విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని పోరంకి మూడో సచివాలయం దగ్గర మానవ ప్రాణ శక్తి కేంద్రాల పై అవగాహన మరియు యోగశక్తి చికిత్స కార్యక్రమం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భాను ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగుల కోసం నిర్వహించారు. ఈ సదస్సుకు యోగ శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని తాడిగడప మున్సిపల్ ఉద్యోగులకు చికిత్స మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ …
Read More »Monthly Archives: April 2025
నూతన రోడ్లు డ్రైన్ల నిర్మాణం అనంతరం డ్రైన్ టు డ్రైన్ నిర్మాణం చేపట్టాలి…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నూతన రోడ్లు డ్రైన్ల నిర్మాణం అనంతరం డ్రైన్ టు డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో థర్డ్ పార్టీ క్వాలిటి కంట్రోల్ విఆర్ సిద్ధార్ధ ఇంజినీరింగ్ కాలేజీ బృందం నగరంలో చేపట్టే అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో తీసుకోవాల్సిన అంశాలపై ఇంజినీరింగ్ అధికారులకు అవగాహన కల్గించారు. ఈ …
Read More »దరఖాస్తులను పరిశీలించి నిర్దేశిత సమయంలోపు అనుమతులు మంజూరు చేయాలి…
గుంటూరు ,నేటి పత్రిక ప్రజావార్త : భవన నిర్మాణ దరఖాస్తులను పరిశీలించి నిర్దేశిత సమయంలోపు అనుమతులు మంజూరు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు మరియు సిబ్బందితో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పట్టణ ప్రణాళిక కార్యదర్శుల వద్దకు వచ్చే భవన నిర్మాణ దరఖాస్తులను రెండు రోజులల్లో పరిశీలించి, తదుపరి అనుమతుల కోసం పట్టణ ప్రణాళిక …
Read More »ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని, స్టేడియంలో వాకింగ్ ట్రాక్ మరమత్తులకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం, శ్యామల నగర్ మెయిన్ రోడ్ లోని స్విమ్మింగ్ పూల్ ని పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో వాకర్స్, సభ్యులు …
Read More »ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలియజేయవచ్చు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్ధాలపై ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలియచేయవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం చుట్టగుంట దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో రూ.5కే పేదలకు ఆహారం అందిస్తుందన్నారు. క్యాంటీన్ల సమయం, ఆహారం పై ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారన్నారు. ఇప్పటికే …
Read More »ఆస్తి పన్నును ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ నెలాఖరులోపు 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి 2 అర్ధ సంవత్సరాల మొత్తం ఆస్తి పన్నును ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నగర ప్రజలకు అవగాహన కలిగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ రెవిన్యూ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఆర్.ఐ లు, ఆర్.ఓ లతో కమిషనర్ ప్రత్యేక సమావేశం …
Read More »చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి మరియు పిఎంకెఎంఫైన్ ఆర్ట్స్ , సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని ఈ పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు . తమ బృందంతో తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సుజనా చౌదరిని కలిసి చంద్రన్న వజ్రోత్సవ …
Read More »బ్యాంక్ ప్రతినిదులతో అవగాహన కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త మెప్మా మిషన్ డైరెక్టర్ N. తేజ్ భరత్, IAS,ఆద్వర్యం లో MEPMA ప్రవేశపెట్టిన లోన్ చార్జి క్రియేషన్ మరియు మహిలాకాశం మాడ్యుల్స్ పై SLBC మరియు బ్యాంక్ ప్రతినిదులుతో మెప్మా ప్రధాన కార్యాలయం తాడేపల్లి నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్రం లో మెప్మా పరిధిలో పట్టణ ప్రాంతాలలో ఉన్న స్వయం సహాయక సంఘాల సమగ్ర సమాచారాన్ని SHG ప్రొఫైలింగ్ APP ద్వార 99% అనగా 2,74,078 గ్రూప్ లు 28,74,000సభ్యులు డేటా బేస్ సిద్దం చేయుట …
Read More »పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి…
-పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దుచేసి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని; పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.50/- పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ …
Read More »సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ అధికారులతో సామాజిక బాధ్యత నిధులు ( సి ఎస్ ఆర్) నిధుల వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఈ విషయమై బెల్ కంపెనీ ప్రతినిధులు, నాబార్డ్, ఎస్ ల్యాబ్ ప్రతినిధులతో సి ఎస్ ఆర్ నిధుల కేటాయింపు …
Read More »
Prajavartha Online Telugu News