మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం అమలుపై భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లాలో సర్ …
Read More »Monthly Archives: July 2026
పామర్రులో జూలై 10న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రేపు శుక్రవారం జూలై 10వ తేదీన పామర్రులో నిర్వహించాల్సిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని పరిపాలనా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జూలై 17వ తేదీన అదే వేదికలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పామర్రు నియోజకవర్గ ప్రజలు ఈ మార్పును గమనించి, తమ వినతులు, సమస్యలతో జూలై 17న నిర్వహించే ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరై వినియోగించుకోవాలని జిల్లా …
Read More »ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో సహకరించాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-మచిలీపట్నంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు. గురువారం మచిలీపట్నం ఉత్తర మండలం తహసీల్దార్ కార్యాలయంలో మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ …
Read More »ప్రజలందరూ బిఎల్ఓ లకు సహకరించండి…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరూ బిఎల్ఓ లకు సహకరించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని ఫైజర్‌పేట, సెంట్రల్ నియోజకవర్గంలోని అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్‌మార్క్, తూర్పు నియోజకవర్గంలోని పటమట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సందర్శించి ఎన్యుమరేషన్ …
Read More »హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు
-ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి వర్తింపు -హాస్టళ్లు కాదు…ఇక గురుకులాలనే నిర్మిద్దాం -ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు -సంక్షేమ శాఖల విద్యాసంస్థల్లో చదివిన పూర్వ విద్యార్థుల నెట్ వర్కింగ్ -రూ.100 కోట్లతో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మత్తులు -బడుగుల జీవనోపాధికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు పీ4 అనుసంధానం -సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతిగృహాలు, …
Read More »కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే
-రైతుల్ని ఇబ్బంది పెట్టే కంపెనీలపై కఠిన చర్యలు -టొబాకో బోర్డుపైనా సీఎం చంద్రబాబు అసంతృప్తి -ఇండెంట్‌కు మించి సాగుతో ధర తగ్గిందన్న అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నం అవుతోందని సీఎం ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైనా …
Read More »గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
-29, 30వ స్నాతకోత్సవ విశిష్ట ఘట్టాల స్మారక ఫోటో ఆల్బమ్‌ను గవర్నర్‌కు అందజేసిన ప్రతినిధి బృందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డా. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉపకులపతి డా. పులాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా బుధవారం కలిసింది. ఈ బృందంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డైరెక్టర్ (రిసెర్చ్ & డెవలప్‌మెంట్), డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల విజయవాడలోని …
Read More »“ పోలవరం రాష్ట్రానికి జీవనాడి – స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సకారానికి వరప్రదాయిని “ : లంకా దినకర్
ఏలూరు/ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి, ఏపి 20 సూత్రాలు పథకం చైర్ పర్సన్ లంకా దినకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరితోపాటు రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగు బృందం పూల మొక్కలు,పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం స్కిల్ వే, కాపర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, టర్నల్స్, తదితర పనులను పరిశీలించి, పనులు పురోగతిపై అధికారులు ఏర్పాటు …
Read More »సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10శాతం పెంపుకు ప్రభుత్వ నిర్ణయం
-ప్రభుత్వ నిర్ణయం పట్ల మంత్రి డిఎస్ బీవీ స్వామి హర్షం -సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డా.స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10 శాతం పెంపునకు ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి డా.డోలా శ్రీ బాల …
Read More »మెడికల్ విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించండి
-కడప కలెక్టర్ కు, డీఎంహెచ్ వోకు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలుషిత ఆహారం కారణంగా రిమ్స్ మెడికల్ హాస్టల్ విద్యార్థినులు అస్వస్థత గురికావడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థినుల ఆర్యోగంపై ఆరా తీస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చెరకూరి శ్రీధర్ ను, డీఎంహెచ్ వో డాక్టర్ రవి రాథోడ్ ఫోన్లో ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలోని రిమ్స్ …
Read More »
Prajavartha Online Telugu News