Breaking News

జగనన్న ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో దూసుకెళ్తుంది : హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగ్రామిగా నిలిపిన సంక్షేమాభివృద్ధి సారధి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం 160వ రోజు కొవ్వూరు మండలం దొమ్మేరు, పెనకనమెట్ట గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ నాయకులతో కలిసి హోంమంత్రి విస్తృతంగా పర్యటించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని కుటుంబ సభ్యులకు వివరించారు. గడప గడపకు కార్యక్రమంలో అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ.. హోంమంత్రికి హారతులతో ఆహ్వానాలు పలికారు. సోమవారం ఉదయం దొమ్మేరు లో జగనన్న లే అవుట్-1 లో ప్రారంభించగా రాత్రి పెనకనమెట్ట వరకూ కొనసాగించారు. పెనకనమెట్ట గ్రామంలో ఉదయం లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి గ్రామంలో గడప గడపకు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి హోం మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోని అమలు కానని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ లోనే అమలవుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా జరగనన్ని విద్యాసంస్కరణలు మన రాష్ట్రంలో జరిగాయన్నారు. వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తూ జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి కుటుంబాన్ని కి ఉచితంగా వైద్యాన్ని అందించామన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే  దక్కుతుందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం రూపొందించారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా 100 శాతం సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమంపై ముద్రించిన బుక్లెట్ అందిస్తూ ప్రతి కుటుంబానికి అంకెలతో సహా వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *