Breaking News

Daily Archives: April 24, 2025

దేశాభివృద్ధి చూసి ఓర్వ‌లేక పాకిస్తాన్ ఈ దాడిని ప్రోత్స‌హించింది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-మిల్క్ ప్రాజెక్ట్ లో ఉగ్ర‌వాదుల దాడికి నిర‌స‌న‌గా మాన‌వ‌హారం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్ర‌జ‌లంద‌రూ ఐక్యంగా వుండ‌టం, దేశాభివృద్ధి చూసి ఓర్వ‌లేక ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న ప‌క్క‌దేశ‌మైన పాకిస్తాన్ స‌హకారంతో ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు టారిస్టుల‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. కృష్ణాజిల్లా మిల్క్ యూనియ‌న్ (విజ‌య‌) చైర్మ‌న్ చ‌ల‌సాని ఆంజ‌నేయులు ఆధ్వ‌ర్యంలో గురువారం మిల్క్ ఫ్యాక్ట‌రీలో ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు టూరిస్టుల‌పై జ‌రిపిన దాడిని ఖండిస్తూ, మృతుల ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తూ మాన‌వహారం నిర్వ‌హించారు. ఈ …

Read More »

రాష్ట్ర ప్ర‌భుత్వ గౌర‌వ స‌ల‌హాదారుడిగా డి.ఆర్.డి.ఓ మాజీ చైర్మ‌న్ జి.స‌తీష్ రెడ్డి అనుభ‌వం ఎపికి అవ‌స‌రం :ఎంపి కేశినేని శివ‌నాథ్

-ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన డాక్ట‌ర్ జి.స‌తీష్ రెడ్డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఏరో స్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ హ‌బ్ కి రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ప‌ద‌వీ బాధ్య‌తలు చేపట్టిన డి.ఆర్.డి.ఓ మాజీ చైర్మ‌న్ డాక్ట‌ర్ జి.స‌తీష్ రెడ్డి కు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే రాష్ట్రానికి స‌తీష్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో డిఫెన్స్, ఏరో స్పేస్ ప‌రిశ్ర‌మ‌లు రావాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు. మంగ‌ళ‌గిరి ఎ.పి.ఐ.ఐ.సి కార్యాల‌యంలో గురువారం డాక్ట‌ర్ జి.స‌తీష్ రెడ్డి …

Read More »

ఉగ్రవాదంపై ప్రజాగ్రహం

-అమాయక ప్రజలపై దాడి హేయమైన చర్య… -పెనుసవాలుగా మారిన దేశ భద్రత.. -దేహం ముక్కలైన దేశాన్ని కాపాడుకుంటాం.. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వర్వయ్య -ఉగ్రవాద చర్యను నిరశిస్తూ విజయవాడలో కొవ్వొత్తుల నిరసన ` విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జమ్ముకాశ్మీర్‌ పహల్గాం ప్రాంతంలో అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదంపై ప్రజాగ్రహం పెల్లుబిగింది. తీవ్రవాదం ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కేంద్ర పాలకులు ధీటjైున చర్యలు చేపట్టి దేశాన్ని కాపాడాలని కోరుతున్నారు. సామాన్య ప్రజలను బలిగొన్న తీవ్రాదానికి వ్యతిరేకంగా సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో …

Read More »

మరణించిన పెన్షన్ దారులకు భాగస్వామికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు

-2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య మరణాలు జరిగిన పురుష పెన్షనర్ల భాగస్వాములకు -జిల్లా వ్యాప్తంగా ఉన్న 3408 -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 01.12.2023 నుండి 31.10.2024 వరకు మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వామి లకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల వివరాలు, పెన్షనర్ల మరణ ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేసేందుకు పోర్టల్ ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇటీవల అమరావతి లో …

Read More »

రాజమహేంద్రవరం కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)

-ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక వేత్తలు గుర్తింపు -ఆవిష్కరణలు ఆలోచనలు ఫలవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి -కలెక్టరేట్ లో తొలి ఆర్టీఐహెచ్ సభ్యులతో సమావేశం -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త రూపుదిద్దుకోవాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన, అందుకు అనుగుణంగా తూర్పు గోదావరి జిల్లాలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫలవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి …

Read More »

రెవెన్యూ అధికారుల సమావేశం ఫలవంతం కావాలి

-ఆర్ వో సమావేశం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నీటి తీరువా పన్నుల వసూళ్ల లో ఇరిగేషన్ కాలువ కింద ఒక పంట, రెండు పంటల సాగు విస్తీర్ణం అనుసరించి ఉండాలని, గతంలో నిర్ధారణ చేసిన విస్తీర్ణం అనుసరించి లక్ష్యాలు నిర్ధారించడం జరిగిందని, వాటికి కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం ఉదయం క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారులు సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న …

Read More »

మే నెల 10 వ తేదీన జాతీయ లోకదాలత్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వచ్చే మే నెల 10 వ తేదీన జాతీయ లోకదాలత్ ను విజయవంతంగా నిర్వహించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కక్షిదారులు అందరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి గోపి కోరారు. గురువారం సాయంత్రం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ అధికారులు కక్షిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు …

Read More »

వ్యవసాయం, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, జల వనరుల శాఖ, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ తదితర అంశాలపై సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవటంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్యసేవలు శాఖామంత్రి మరియు కృష్ణ జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రి గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ …

Read More »

ఏ ధర్మాన్ని ఆచరిస్తారని అడిగి మరీ చంపేశారు

-పెహల్గాం ఉగ్రవాద చర్యను భారత దేశం ఎన్నటికీ మరువదు -అత్యంత కిరాతకంగా, నిర్దయగా ప్రవర్తించారు -ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి పారేయాలి -బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఇస్తుంది -ఉగ్ర దాడిలో మృతి చెందిన కావలి వాసి మధుసూదనరావు సోమిశెట్టి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -కుటుంబ సభ్యులకు ఓదార్పు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘పహల్గాంలో ఉగ్రవాదుల దాడులు దారుణం. ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా, టార్గెటెడ్ గా పర్యాటకుల్ని హతమార్చారు. …

Read More »

మతం అడిగి మరీ కాల్చి చంపారు

-పేలుడు చప్పుళ్లకు పారిపోతుంటే శాలువాలు అమ్మేవారు తప్పుదోవ పట్టించారు -పడుకుంటే కాల్చరని చెప్పారు.. నా కళ్లెదుటే నా భర్తను కాల్చేశారు -చిన్న చిన్న పిల్లలు ఉన్నవారినీ వదల్లేదు -ఉగ్రవాదులు అత్యంత నిర్ధయగా ప్రవర్తించారు -కశ్మీర్ సురక్షితంగా ఉంటుందని నమ్మి వెళ్లాం -ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ఎదుట కన్నీటి పర్యంతమైన ఉగ్రదాడిలో హతమైన మధుసూదన రావు  సతీమణి  కామాక్షి  -మీ బాధని ఎవరూ తీర్చలేరంటూ పవన్ కళ్యాణ్ ఓదార్పు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘కశ్మీర్ సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతో విహార యాత్రకు …

Read More »