Breaking News

Daily Archives: April 24, 2025

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేసి సంతాపం  దుర్గాపురం వాకర్స్ అసోసియేషన్ క్లబ్ సభ్యులు తెలియజేశారు. ఈరోజు విజయవాడ దుర్గాపురం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గాపురం వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ నందు అధ్యక్షులు ఎస్కే బాబు అధ్యక్షతన పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన ద్వారా సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని  దుర్గాపురం వాకర్స్ క్లబ్ …

Read More »

అదానీ-విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య జరిగిన ఒప్పందంపై రౌండ్ టేబుల్ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “సెకి అదానీ ఒప్పందం -నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి’ అనే అంశంపై సెంటర్ ఫర్ లిబర్టీ (సిఎఫ్ఎల్) ఆధ్వర్యాన విజయవాడలోని బాలోత్సవ భవన్ లో గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి సిఎఫ్ఎల్ చైర్మన్ ఎన్ చక్రవర్తి అధ్యక్షత వహించారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల మధ్య జరిగిన అన్ని విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలు (పిపిఎ), సరఫరా ఒప్పందాలు(పిఎస్ఎ) పై సుప్రీంకోర్టు, లేదా హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యాన జ్యుడీషియల్ కమిటీ వేసి లోతైన …

Read More »

ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ రాజు సోలంకి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు రాజు సోలంకి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వన్ టౌన్ లో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు పాల్గొని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజు సోలండి మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సారేపల్లి రాధాకృష్ణ, …

Read More »

డాక్టర్ల కెరీర్‌ను బలపరచి తీర్చిదిద్దటానికి ‘ఐఎస్‌ఎమ్‌’ ఒక వేదిక…

-విదేశాలలో ఎమ్‌బిబిఎస్‌ కలలను సాకారం ఐఎస్‌ఎమ్‌ ఫోకల్‌ పాయింట్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ల కెరీర్‌ను బలపరచి ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి ‘ఐఎస్‌ఎమ్‌’ వేదికగా దోహదపడుతుందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముంజేటి రామారావు స్పష్టంచేశారు. గురువారం, మొఘల్‌రాజ్‌పురంలోని అమ్మా కళ్యాణమండపం సమీపంలో నూతన ఇంటర్నేషనల్‌ హయ్యర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఐఎస్‌ఎమ్‌) నూతన బ్రాంచ్‌ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో 10 వరకు …

Read More »

చంద్రబాబు రాజకీయ లబ్ది కోసమే ఎస్సీ వర్గీకరణ…. : ఉప్పులేటి దేవి ప్రసాద్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అశాస్త్రీయంగా ఉందని కేవలం రాజకీయ మైలేజ్ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వర్గీకరణను వాడుకున్నాడని, వర్గీకరణ ద్వారా ఎస్సీలు అందరూ కూడా నష్టపోతున్నారని,మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అన్నారు. మాల సంఘాల జేఏసీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ దేవిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్’ కేసులో ఏడుగురు సభ్యుల …

Read More »

స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి

-ఆర్థిక, రాజకీయ, సామాజిక పటుత్వం అవసరం -స్వయంప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి -పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు -రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు నేరుగా నిధులు -ఉపాధి కూలీలను ఇక మీదట ఉపాధి శ్రామికులుగా పిలుద్దాం -పంచాయతీల స్థలాలు, ఆస్తులు, భవనాలకు ఆడిట్ జరగాలి -ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం, స్థూపం నిర్మించేలా ప్రణాళిక -నేనెప్పుడూ గ్రామీణ మనస్తత్వం ఉన్న సగటు వ్యక్తినే -మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొని, దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి  పవన్ …

Read More »

పక్షులకు, జంతువులకు త్రాగునీటిని అందించడానికి నగర ప్రజలు ముందుకు రావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత వేసవిలో పక్షులకు, జంతువులకు త్రాగునీటిని అందించడానికి నగర ప్రజలు ముందుకు రావాలని, వారి ఇళ్లు లేదా ఇంటి ముందు వాటి కోసం నీటిని అందుబాటులో ఉంచడం ద్వారా వాటిని దాహార్తి నుండి కాపాడవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి వడగాలులు, ఎండ తీవ్రత వలన పక్షులు, ఇంటి ముందు ఉండే జంతువులు దాహంతో ఇబ్బంది పడుతుంటాయన్నారు. నగర ప్రజలు తమ ఇంటి …

Read More »

సెప్టిక్ వ్యర్ధాల తరలింపు, నిర్వహణ అంశాలపై అవగాహన సమావేశం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ క్లీన్ ఆపరేటర్లు, యజమానులతో ఈ నెల 26 (శనివారం)న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశంకు హాజరు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ర్ల యజమానులు, ఆపరేటర్లతో సెప్టిక్ వ్యర్ధాల తరలింపు, నిర్వహణ అంశాలపై అవగాహన సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. నగరంలోని ప్రతి …

Read More »

అన్న క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లకు పేదలు 3 పూటలా అధిక సంఖ్యలో వస్తున్నందున, క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని క్యాంటీన్లలో ఆహారం సరఫరా అనంతరం డైనింగ్ హాల్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్యాంటీన్ల వద్ద ఏమైనా మరమత్తులు ఉంటే స్థానిక ఇంజినీరింగ్ అధికారుల …

Read More »

ముందస్తు పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీతో రూ.91.50 లక్షల పన్ను చెల్లించిన పోలిశెట్టి సోమసుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2025-26) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, పోలిశెట్టి సోమసుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రాయితీని సద్వినియోగం చేసుకొని రూ.91.50 లక్షలు పన్ను చెల్లించారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. గురువారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో పోలిశెట్టి సోమసుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెచ్ఆర్ మేనేజర్ రాఘవేంద్రరావు ముందస్తు పన్ను చెల్లిస్తూ కమిషనర్ కి …

Read More »