-యాప్‌ను ప్రతి రైతు వినియోగించాలి -ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత -ఉద్యాన, స్వల్పకాలిక వరి, అంతర పంటలకు ప్రాధాన్యం -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఎయిమ్స్) యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకుని సమగ్ర వ్యవసాయ సేవలను పొందాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. గురువారం ఎ.కొండూరు మండలం చీమలపాడులోని ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ఆన్‌లైన్ విధానంతో ఎరువులు సరైన సమయంలో, సరైన …
Read More »Monthly Archives: July 2026
ప్రజాకేంద్రిత పాలనలో ఎన్టీఆర్ జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీ శ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాకేంద్రిత పాలన, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ, వినూత్న కార్యక్రమాల అమలులో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. 2025, 2026 సంవత్సరాల్లో జిల్లాలోని ముప్పాళ్ళ, నిడమానూరు, అంబాపురం, గొల్లపూడి, గుంటుపల్లి, గూడవల్లి గ్రామపంచాయతీలు సహా మొత్తం తొమ్మిది గ్రామపంచాయతీలు గ్రామపంచాయతీ అవార్డులు అందుకున్నాయని తెలిపారు. అలాగే “వికాస్ సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ – …
Read More »జిల్లాలో 72.54 శాతం మేర ఫారాల డిజిటైజేషన్..
– ప్రక్రియలో వచ్చే మూడు రోజులు చాలా కీలకం – ఓటర్లకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఇంటింటి సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో వచ్చే మూడు రోజులు చాలా కీలకమని.. ఓటర్లకు సహాయసహకారాలు అందించడం ద్వారా ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఎ.కొండూరు మండలం, చీమలపాడులో పర్యటించారు. …
Read More »దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ – రైతులకు మరింత వేగవంతమైన సేవలే లక్ష్యం
-సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు -రానున్న సీజన్‌లో ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం -రూ.31 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుతో 11.53 లక్షల మంది రైతులకు 24 గంటల్లో 95 శాతం చెల్లింపులు -ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతులకు నమ్మకం, భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో …
Read More »APSSDC మరియు BNI మెగా జాబ్ మేళా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) వారి సంయుక్త అధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.12.07.2026 అదివారం ఉదయం 08:00 గంటలకు మన విజయవాడ లోని పి.బి. సిద్దార్థ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, Moghalrajapuram, విజయవాడ, నందు “మెగా జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు మరియు BNI ప్రతినిధులు జె.హెచ్.దేశాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విజయవాడ & ఆచంట. …
Read More »ZED, GEM మరియు LEAN మేనేజ్‌మెంట్‌పై అవగాహన సదస్సు నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ మరియు (COWE) ఏపీ చాప్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), కోవ్ (COWE) ఏపీ చాప్టర్ సహకారంతో ఈరోజు విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ కార్యాలయంలో ZED (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్), GEM (గ్రీనింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ది ఎకోసిస్టమ్) మరియు లీన్ మేనేజ్‌మెంట్ (Lean Management) లపై అవగాహన సదస్సును నిర్వహించింది. స్కిల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కేతన్ రాయ్ మాట్లాడుతూ, పర్యావరణంపై కనీస ప్రభావం చూపుతూ, ఎలాంటి లోపాలు లేని నాణ్యమైన ఉత్పత్తిని ప్రోత్సహించే …
Read More »కృష్ణా – గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా జోసఫ్ సుధీర్‌బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2027 ఫిబ్రవరి/ మార్చిలో జరగబోయే కృష్ణా ` గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబును ఎస్‌టియు మరియు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నిలుపుతున్నట్లు ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాధరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రకటించారు. ఎస్‌టియు రాష్ట్ర 79వ వార్షిక కౌన్సిల్ మరియు కార్యవర్గ సమావేశాలలో చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు విద్యార్థి దశలో విద్యార్థి …
Read More »ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం – ప్రజలు, ఉద్యోగులు అపోహలకు లోనుకావద్దు
-ఏపీఎస్‌ఆర్టీసీ ప్రైవేటీకరణ లేదు… డిపోలు, ఆస్తులు లీజుకు ఇవ్వడం లేదు… ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు -ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రవాణా, రోడ్లు & భవనాలు) ఎం. కృష్ణబాబు, ఐఏఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడంపై కొంతకాలంగా ప్రజల్లో, ఉద్యోగుల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించినట్లు రాష్ట్ర రవాణా, రోడ్లు & భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణబాబు, ఐఏఎస్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఏపీఎస్‌ఆర్టీసీని …
Read More »ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశాం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు 5 రోజులే గడువు ఉందని, ప్రజల సౌకర్యార్థం అన్ని సచివాలయాలు, నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని కోరారు. …
Read More »తప్పులు లేని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి : నగర కమిషనర్ మయూర్ అశోక
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో తప్పులు లేని, అత్యంత స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ నగర ప్రజలను కోరారు. గురువారం కమిషనర్ బాలాజీ నగర్, ఎల్బీ నగర్, ఇశ్రాయేల్ పేట, ఆర్టీసి కాలనీల్లోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను ప్రత్యక్ష్యంగా పరిశీలించి, బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులకు తగు …
Read More »
Prajavartha Online Telugu News