Breaking News

Monthly Archives: July 2026

2035 నాటికి 60 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యం

-20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రైతులు న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమయ్యేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాయని,2035 నాటికి మన రాష్ట్రంలో 60 లక్షలకు పైగా రైతుల ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం లక్ష్యంగా పనిచేస్తున్నామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ సేద్యం సాగు పెంపుపై వ్యవసాయ శాఖ ఎక్స్ అపిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరి …

Read More »

పరిహారం ఇవ్వకుండా మత్స్యకారుల కుటుంబాలను వేధించిన వైసీపీ

– గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలైన రూ.13.05 కోట్లను అధికారంలోకి రాగానే చెల్లించాం – వైసీపీ హయాంలో మత్స్యకారులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు – విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాం – రాజకీయ లబ్ధి కోసం మత్స్యకారుల సమస్యలను వాడుకోవడం జగన్‌కు తగదు – వ్యవసాయ, మత్స్యశాఖల‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు …

Read More »

బందరులో ప్రతి గడపకూ తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తా

– ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి తీరుతా – ఓటు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటాను – అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందించడమే లక్ష్యం – క్యాంబెల్‌‌పేటలో తాగునీటి పైపులైన్ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలు అందించడమే నా లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం …

Read More »

ఈ ఏడాది ఎస్సి సబ్ ప్లాన్ కి రూ. 20,643 కోట్లు

-జనవరి లోపు 100 శాతం నిధులు ఖర్చు చేయాలి -ఎస్సి సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదు -సబ్ ప్లాన్ నిధులు ప్రతి ఒక్క రూపాయి ఎస్సిలకే వినియోగించాలి -ఎస్సిలు సమాజంలో అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం -ఎస్సీల అభివృద్ధి కోసం అధికారులంతా చిత్త శుద్ధితో పనిచేయాలి -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -అమరావతి సచివాలయంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి అధ్యక్షతన నోడల్ ఏజన్సీ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

నాణ్యమైన వైద్య విద్య బోధనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి…

-రాష్ట్రంలోని 5 వైద్య కళాశాలలు టాప్ 100లో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. -ప్రొఫెసర్ల కొరత తీర్చేందుకు పదవీ విరమణ వయసు పెంచే విషయాన్ని వరిశీలిస్తాం -వైద్య విద్యార్థుల హాజరును ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షించాలి -2026-27 రెండో త్రైమాసికంలో బడ్జెటు, కేంద్ర సాయం వినియోగం 50%కు చేరాలి -వైద్య విద్య నాణ్యత, బడ్జెటు వినియోగంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సుదీర్ఘ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అతి కీలకమైన ప్రొఫెసర్ల పోస్టుల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉండడంతో …

Read More »

నగరంలో ‘పత్రీస్ గ్లామ్ లక్సీ’ సెలూన్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ఆర్టీసీ కాలనీలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన పత్రీస్ గ్లామ్ లక్సీ సిగ్నేచర్ సెలూన్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ స్థాయి సంస్థ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫ్రాంచైజీని విజయవాడ వాస్తవ్యులైన పత్రి శ్రీనివాస్, తన కుమారుడి భవిష్యత్తు కోసం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, మాట్లాడుతూ ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ 4లోని మూడవ అంతస్తులో ఈ లగ్జరీ సెలూన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన …

Read More »

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని జూలై 12 నాటికి పూర్తి చేస్తాం

-భారత ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను జూలై 12 నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో భారత ఎన్నికల సంఘం సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన …

Read More »

తోతాపురి మామిడి ధరల తగ్గుదలపై జిల్లా కలెక్టర్‌తో నిపుణుల కమిటీ సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తోతాపురి మామిడి పండ్ల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌తో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తోతాపురి మామిడి సాగు పరిస్థితులు, రైతులు, …

Read More »

విదేశాల లో అర్హత కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విదేశాల లో (ఫిన్లాండ్ మరియు జర్మనీ) నందు అర్హత కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. 1: ఫిన్లాండ్ దేశం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో (Auto Body Technicians, Structural Body Repair Specialists,MIG&TIG welders, Metal Workers) సంబంధిత ఉద్యోగ అవకాశాలు కల్పించబడును వారానికి 40 గంటలు పని దినములు. వయస్సు: 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. విద్యార్హతలు : …

Read More »

నగరంలో ఘనంగా శుభప్రదం షోరూమ్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసెంట్ రోడ్ మోడరన్ సూపర్ మార్కెట్ సమీపంలో నూతనంగా శుభప్రదం షో రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శుభప్రదం షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల చీరలను పరిశీలించడంతోపాటు వాటి నాణ్యత ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమ్మవారి ఇల్లయిన విజయవాడలో శుభప్రదం వారు అందించిన ఎరుపు, ఆకుపచ్చ రంగుల చీర కట్టుకుని …

Read More »