Breaking News

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ క్రాంతిని గుంటూరు నగరానికి నగర పాలక సంస్థ సంక్రాంతి సంబరాల ద్వారా తెచ్చిందని జిల్లా కలెక్టర్ యం. వేణుగోపాల రెడ్డి అన్నారు. బుధవారం యన్.టి.ఆర్ స్టేడియంలో గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న సంక్రాంతి సంబరాల బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ యం.యల్.సి అప్పిరెడ్డి, మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, కమీషనర్ కీర్తి చేకూరి, అధికారులు, ప్రతినిధులు ఆవిష్కరించారు.
నగర మేయర్ అధ్యక్షతన జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కల్లెక్టర్ మాట్లాడుతూ, సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగ అని, సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాలలో జరిగే పండుగ శోభను నగర పాలక సంస్థ గుంటూరు నగర్ ప్రజలకు చేరువ చేసిందన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి రైతు తన పంట చేతికి వచ్చిన సందర్భంగా ఆనందంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి అని అటువంటి పండుగ గుంటూరు నగరంలో జరుగుతుందని, నగర ప్రజలు సంక్రాంతి సంబరాలు ఆస్వాదిస్తారని కోరుకున్నారు.
యం.యల్.సి మాట్లాడుతూ, నగర మేయర్ ప్రత్యేక చొరవతో యన్.టి.ఆర్ స్టేడియం లో 5 రోలుల పాటు సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరగనున్నాయని, మనం మరచిపోతున్న గ్రామీణ సాంప్రదాయాలను సంస్కృతిని నేటి తరానికి చూపించడానికి ఈ సంబరాలు దోహదపడుతాయన్నారు.
మేయర్ మాట్లాడుతూ, కోవిడ్ వాళ్ళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈ ఏడాది ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ అందరి సహకారంతో సంక్రాతి సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహించానున్నామన్నారు. సాంప్రదాయ క్రీడలు కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతి రోజు పండుగ వాతావరణం ఉంటుందన్నారు.
కమీషనర్ మాట్లాడుతూ, 11,12 క్రీడలు, 13,14,15 సంక్రాంతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించుట జరిగిందన్నారు. సంక్రాంతి సంబరాల ద్వారా గ్రామీణ సంస్కృతిని మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల చారిత్రక వారసత్వ సాంస్కృతిక అంశాలను నేటి తరానికి అందించడానికి సంక్రాంతి సంబరాలు మంచి అవకాశం అన్నారు.
బుధవారం ఉదయం సంక్రాంతి సంబరాలలో భాగంగా గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్ధులకు వివిధ క్రీడాంశాలలో ప్రారంభమైన పోటీలను మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, యం.యల్.సి లేళ్ళ అప్పిరెడ్డి, యం.యల్.ఏ మద్దాలి గిరిధర్ తదితరులు ప్రారంభించారు.
సదరు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, కార్పొరేటర్లు, డిప్యూటీ కమీషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఈ.ఈ సుందర రామి రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *