– జయంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య …
Read More »Monthly Archives: July 2026
ఏషియన్ ఓపెన్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్‌కు ఎంపికైన కైవల్యకు కమిషనర్ ధ్యానచంద్ర అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండోనేషియాలో వచ్చే నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరగనున్న ఏషియన్ ఓపెన్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్–2026కు అర్హత సాధించిన విజయవాడకు చెందిన యువ క్రీడాకారుడు కొప్పరపు కైవల్యను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా కైవల్య ఇటీవల సాధించిన విజయాలను కమిషనర్‌కు వివరించారు. జూన్ 25 నుండి 30వ తేదీ వరకు డెహ్రాడూన్‌లో నిర్వహించిన 21వ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో ఫిగర్ …
Read More »విజయవాడ నగర పాలక సంస్థ చీఫ్ ఇంజినీర్ గా పి. సత్యకుమారి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థలో ఎస్‌ఈ (ప్రాజెక్ట్స్)గా విధులు నిర్వహించి, చీఫ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందిన పి. సత్యకుమారి శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రను ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ చీఫ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లోనూ అదే నిబద్ధత, సమర్థతతో పనిచేసి నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పి. సత్యకుమారి …
Read More »ఎస్‌ఐఆర్ ప్రక్రియ సజావు అమలుపై సీఈవో ఆరా!
– క్షేత్రస్థాయిలో పర్యటించిన వివేక్ యాదవ్ – అత్యంత పారదర్శకంగా ప్రక్రియ పూర్తికి దిశానిర్దేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో సమష్టి భాగస్వామ్యం అవసరమని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సీఈవో వివేక్ యాదవ్ విజయవాడ అర్బన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. చిట్టినగర్, కంసాలి పేట ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ 208, 217 పరిధిలో విజయవాడ …
Read More »అల్లూరి సీతారామరాజు ప్రదర్శించిన ధైర్యం, త్యాగం, దేశభక్తి అందరికీ మార్గదర్శకం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద, శనివారం ఉదయం అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని కమిషనర్ ధ్యానచంద్ర, సిబ్బంది తో ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య పోరాటంలో తన ప్రాణాలను అర్పించి, దేశానికి అపూర్వమైన స్ఫూర్తినిచ్చిన మహానుభావుడని, దేశభక్తి, ధైర్యసాహసాల పరాకాష్ఠగా నిలిచిన ఆయన జీవితం …
Read More »పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వర్క్ ఫోర్స్
-ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత ఎదగాలి -పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రజలది -కుప్పంలో ఏబీఐఎస్ ప్రోటీన్స్, ఎంఎంస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి -రూ.200 కోట్ల పెట్టుబడితో ఏబీఐఎస్ ప్రోటీన్స్ చెందిన చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పంలో వివిధ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి …
Read More »ప్రముఖ సంస్థలతో ఉక్కు రాష్ట్రంగా ఏపీ
-జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌తో రాయలసీమకు నవశకం -2028లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి -కియా అభివృద్ధికి… బ్రాహ్మణీ స్టీల్స్ అవినీతికి నిదర్శనం -అనంత నుంచి 90 దేశాలకు కియా కార్ల ఎగుమతి -బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో ఐరన్ ఓర్ దోపిడీ, విదేశాలకు స్మగ్లింగ్ -సున్నపురాళ్లపల్లిలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు -జేఎస్‌డబ్ల్యూ నియోఎనర్జీ, విజయనగరంలో పారిశ్రామిక ప్లాంట్‌కు శంకుస్థాపన కడప, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌తో రాయలసీమకు నవశకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »పొగాకు రైతులకు గిట్టుబాటు ధరే ప్రభుత్వ లక్ష్యం
-కొనుగోళ్లలో అక్రమాలు, కంపెనీల సిండికేట్‌ను సహించం – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఉన్నతస్థాయి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా ఎస్‌బీవీ స్వామి, టొబాకో బోర్డు ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని పొగాకు ఆక్షన్ …
Read More »తోతాపురి మామిడి రైతుల సమస్యలపై ఐసీఏఆర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు
– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం సమస్యను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోతాపురి మామిడి …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను ఆకే రవికృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ …
Read More »
Prajavartha Online Telugu News