Breaking News

మామిడి రైతుల అభివృద్ధికి స‌హ‌కారం అందిస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపిని క‌లిసిన రెడ్డి గూడెం రైతు ఉత్పత్తి దారుల సంఘం(FPC) సభ్యులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు ఉత్పత్తి దారుల సంఘం స‌భ్యుల అభివృద్ధికి ఎప్పుడు అండ‌గా వుంటాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. గ‌న్న‌వ‌రం నుంచి మామిడి కాయ‌లు విదేశాల‌కు ఎగుమ‌తి చేసే విధంగా కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తో మాట్లాడ‌తాన‌ని చెప్పారు. ఎయిర్ కార్గో లో ఎగుమ‌తి చేసేందుకు కావాల్సిన దిగుబ‌డి పెంచాల‌ని సూచించారు.

గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ శ‌నివారం మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రెడ్డి గూడెం మండ‌లానికి చెందిన ఎఫ్.పి.సి స‌భ్యులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసి నాణ్య‌త గ‌ల మామిడికాయులు పండించేందుకు ఫ్రూట్స్ క‌వ‌ర్స్, ప్లాస్టిక్ ట్రేలు, దాపోలీ హార్వెస్టర్లు ల‌కు ప్ర‌భుత్వం త‌రుఫున స‌బ్బి డీ ఇప్పించాల‌ని రెడ్డి గూడెం రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్.పి.సి) స‌భ్యులు ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరారు. తాము పండించిన మామిడికాయలు ఎంపి కేశినేని శివ‌నాథ్ కి చూపించి వాటి నాణ్య‌త‌, పండించే విధానం వివ‌రించ‌టం జ‌రిగింది.

అలాగే ప్ర‌స్తుతం రెడ్డి గూడెం మండ‌లంలోనే క్వాలిటీ మ్యాంగోస్ ఉత్పత్తి కోసం ఫ్రూట్ కవర్స్ వాడ‌టం జ‌రుగుతుంద‌ని, ఆ ప్రూట్స్ క‌వ‌ర్స్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండ‌లాల్లో వాడే విధంగా అవ‌గాహ‌న క‌ల్పిస్తే నాణ్య‌త గ‌ల మామిడి కాయ‌ల ఉత్ప‌త్తి పెరిగే అవ‌కాశం వుంటుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కి తెలిపారు.

రెడ్డిగూడెంలో ఆగిపోయిన‌ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను త్వరగా ప్రారంభించేందుకు కృషి చేయాలని ఎఫ్.పి.సి స‌భ్యులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను కోరారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై ఎంపి కేశినేని శివ‌నాథ్ సానుకూలంగా స్పందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎఫ్.పి. సి డైరెక్టర్స్ చేబ్రోలు కృపారాజు, కొండపల్లి పరమేశ్వరరావు, ఎఫ్.పి. సి సభ్యులు చేబ్రోలు శ్రీనివాసరావు, సి.హెచ్. నాగప్రసాద్, కొండపల్లి మణి కంఠ, అడపా బసవయ్య, సి.హెచ్. రాజు, సి.హెచ్. సాంబశివ రావు, హార్టికల్చరల్ అధికారి నరేంద్ర కుమార్, ఫ్రూట్ టెక్ కంపెనీ అధినేత అప్పారావు ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *