Breaking News

Monthly Archives: July 2026

పిఠాపురం నియోజకవర్గం, మూలపేట జెడ్పీ హైస్కూలు సిబ్బందికి పవన్ కళ్యాణ్ అభినందనలు

-నో అడ్మిషన్ బోర్డుపై ఉపముఖ్యమంత్రి స్పందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియేట్ లో కాకినాడ జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అభినందించారు. జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, గురువారం- 7వ తరగతి నుంచి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు …

Read More »

దివ్యాంగుల సాధికారతపై జాతీయ అవార్డులకు నామినేషన్లు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల సాధికారత(Empowerment of Persons with Disabilities- 2026)జాతీయ అవార్డులకు అర్హులైన వ్యక్తులు,సంస్థల నుండి నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం తెలియజేసిందని రాష్ట్ర దివ్యాంగులు,ట్రాన్సు జెండర్స్ మరియు సీనియర్ సిటిజన్స్ శాఖ సంచాలకులు యం.వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.దివ్యాంగుల సాధికారతకు వినూత్న రీతిలో విశేష కృషి చేసి వారి జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు పాటుపడిన వారిని గుర్తించి గౌరవించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారత …

Read More »

నిడదవోలులో విశాఖ – ముంబై ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ మంజూరు

-కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కృతజ్ఞతలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం–ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి) ఎక్స్‌ప్రెస్‌ (18519/18520)కు హాల్ట్ మంజూరైనందుకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ …

Read More »

మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు

-రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు -వైసీపీ అనే మూతపడే దుకాణానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక గుమస్తా లాంటివాడు -కనీసం ఒక కార్పొరేటర్ గా కూడా గెలవలేని సజ్జలకు అమరావతిపై మాట్లాడే అర్హత లేదు -కత్తి, కొడవలి, గన్, గొడ్డలి సంస్కృతి తప్ప జగన్‌కు, సజ్జలకు వేరే ప్రపంచం తెలియదు -పూటకో మాట, నిలకడలేని రాజకీయాలు చేస్తున్న వైసీపీ అధినాయకత్వానికి అసలు దిశా-నిర్దేశం లేదు -వైసీపీ దౌర్భాగ్యపు రాజకీయాలు చూసి ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు ఆర్యవైర్య కార్పొరేషన్ ఛైర్మన్ …

Read More »

కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభం రాష్ట్రానికి శుభపరిణామం

-రూ.2,000 కోట్లతో 400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం -దేశంలో తొలి గ్రీన్ ఎనర్జీ ఆధారిత ఉక్కు కర్మాగారం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కడపలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక ఘట్టమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. రూ.2,000 కోట్ల …

Read More »

యువ పారిశ్రామికవేత్తలు రావాలి…

-పి.బి. సిద్ధార్థలో యువశక్తి ట్రస్ట్ గోష్ఠి  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు వ్యాపారంలోకి రావాలని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, అయితే మనదేశంలో యువ వ్యవస్థాపకుల సంఖ్య ఆశాజనకంగా లేదని ఎఫ్ట్రానిక్స్ చైర్మన్ దాసరి రామకృష్ణ అన్నారు. శుక్రవారం విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వెబినార్ హాలులో జరిగిన భారతీయ యువ శక్తి ట్రస్టు మెంటార్ గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జపాన్ మన కన్నా 20 శాతం అధిక ఉత్పాదన కలిగి …

Read More »

దేవాలయ భూముల రక్షణకు ఎమ్మెల్యే యార్లగడ్డ చొరవ

-వేణుగోపాలస్వామి ఆలయ భూమిపై ఆక్రమణలకు అడ్డుకట్ట వేసిన రెవిన్యూ అధికారులు -అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్ శివయ్య గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన భూమిని ఆక్రమణల నుంచి రక్షించేందుకు గన్నవరం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ శివయ్య తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గ్రామస్థులు దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 424/1లోని సుమారు 0.24 సెంట్ల …

Read More »

అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే సందర్భంగా జూట్ సంచుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్లాస్టిక్ సంచులకు స్వస్తి పలుకుదాం, పర్యావరణ హిత సంచుల వినియోగాన్ని అలవాటు చేసుకుందాం అని విజయవాడ నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ కె. షమ్మీ అన్నారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ కె. షమ్మీ శుక్రవారం పటమట ప్రాంతంలో ప్రజలకు జూట్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి తీవ్ర హాని …

Read More »

జూనోటిక్ వ్యాధుల నివారణకు సమష్టి కృషి

-ప్రపంచ జూనోసిస్ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -జూలై 6న ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం -ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జూలై 6న ఎన్‌టీఆర్ జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో ఉచిత రేబీస్ టీకాల కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 జూలై 6న ఎన్‌టీఆర్ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, ఎన్‌టీఆర్ జిల్లా …

Read More »

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రత్యక్ష పర్యవేక్షణ..!

– నియోజ‌క‌వ‌ర్గాల్లో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విస్తృత ప‌ర్య‌ట‌న‌లు – కార్య‌క్ర‌మం స‌జావుగా జ‌రిగేలా అధికారుల‌కు దిశానిర్దేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర సవ‌ర‌ణ ప్ర‌క్రియ (స‌ర్‌)ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ప్ర‌తిరోజూ నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏపీఐఐసీ కాల‌నీలో స‌ర్ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ ప్ర‌స్తుతం ముమ్మ‌రంగా సాగుతున్న నేప‌థ్యంలో ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా అధికారులు, సిబ్బందికి సూచ‌న‌లు చేశారు. …

Read More »