-సి.పి.ఐ. రామకృష్ణ, మాజీ ఎం.ఎల్.సి. జల్లి విల్సన్ విజ్ఞప్తి మేరకు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాపితంగా మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు ఏళ్ళ తరబడి ప్రజాజీవితంలో మమేకమై సేవలు చేశారు. నేటికీ చేస్తున్నారు కూడా. వీరు వయస్సు మీరడంతో వృద్ధాప్యంలో పలు శారీరక రుగ్మతలతో, ఆర్థిక యిబ్బందులతో, కుటుంబ భారాలతో సతమతమవుతున్నారు. వీరిలో ఎక్కువమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదవారే వున్నారు. అధిక ధరలు, నిత్య అవసరాలు పెరిగిపోయిన దృష్ట్యా మాజీ ప్రజాప్రతినిధులకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం …
Read More »Monthly Archives: March 2025
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకై ఈ నెల 14న నిరసనలకు సిపిఐ మద్దతు
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం, స్టీల్ ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించి, సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మద్దతు ప్రకటించారు. సిపిఐ శ్రేణులు ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయరాదనిÑ విశాఖ ఉక్కుకు …
Read More »టీడీపీ ఆవిర్భావంతోనే మహిళా సాధికారత ప్రారంభం…మహిళా సాధికారతతోనే సుస్థిర అభివృద్ధి
-నిన్న-నేడు-రేపు ఎప్పుడూ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం -ఏడాదిలో 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేస్తాం. -33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే 75 మంది ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వస్తారు -మే నెలలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేల చొప్పున ఇస్తాం -డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం -శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘టీడీపీ, మహిళలది అన్నాచెల్లెళ్ల బంధం. మహిళా సాధికారతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. …
Read More »160 రకాల వ్యాపారస్థులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రుణాలు అందుబాటులోకి
-ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 160 రకాల వ్యాపారస్థులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రుణాలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డూండి రాకేష్ మాట్లాడుతూ…ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 9 నెలలే అయినప్పటికి, లోటు బడ్జెట్ ఉన్నప్పటికి, వైసీపీ పాలన వల్ల ఉబ్బందులున్నప్పటికి ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. చంద్రబాబు ప్రతి వర్గానికి న్యాయం చేస్తున్నారు. …
Read More »రీ సర్వేలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాం
-జాయింట్ ఎల్పీమ్ ల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు -ప్రస్తుతం భూముల రిజిస్ర్టేషన్లకు ఎటువంటి ఇబ్బందుల్లేవు -శాసనసభలో రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ కాలంలో జరిపిన రీ సర్వేలో తలెత్తిన సమస్యలను దాదాపు 98 శాతం పైగా పరిష్కరించామని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. జాయింట్ ఎల్పీఎమ్ లలో ఏర్పడిన సమస్య కారణంగా భూ యజమానులు భూములు మ్యుటేషన్ చేసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, గత …
Read More »జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు
-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ లబ్దిదారులకు సకాలంలో మెటీరియల్ సరఫరాకు కృషి -రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, మార్చి 12: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరులోగా 3 లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి …
Read More »అడ్వాన్స్ నిధులతో శరవేగంగా పోలవరం పనులు
-2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం… నిమ్మల పునరుద్ఘాటన. -కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు- మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు ఉండడంవల్ల అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి, నిధుల సాధనకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు …
Read More »అమెరికాలోని నాట్స్ సంబరాలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికాలోని ప్లోరిడా, తంపాలో ఈ ఏడాది జూలై 4 నుండి 6 వరకు జరిగే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఎనిమిదవ అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు అమరావతిలోని ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కార్యాలయంలో బుధవారం ఆయనను ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు కలిశారు. ఈ ఉత్సవాల్లో తప్పనిసరిగా …
Read More »గ్రానైట్ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తాం- రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి నేతృత్వంలోని గ్రానైట్ వ్యాపారుల బృందం నేడు సచివాలయంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో కలిసి గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రాయల్టీ ఫీజు, సహా వివిధ రకాల పన్నులను తగ్గించాలని లేదంటే రాష్ట్రంలో ఈ రంగం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ …
Read More »ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు
-ఉ.9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకూ పరీక్షలు -3వేల 450 పరీక్షా కేంద్రాలు-హాజరుకానున్న 6లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు -పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు -పరీకా కేంద్రాల పరిధిలో జిరాక్సు,నెట్ సెంటర్లను మూసి ఉంచాలి -ఫేక్ న్యూస్,వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి -రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబరు కంట్రోల్ రూమ్ ఏర్పాటు -చీఫ్ సూపరింటిండెంట్ తప్ప ఎవరి మొబైల్ ఫోన్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించొద్దు -జిల్లా కలక్టర్లు,ఎస్పిల …
Read More »
Prajavartha Online Telugu News