Breaking News

Monthly Archives: July 2026

ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం

-విశాఖలో ఓపీఎస్‌ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ -సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉద్యోగులు -పాల్గొన్న ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంచి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపే గొప్ప సంప్రదాయానికి ఉత్తరాంధ్ర ఉద్యోగులు తెరతీసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని శాసన మండలి ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు అన్నారు. సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారిన ఉత్తరాంధ్ర ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో కృతజ్ఞతాభివందన సభ ఘనంగా …

Read More »

72వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

-నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయం:మంత్రి దుర్గేష్ -నేషనల్ ఫిలిమ్స్ లో 9 అవార్డులతో టాలీవుడ్ సత్తా చూపించడం గర్వంగా ఉంది:మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో టాలీవుడ్ ఏకంగా 9 జాతీయ అవార్డులను కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

గిరి పుత్రులకు మాటిచ్చారు… మూడు గ్రామాల్లో కోటి రూపాయల వసతులు కల్పించారు

-బల్లగరువు పర్యటన సందర్భంగా ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -ఉపాధి నిధులతో అంగన్వాడీ కేంద్రాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన గ్రామాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ – అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, బల్లగరువు గ్రామ పర్యటన సందర్భంగా గిరిపుత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, తాగునీటి సదుపాయం, …

Read More »

ప్రజా ఆరోగ్య వేదిక, జెవివి మెడికల్ క్యాంపు

-సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పాటు రెగ్యులర్ చెక్ అప్ మరియు వైద్యం ద్వారా షుగర్, బిపి ముప్పులను ఎదుర్కోవచ్చు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఆరోగ్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో షుగర్, బిపి, ఫిట్స్, పక్షవాతం జబ్బులకు ప్రతి రెండు నెలలకు మూడవ ఆదివారం నిర్వహించబడుతున్న హెల్తీ విజయవాడ రెగ్యులర్ మెడికల్ క్యాంపు ఆదివారం పాయకాపురం లహరి విద్యా మందిర్ లో జయప్రదంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపుకు వచ్చిన రోగులను ఉద్దేశించి …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ‘వెడ్డింగ్ డెస్టినెషన్‌’గా తీర్చిదిద్దడమే లక్ష్యం: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-రాజస్థాన్ పర్యటనలో భాగంగా జైపూర్ లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్ క్లేవ్ లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్లతో మంత్రి దుర్గేష్ కీలక భేటీ.. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెడితే ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని భరోసా రాజస్థాన్ (జైపూర్) / అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా ప్రమోట్ చేయడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి …

Read More »

వసతి గృహ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ఉన్న ఎనిమిది ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం బాలుర వసతి గృహం నెం.1లో విద్యార్థులకు ట్రంకు బాక్సులు, దుప్పట్లు, బ్లాంకెట్లు, ప్లేట్లు, కటోరాలు, గ్లాసులు, స్వెటర్లు, నైట్ డ్రెస్సులు, టర్కీ టవల్స్ తదితర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి. గాయాజుద్దీన్ మాట్లాడుతూ, ప్రభుత్వం వసతి …

Read More »

పరిశ్రమల రాకతో స్థానికంగానే ఉద్యోగాలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -సీఎం చంద్రబాబు కృషితో విస్తృతంగా పరిశ్రమల ఏర్పాటు -విద్య పూర్తికాగానే నివాసమున్నచోటే ఉపాధి -పరిశ్రమల రాకతో నిరుద్యోగ యువత వలసలకు బ్రేక్ -నీరా యూనిట్ల ఏర్పాటుతో వ్యాపారులుగా గీత కార్మికులు -ఈడిగల ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం -హిందూపురం నందమూరి అడ్డా -విద్యతోనే అందలం : మంత్రి సవిత -ఈడిగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ హిందూపురం/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నత విద్య పూర్తి కాగానే స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా కూటమి ప్రభుత్వం …

Read More »

షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2026

-SSC మరియు ఇంటర్మీడియట్ ప్రతిభావంతుల సన్మాన కార్యక్రమం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా పాఠశాల విద్యాశాఖ మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో “షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2026” కార్యక్రమం 2026 జూలై 20వ తేదీ (సోమవారం) ఉదయం 9.00 గంటలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా …

Read More »

నగరంలో హిందూ సంఘాల నాయకులు, పీఠాధిపతుల రౌండ్ టేబుల్ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో హిందూ సంఘాల నాయకులు, పీఠాధిపతుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ వంటి వారికి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు వత్తాసు పలకడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనని హిందూ సంఘాల నాయకులు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బందరురోడ్డులోని ఓహోటల్లో హిందూ సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిణామాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సాధు పరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …

Read More »