Breaking News

Monthly Archives: April 2025

ఉపాధి హామీ ద్వారా పశువుల కోసం నీటి తొట్టెల నిర్మాణం

-12,500 నీటి తొట్టెల నిర్మాణం కోసం రూ.56.25 కోట్లు నిధులు -ఈ నెల 15నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్లెల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతోపాటు రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా ఉపాధి హామీ నిధులను వినియోగిస్తున్నారు. గోకులాల నిర్మాణం, పంట నీటి కుంటల తవ్వకాన్ని ఉపాధి హామీ పథకంలో భాగం చేసిన విధంగానే ఇప్పుడు పాడి రైతుల కోసం మరో కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది. వేసవిలో …

Read More »

స్వతంత్రం వచ్చి 77 ఏళ్లయిన క్షేత్రస్థాయిలో పరిష్కారాల శూన్యం

-వాయిస్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్లు వెంకటేశ్వర్లు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ అధికారుల వ్యవస్థ ప్రకటనలు మాత్రమే చేస్తోందని క్షేత్రస్థాయిలో పరిష్కారాలు జరగటం లేదని వాయిస్ ఫర్ చేంజ్ గౌరవ అధ్యక్షుడు అల్లు వెంకటేశ్వర్ విమర్శించారు వాయిస్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫౌండేషన్ అధ్యక్షులు అల్లు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి77 ఏళ్ల తర్వాత కూడా సమాజాన్ని అనేక సమస్యలు …

Read More »

వేసవి దృష్ట్యా పశువుల కోసం త్రాగు నీటి తొట్టెల నిర్మాణం పనులకి శ్రీకారం

-జిల్లా వ్యాప్తంగా 157 పంచాయతీల పరిధిలో రూ.50.24 ల నీటి తొట్టెల నిర్మాణం -మంత్రి కందుల దుర్గేష్ పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద వేసవి కాలంలో పశువులకు నీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామాల్లో పశువుల నీటి తొట్టెల నిర్మాణాన్ని ప్రతిపాదించి జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 157 నీటి తొట్టెల నిర్మాణం పనులకి శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ , జిల్లా కలెక్టర్ పి …

Read More »

జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల కింద 235076 మందికి రూ.102 కోట్ల 28 లక్షల మేర పంపిణీ

-ప్రతినెలా ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ -మంత్రి కందుల దుర్గేష్ -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పెరవలి (తూర్పు గోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల కింద 235076 మందికి రూ.102 కోట్ల 28 లక్షల మేర పంపిణీ చెయ్యడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక పెరవలి మండలం ముక్కామల గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో …

Read More »

నగరంలో ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌ బ్యాంకు గోల్డ్‌ అప్రైజర్స్‌ యూనియన్‌ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌ బ్యాంకు గోల్డ్‌ అప్రైజర్స్‌ యూనియన్‌ (ఎబిజిఎయు రిజిస్టర్‌ నెంబర్‌ ఎఫ్‌-227) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విజయవాడ వివిధ బ్యాంకులలో జరుగుతున్న నకిలీ బంగారం పెట్టి రుణాలు మోసాలు చేస్తున్న దొంగలను ఏ విధంగా అడ్డుకట్ట వేయాలని మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా జాగ్రత్తల గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రధాన కార్యదర్శి ఈదరాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ యూనియన్‌ తరపున ఇప్పటివరకు జరిగిన నకిలీ బంగారం …

Read More »

ధ‌నికులు పేద‌ల‌ను ఉద్ధ‌రిస్తారా?

-చంద్ర‌బాబు నాలుగోసారి సీఎం అయినా పేద‌రికం ఎందుకుంది? -ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నిక‌ల‌కు ఒక్కో నియోజక వర్గానికి రూ.10-100 కోట్ల పంచడానికి డబ్బులు ఎక్క‌డినుంచి వ‌స్తున్నాయి? -బీసీ, ఎస్సీ, ఎస్టీల‌ను కించ‌ప‌ర‌చ‌డం చంద్ర‌బాబు మానుకోవాలి -అధికారం మీకిస్తే.. వాళ్లు బాగుచేయాల‌ని చెప్ప‌డ‌మేంటి? -పీ4 ప‌థ‌కంపై బీఎస్పీ ఏపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త పూర్ణ‌చంద్ర‌రావు ధ్వ‌జం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చంద్ర‌బాబు ఇప్ప‌టికి నాలుగోసారి ముఖ్య‌మంత్రి అయ్యారని, ఆయ‌న పాల‌నాకాలంలో ధ‌నికులు మ‌రింత ధ‌నికులు, పేద‌లు మ‌రింత పేద‌లు అయ్యార త‌ప్ప మ‌రేమీ ఒర‌గ‌లేద‌ని బీఎస్పీ …

Read More »

అన్నం పరబ్రహ్మ స్వరూపం..వృధా చేయెద్దు… కాసిన్ని మంచినీళ్లు, గింజలు ఇవ్వండి….!

-సామాజిక వేత్త దీనంశెట్టి గోపి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నం పరబ్రహ్మ స్వరూపం… ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడితే అదే మహాభాగ్యం… ఆకలితో ఉన్నవారికి ఆస్తులు, అంతస్తులు డబ్బులు అక్కర్లేదు… పట్టెడు అన్నంచాలు. అది కూడా దొరకని నిరుపేదలు, అభాగ్యులు ఎంతోమంది దేశంలో ఉన్నారు. కోట్ల రూపాయల సంపద మనదేశంలో అదే సమయంలో కోట్లాదిమంది కూటికి లేని నిరుపేదలు ఉన్నారు. ఫంక్షన్లలో హోటళ్లలో మిగిలిపోయిన ఆహారం తినేవాళ్లు ఒక ఎత్తు అయితే… ఎంగిలి మెతుకులేరుకుంటున్న నిరుపేదలు మరొక ఎత్తు. కుప్పతొట్టి దగ్గర …

Read More »

పశువుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్లు ఏర్పాటు

-పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మానికొండ(ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేయడానికి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఉంగుటూరు మండలం, మానికొండ గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఎం కృష్ణతేజ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌కే షణ్ముఖ్, జిల్లా కలెక్టర్ డీకే బా వీలాజీలతో కలిసి …

Read More »

మునిసిపల్ ప్రాథమిక బాలుర పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం విధానంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి విద్యావ్యవస్థను పటిష్టం చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 47వ డివిజన్ ఈడేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంత్రి సమీపంలో ఉన్న మునిసిపల్ ప్రాథమిక బాలుర పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు విద్యార్థుల ప్రతిభాపాటవాలను పరీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు, తానెవరు అని ప్రశ్నలు వేయగా …

Read More »

33 వేల కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో పంపిణీ…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకునేందుకోసం 33 వేల కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని 47వ డివిజన్ ఈడేపల్లి లో మంత్రివర్యులు స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఈడేపల్లిలోని కిడ్నీ బాధితులు ఉయ్యూరు వీరభద్రరావు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి 30 వేల రూపాయల …

Read More »