Breaking News

Monthly Archives: July 2026

తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టండి

-చిరుత సంచారం ఉన్న ప్రాంతాల్లో హనుమాన్ బృందాలు -అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం సమన్వయంతో పని చేయాలి -భక్తులు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల అలిపిరి కాలినడక మార్గంలోని దొరసాని మండపం సమీపంలో చిరుతపులి సంచారంపై నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖల మంత్రి  పవన్ కళ్యాణ్  అదేశించారు. భక్తుల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెట్ల మార్గంలో చిరుత సంచారం అంశాన్ని …

Read More »

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

-ఆయన త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముంబయిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని తెలిపినట్లు మంత్రి దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం …

Read More »

“తుపాకీ కంటే కలం గొప్పది… గన్ కంటే పుస్తకమే సమాజాన్ని మారుస్తుంది” – హోంమంత్రి వంగలపూడి అనిత

-“తెలుగు భాష, మహిళా గౌరవ పరిరక్షణ ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి బాధ్యత” – హోంమంత్రి అనిత -“మహిళలకు మాత్రమే కాదు… అబ్బాయిలకు కూడా విలువలు, గౌరవం నేర్పించే సమయం వచ్చింది” – హోంమంత్రి అనిత -“‘అమ్మ’ అనే ఒక్క పదంలోనే తెలుగు మమకారం, సంస్కృతి, ఆత్మీయత అంతా నిక్షిప్తమై ఉంది” – హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా నిర్వహించిన 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు–2026లో ఆంధ్రప్రదేశ్ గృహ వ్యవహారాలు, …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స విజయవంతం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ముంబయిలో నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది. ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కి …

Read More »

వైభవంగా జేఎన్‌టీయూ-జీవీ ప్రథమ స్నాతకోత్సవం

-గవర్నర్ చేత పట్టాలు, స్వర్ణ పతకాల ప్రదానం – మయూర్ పట్నాలకు గౌరవ డాక్టరేట్ ప్రదానం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ-జీవీ) ప్రథమ స్నాతకోత్సవం శనివారం విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, జేఎన్‌టీయూ-జీవీ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం. మధుమూర్తి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. నిర్మాన్ …

Read More »

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

-బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాద ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న మంత్రి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారనే ప్రాథమిక సమాచారంపై తక్షణమే రంగంలోకి దిగారు. ఈ విషయమై ఢిల్లీలోని ఏపీ భవన్ సీనియర్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ అత్యవసరంగా మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి …

Read More »

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, గౌరవ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మొత్తం 23 …

Read More »

గోదావరి పుష్కరాలు– 2027ను దేశంలోనే ఆదర్శంగా నిర్వహించేందుకు సమన్వయంతో శాశ్వత అభివృద్ధి పనులు చేపడతాం

– పురపాలక శాఖ మంత్రి డా. పి. నారాయణ, పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గత గోదావరి పుష్కరాల్లో సుమారు 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా, ఒక్క రోజే 68 లక్షల మంది స్నానాలు చేసిన నేపథ్యంలో, ఈసారి 12 రోజుల పుష్కరాల్లో దాదాపు 10 కోట్ల మంది యాత్రికులు గోదావరి తీరం చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి డా. పి. …

Read More »

ఏడాది ముందే పుష్కర వ్యూహం… గోదావరి తీరాన ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వ సమగ్ర కార్యాచరణ

-సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో 2027 గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు -ఆరు జిల్లాల్లో భక్తులకు అత్యున్నత సౌకర్యాలు – భద్రత, పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి -రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లు, రివర్ ఫ్రంట్, మౌలిక సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రులు పి. నారాయణ, కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించిందనీ …

Read More »

ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు

-ముఖ్య అతిథిగా హాజరైన ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రలడ్హా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ చంద్ర లడ్హా, ఐజీ పీహెచ్ డీ రామకృష్ణ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ ఏ.జగదీష్, ఎస్పీ చెన్నుపాటి భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన …

Read More »