విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారులు యన్ చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సలహదారులు యన్ చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు వేడుకలలో హాజరై న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు మాట్లాడుతూ సంక్షేమ సంతకాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం మధ్య లో దళారీ వ్యవస్థ లేకుండా చేసినందువల్ల సరాసరి లబ్దిదారులకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని, అందువల్ల పేదవర్గాలవారి కి భరోసా దొరికిందని, అలాగే ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్ కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసినందుకు ధన్యావాదాలు తెలియజేయుచున్నాము, అలాగే మరికొంతమంది ఉద్యోగులు రెగ్యులర్ కోసం ఎదురుచూస్తున్నారని, వారికి కూడా పూర్తిస్థాయిలో వందశాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ ఉద్యోగుల కు రావాల్సిన రాయితీలను వెంటనే విడుదల చేయుటకు సలహాదారులు కృషి చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేట్ కట్ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకురాలు కె.పద్మ, బాపట్ల జిల్లా అధ్యక్షుడు సత్యం రాజు, యన్ టి ఆర్ జిల్లా అధ్యక్షులు కోటా రవి, కృష్ణా జిల్లా నాయకులు కంచర్ల వెంకటేశ్వరరావు,ప్రకాశం జిల్లా నాయకులు శేఘ,తూర్పుగోదావరి జిల్లా నాయకుడు రాయుడు శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు ప్రసాద్ బాబు, శ్యాం కృష్ణ, నెల్లూరు జిల్లా నాయకులు రసూల్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News