Breaking News

Monthly Archives: July 2026

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స

-రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్… తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స -మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స -2016లో తగిలిన గాయాలకు తోడు… పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల …

Read More »

డెంగ్యూ అవగాహన ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు -1 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం పరిధిలో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. డెంగ్యూ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం,హెల్త్ అసిస్టెంట్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించి, డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సబ్ యూనిట్ ఆఫీసర్ B G అప్పారావు గారు …

Read More »

పారిశ్రామిక అవసరాలకు మిగులు ఇథనాల్ విక్రయంపై మార్గదర్శకాలు పరిశీలన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మిగులు ఇథనాల్‌ను ఔషధ, పెయింట్స్, రసాయన పరిశ్రమలు తదితర పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా తగిన మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశంపై గనులు, భూగర్భశాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన సచివాలయంలో ఇథనాల్ తయారీదారుల సంఘం ప్రతినిధులతో సమావేశం జరిగింది. సమావేశంలో ఇథనాల్ తయారీదారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినప్పటికీ, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం కింద …

Read More »

చట్టబద్ధ పాలనపై ప్రశ్నలు – ఆర్టికల్ 14 అమలుపై ఆందోళన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షలతో యూట్యూబర్ రావణ్ మీద మీద UAPA చట్టం కింద కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ NTR జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగిన చట్టబద్ధ పాలన కోసం ధర్మదీక్ష కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు. …

Read More »

కడపలో కరోనాకు అడ్డుకట్ట వేయండి

-కలెక్టర్, డీఎంహెచ్ వోకు ఫోన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశం -కేసులు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయండి -రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయండి -వియత్నాంలో కడప వారి దుర్మరణంపై మంత్రి సవిత దిగ్భ్రాంతి -బాధిత కుటుంబానికి అండగా ఉంటాం -ఎప్పటికప్పుడు విదేశాంగ అధికారులతో మాట్లాడుతున్నాం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశించారు. అదే సమయంలో …

Read More »

బుద్దవరంలో ఆధునీకరించిన పీఏసీఎస్ భవనం ప్రారంభం

-భవనాన్ని ప్రారంభించిన కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -ఎద్దుల బండిపై ర్యాలీగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు -గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే వెన్నెముక : నెట్టెం రఘురామ్ , ఎమ్మెల్యే యార్లగడ్డ. -రైతులు, చేతివృత్తిదారులకు సహకార సంఘాల ద్వారా రుణాలు : నెట్టెం రఘురామ్ -సహకార్ సే సమృద్ధి పేరుతో సహకార రంగంలో అన్ని సేవలను డిజిటలైజేషన్ చేస్తున్నాం : నెట్టెం రఘురామ్ -సహకార సంఘాల్లో పారదర్శకతకు జీఓ-90 అమలు అవసరం : ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం, నేటి …

Read More »

“బాలల భద్రత- అందరి బాధ్యత”

-బాలల హక్కుల పరిరక్షణ అందరిదీ బాధ్యత. -బాలల హక్కుల సేవల బలోపేతంపై చర్చా వేదిక నిర్వహణ. -ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, విజయవాడ డైరెక్టర్ బి.ఎస్. కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ శ్రీ.బి.ఎస్. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, విజయవాడ ఆధ్వర్యంలో “బాలల హక్కుల సేవలను మరింత బలోపేతం చేసి విస్తరించడానికి భవిష్యత్ కార్యాచరణ” అనే అంశంపై టి.వి.(టానా) భవన్, …

Read More »

ఫిక్సిటితో పి.బి. సిద్ధార్థ ఒప్పందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ ఎనలటిక్స్ విభాగం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్కిల్లింగ్ సంస్థ ఫిక్సిటి ఇ.డి.ఎక్స్. ప్రైవేట్ లిమిటెడ్ తో శనివారం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. పరిశ్రమ అవసరాల మేరకు ఉపాధి లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఒప్పంద పత్రాలపై ప్రిన్సిపాల్ తో పాటు విభాగాధిపతి డా. బి. జయప్రకాష్, ఫిక్సిటి సంస్థ …

Read More »

సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు

– రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది – ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించడమే పనిగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు – పెయిడ్ ఆర్టిస్టులతో మత విధ్వేషాలకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు – తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించకుండా చట్టం తీసుకొస్తాం – మచిలీపట్నంలో గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియాను అడ్డగోలుగా వాడుతూ ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా …

Read More »

వీబీ-జీ రామ్ -జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి.

-గ్రామీణ ఉపాధికి మరింత భరోసా.. 125 రోజుల పని -వీబీ-జీ రామ్ -జీ పై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన -కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ తిరుపతి జిల్లాలో రూ.175 కోట్లతో 4,627 పనులు చేపట్టాం -జూలై 1 నుంచి ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో 986 పనులు ప్రారంభం -డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.సి. మద్దిలేటి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వీబీ-జీ రామ్ -జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ …

Read More »