Breaking News

Monthly Archives: July 2026

దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వేదిక‌గా పీజీఆర్ఎస్‌

– ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు – విజ‌య‌వాడ తూర్పులో స్థానిక ప్ర‌జ‌ల నుంచి మొత్తం 61 అర్జీలు – కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాస్థాయిలో ప్ర‌తి సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌తో పాటు ప్ర‌తి శుక్ర‌వారం నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, …

Read More »

నూతన అదనపు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐ. కిషోర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థకు నూతన అదనపు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐ. కిషోర్ నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ను ఆయన ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేసిన జి.ఓ ఆర్.టి నెంబర్ 888 ప్రకారం బదిలీ చేయగా నేడు నగర పాలక సంస్థలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Read More »

పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారం ఇంకా అందని ఓటర్లు ఉంటే సమీప సచివాలయంలో సిబ్బందిని, లేదా వార్డ్ ల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను సంప్రదించి ఫారం పొందాలని, మరో 4 రోజుల్లో గడువు ముగుస్తున్నందున ఫారాలు అందిన వారు వెంటనే పూర్తి చేసి ఇవ్వాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. శుక్రవారం పట్టాభిపురం, ఐపీడీ కాలనీ, …

Read More »

ప్రభుత్వ అధికారులు నిర్దేశిత సమాచారం గడువులోగా ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీఐ చట్టం ప్రభుత్వ పారదర్శక పాలనను ప్రజలకు తెలియడానికి రూపొందించిన చట్టమమని, చట్ట ప్రకారం ప్రభుత్వ అధికారులు నిర్దేశిత సమాచారం గడువులోగా ఇవ్వాలని, చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సిటిజన్ చార్టర్, అధికారుల వివరాలతో కూడిన బోర్డ్ లను పరిశీలించి, ఆర్టీఐ చట్టం సెక్షన్ …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలు ఎవరికైనా అందకుంటే వార్డ్ లలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లు, సమీప సచివాలయాలు లేదా ఇంటింటికి వచ్చే బిఎల్ఓలకు అందించాలని, బిఎల్ఏలు కూడా సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పై గుర్తింపు పొందిన …

Read More »

జిటిఎస్ నిర్మాణ పనులని వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్ల (జిటిఎస్) నిర్మాణ పనులని వేగవంతం చేయాలని, నిర్మాణ పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏటుకూరు రోడ్ లో నిర్మాణంలో ఉన్న జిటిఎస్ పనులను, అనంతరం జాతీయ రహదారి వెంబడి పారిశుధ్య పనులను ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర …

Read More »

నగరంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) సంబంధించి నగరంలోని వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటికి అదనంగా ప్రజలు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే గుంటూరు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో కూడా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ల వద్ద ప్రతిరోజు ఉదయం …

Read More »

న్యాయమైన బీసీ డిమాండ్ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి… : భాస్కర బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయమైన బీసీ డిమాండ్ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించటానికి ఇప్పటికైనా స్పందించాలని పంచ వృత్తుల సంక్షేమ సంఘంరాష్ట్ర అధ్యక్షులు భాస్కర బాబు కోరారు. శుక్రవారం ధర్నా చౌక్ లో బీసీ డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నా లో పంచ వృత్తుల సంక్షేమ సంఘంరాష్ట్ర అధ్యక్షులు భాస్కర బాబు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, …

Read More »

నూతన ఔషధాలతో మానవజాతికి మహోపకారం

-పి.బి. సిద్ధార్థలో ఆస్ట్రాజెనికా సైంటిస్ట్ డా.తాటి రమేశ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జీవశాస్త్రరంగంలో పరిశోధనలతో గతంలో చికిత్సకు లొంగని వ్యాధులకు నూతన మందులు తయారవుతూ మానవాళికి మహోపకారం చేస్తున్నాయని, ఔషధ తయారీరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఆస్ట్రాజెనెకా (స్వీడన్) పరిశోధన విభాగం సీనియర్ శాస్త్రవేత్త డా. తాటి రమేష్ అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జీవశాస్త్రాల విభాగాలు శుక్రవారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఔషధ ఆవిష్కరణ, నూతన ధోరణులపై కీలకోపన్యాసం చేస్తూ మందుల …

Read More »

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ధర్నా చౌక్ లో బీసీ డిమాండ్లపై మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు, బీసీ రిజర్వేషన్లు పెంచకపోవడం వలన బీసీలు విద్యా ఉద్యోగ …

Read More »