Breaking News

Monthly Archives: March 2025

ర‌క్షిత మంచినీటి ట్యాంకుల ప‌రిశుభ్ర‌తకు అత్యంత ప్రాధాన్య‌మివ్వండి

– ఎప్ప‌టిక‌ప్పుడు నీటి నాణ్య‌త ప‌రీక్ష‌లూ నిర్వ‌హించాలి – ఎక్క‌డా తాగునీటి స‌మ‌స్య త‌లెత్త‌కూడ‌దు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎక్క‌డా తాగునీటి స‌మ‌స్య అనేది ఉండ‌కూడ‌ద‌ని.. ర‌క్షిత తాగునీటి ప‌థ‌కాల ట్యాంకుల ప‌రిశుభ్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మివ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ నందిగామ నియోజకవర్గంలో క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు చేశారు. గ్రామాల్లో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ల‌క్ష్యంగా విస్తృతంగా ప‌ర్య‌టించారు. తొలుత నందిగామ మండలం, అంబారుపేట గ్రామంలో …

Read More »

ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలుర తో మరియు వారి కుటుంబ సభ్యుల తో మాట్లాడి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉచితంగా న్యాయవాదిని పొందడం వారి హక్కు అని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి అందిస్తున్న సేవల గురించి వివరించారు. వసతి గృహములో …

Read More »

జిల్లా నుంచి ప్రతిపాదించిన హై గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం

-మొబైల్ సైన్స్ ల్యాబ్స్ ద్వారా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సాధికారత కల్పించడం లక్ష్యం -గ్రామీణ విద్యార్థుల్లో సైన్స్ ఎడ్యుకేషన్ యాక్సెస్‌ని మెరుగుపరచడానికి వినూత్న విధానం -జాతీయ స్థాయిలో షార్ట్‌లిస్ట్ చేసిన స్క్రీనింగ్ కమిటీ ఎంపిక -న్యూ ఢిల్లీ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి న్యూ ఢిల్లీ/రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హై గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమము విజయవంతంగా నడుస్తున్నదని , …

Read More »

మార్చి 20లోగా “ఐగాట్ కర్మయోగి” కోర్సులు పూర్తిచేయాలి

-నిరంతర స్వీయ అభ్యసనంతో సమర్ధవంతంగా విధుల నిర్వహణ సాధ్యం -హార్ట్ ఇన్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓరియెంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ కోర్సులు -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునికతకు అణుగుణంగా, ప్రజల అవసరాలకు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న క్రమంలో సమర్థవంతంగా సేవలందించాలన్నా.. భవిష్యత్తు కార్యాచరణకు సర్వసన్నద్ధంగా ఉండాలన్నా నిరంతర అభ్యసం అవసరమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ …

Read More »

ప్ర‌జారోగ్యానికి కీల‌క‌మైన మందుల స‌ర‌ఫ‌రాపై ప‌టిష్ట‌మైన నియంత్ర‌ణ ఉండాలి

-డ్ర‌గ్ ఇన్స్‌పెక్ట‌ర్లు మొక్కుబ‌డి త‌నిఖీల‌తో స‌రిపెట్ట‌కూడ‌దు -త‌నిఖీల సంఖ్య, నాణ్య‌త త‌గ్గ‌డంపై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆందోళ‌న‌ -మందుల నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ(డిసిఎ) ప‌నితీరుపై మంత్రి సుదీర్ఘ స‌మీక్ష‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జారోగ్యానికి కీలక‌మైన మందుల నాణ్య‌త‌, స‌ర‌ఫ‌రాల‌పై నియంత్ర‌ణ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేష‌న్ (డిసిఎ) అధికారుల్ని ఆదేశించారు. డిసిఎ ప‌నితీరు, సాధిస్తున్న ఫ‌లితాల‌పై బుధ‌వారంనాడు వెల‌గ‌పూడిలోని ఏపీ స‌చివాల‌యంలో దాదాపు మూడు గంట‌ల పాటు స‌మీక్ష చేప‌ట్టారు. ప్ర‌భుత్వ …

Read More »

తలసీమియా రోగుల్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది

-అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తలసీమియా వ్యాధితో బాధపడుతున్న రోగులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తలసీమియా రోగులకు అందుతున్న చికిత్స, ఆర్ధిక సాయం వంటి అంశాలపై బుధవారం శాసనసభలో బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తలసీమియా రోగి పరిస్థితి తీవ్రత, అందుతున్న చికిత్స , ప్రభుత్వ, లేదా ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారా అన్న అంశాలపై వ్యాధి …

Read More »

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, కలెక్టర్ల సదస్సు, స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర, పాజిటివ్ పబ్లిక్ పర్సిప్షన్, పీ4 సర్వే, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు అందించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ , నగర పాలక సంస్థ కమిషనర్ పులి …

Read More »

మార్చి 15 వ తేదిన నిర్వహించే శ్రీనివాస కళ్యాణోత్సవం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్ళూరు మండలం వెంకటపాలెం లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మార్చి 15 వ తేదిన నిర్వహించే శ్రీనివాస కళ్యాణోత్సవం కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో బుధవారం టీటీడీ కార్యనిర్వహణ అధికారి జే.శ్యామల రావు , జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ కార్యనిర్వహణ అధికారి జే.శ్యామల రావు మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవంలో …

Read More »

అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదుకు చివరి తేదీ 10 ఏప్రిల్ 2025. ఒక అభ్యర్థి ఇప్పుడు రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ) మొట్టమొదటిసారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషల్లో నిర్వహించబడుతోంది. అదనంగా, 1.6 కిలోమీటర్ల …

Read More »

జిల్లాలో వరి ధాన్య రైతులకు మద్దతు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్య సేకరణపై 12.03.2025 నేటి బుధవారం వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, PACS, అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రైతులకు వరిధాన్య సేకరణకు అన్ని చర్యలు, అలాగే కనీస మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీమతి వై.సుమతి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్, శేషురాజు జిల్లా పౌరసరఫరాల …

Read More »