు. ల్యాండ్ కన్వర్షన్ కి చెంది 6,661 దరఖాస్తులు వచ్చాయన్నారు. ల్యాండ్ ప్యురిఫికేషన్ కి చెంది 272 రెవెన్యూ గ్రామ పంచాయతీలలో 270 పిఓఎల్ఆర్ పూర్తి చేశామన్నారు.
Prajavartha Online Telugu News