– ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి – ఓటర్ల హెల్ప్ డెస్క్‌ల సద్వినియోగానికి విస్తృత అవగాహన – క్షేత్రస్థాయిలో వేగవంతమైన చర్యలకు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు – ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ టెలీకాన్ఫరెన్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తిచేసేందుకు ఈ నెల 7వ తేదీన జిల్లావ్యాప్తంగా ప్రత్యేక మెగా డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ …
Read More »Monthly Archives: July 2026
చిన్నారుల చదువుకు ఆధార్‌తో ఆధారం!
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చొరవతో ఆసరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పెజ్జోనిపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు అన్షిత, అన్విత తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటంతో వారి సంరక్షణ బాధ్యతను అమ్మమ్మ చూస్తున్నారు. ఇటీవల చిన్నారులు అమ్మమ్మతో కలిసి కలెక్టరేట్‌లో ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్ సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను కలిసి తమకు ఆధార్ కార్డులు లేవని.. ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై వెంటనే స్పందించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సూచనతో డీఈవో ఎల్.చంద్రకళ …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆశీస్సులతో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో పైపుల్ రోడ్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర 500 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రారంభించి వడ్డెన చేశారు. తెల్లవారుజామున 5:00కి వంట ప్రారంభించి స్వయంగా వండి ఆకలితో ఉన్నవారికి వడ్డించడమే డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం …
Read More »ఘనంగా జరిగిన డాక్టర్స్ డే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు నగరంలో ప్రముఖ వైద్యులను సన్మానించడం స్థానిక నాస్థిక కేంద్రంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్ష్యులు జి.శ్యామల మాట్లాడుతూ సేవే లక్ష్యం సేవలందిస్తున్న కొంత మంది వైధ్యులను సన్మానించుకోవలసిన అవసరం ఉందని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇక్కడకు వచ్చిన ప్రతి వైద్యులకు, రాలేక పోయిన వారికి సుభాకాంక్షలను తెలియ జేస్తున్నామని ఆమె అన్నారు. …
Read More »మెగా డీఎస్సీ 2025 అక్రమ నియామకాలను నిరసిస్తూ బాధితులు ఆమరణ నిరాహార దీక్ష
-నిరాహార దీక్షని ప్రారంభించిన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీ 2025 అక్రమ నియామకాలపై తమకు అన్యాయం జరిగిందంటూ దివ్యాంగుడు అంజనప్ప మరియు డీఎస్సీ అభ్యర్థిని పీ. ప్రభావతి సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా అంచనప్ప మరియు ప్రభావతి మాట్లాడుతూ విద్యాశాఖలో అధికారులు అక్రమాలకు పాల్పడి అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి, డీఈఓ, …
Read More »2వ రోజు కొనసాగిన నీట్ ఆస్పరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ధర్నా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ ఆస్పరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ధర్నా విజయవాడ ధర్నా చౌక్ లో రెండవ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా ఏపీ ఫీజు రెగ్యులారిటీ అథారిటీ కమిషన్ సెక్రటరీకు మరియు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ లో రిజిస్టర్ డా.టి. సాయిసుధీర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్ కు వినతి పత్రాలను అందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలలో ఎంబిబిఎస్ సీట్లు పెంచాలని కొత్త …
Read More »జడ శ్రవణ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరులో నిర్వహించిన దళిత శంఖారావం సభలో మాజీ మెజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర దళిత సేన ఫౌండర్ హమారా ప్రసాద్, హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్‌తో పాటు హిందూ …
Read More »ఆప్కో స్వర్ణోత్సవ వేళ నేతన్నలకు వరాల జల్లు
-చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సవిత -త్వరలో ‘నేతన్న భరోసా’ అమలు -చేనేత సహకార సంఘాలకు రూ.6.50 కోట్ల బకాయిలు కూడా… -ఈ నెల 15న రూ.4కోట్లు, ఆగస్టు మొదటి వారంలో రూ.2.50 కోట్ల బకాయిల చెల్లింపు -నేతన్నలకు పెట్టుబడి భారం తగ్గించేలా నూలు సరఫరా -చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పనే కూటమి లక్ష్యం -ఆప్కోకు పూర్వ వైభవం తీసుకొస్తాం -చేనేత బ్రాండ్ అంబాసిడర్లగా చంద్రబాబు, పవన్, లోకేశ్ : మంత్రి సవిత -మంగళగిరిలో ఘనంగా ఆప్కో స్వర్ణోత్సవ వేడుకలు …
Read More »సూపరింటెండెంట్ నుంచి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా జేకే కృష్ణశ్రీకి పదోన్నతి
-నూతన బాధ్యతల్లో మరింత ప్రతిభ కనబరచాలని ఆర్జేడీ పి. తిమ్మప్ప ఆకాంక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్‌లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి జేకే కృష్ణ శ్రీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో) గా పదోన్నతి పొందిన సందర్భంగా జోన్-2 రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) పి. తిమ్మప్ప ఆమెను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాల సంచాలకుల కార్యాలయంలో కృష్ణశ్రీ కి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జేడీ పి. తిమ్మప్ప మాట్లాడుతూ.. …
Read More »లేపాక్షి హస్తకళా మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి… : డా. పసుపులేటి హరిప్రసాద్
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అంబేద్కర్ కళావేదికలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన హరిప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “లేపాక్షి హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్‌పో 2026” కార్యక్రమం రేపు విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ …
Read More »
Prajavartha Online Telugu News