విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 38వ డివిజన్, కుమ్మరిపాలెం ప్రాంతంలోని రావి చెట్టు సెంటర్, ఆళ్ల సింహాద్రి వీధి, తదితర ప్రాంతాలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం సంకల్పించింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎస్ ఈ దుష్యంత్, డీఈఈ బసివి రెడ్డి, ఏ ఈ లు జనార్ధన్, సూర్యకుమారి, కూటమి నేతలు పితాని పద్మ, సురభి బాలు, తమ్మిన లీలా కరుణాకర్, గంజి పవన్,గన్ను శంకర్ తదితరులతో కలిసి ఆ ప్రాంతంలోని …
Read More »Monthly Archives: July 2026
“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా ఫౌండేషన్” ద్వారా రెండో రోజు, ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ,నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి శని, ఆదివారలలో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ ,జనరల్, డెంటల్, కంటి పరీక్షలు, బీ పీ, షుగర్, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ రే, …
Read More »విద్యార్థినుల సౌకర్యాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం..
-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలోని విద్యార్థినుల సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ఎన్డీయే కూటమి పనిచేస్తుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు. భవానిపురం సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థినిలకు ప్రభుత్వం సమకూర్చిన బ్లాంకెట్, కార్పెట్ తో పాటు నైట్ డ్రెస్సులు, చలి కోట్లు, టర్కీ టవల్సు తదితర సామగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. ఈ …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 20వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »నగర ప్రజలు త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానదిలోకి గోదావరి నీరు వస్తున్నందున నీటిలో టర్బిటి శాతం అధికంగా ఉండే అవకాశం ఉంటుందని, త్రాగునీటి సరఫరా సమయంలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ శ్యాంపిల్స్ తీయాలని, నగర ప్రజలు కూడా కొంత కాలం త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరానికి ప్రధాన త్రాగునీటి వనరైన ప్రకాశం బ్యారేజిలోకి …
Read More »విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారానికి క్రుషి చెయ్యాలని MLA కి వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎ.పి.విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ(APVTUSC) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా జూలై 18, 19 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించాల్సిన కార్యాచరణలో భాగంగా ఈ రోజు నందిగామ నియోజకవర్గం శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కి సమస్యలపై వినతిపత్రం ఇవ్వటమైనది ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారానికి కృషి చెయ్యాలని కోరటమైనది. ఉద్యోగులందరికి వెంటనే మెరుగైన పిట్ మెంట్ తో …
Read More »జపాన్ ఓపెన్ సూపర్–750 టైటిల్ విజేత పీవీ సింధుకు శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 15 నుంచి 20, 2026 వరకు జపాన్‌లోని టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగిన ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలవడం పట్ల శాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్ పోరులో జపాన్‌కు చెందిన స్టార్ షట్లర్ అకానె యమగుచిపై అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించి జపాన్ ఓపెన్ సూపర్–750 …
Read More »AEE నోటిఫికేషన్ దరఖాస్తుల గడువు ముగింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ శాఖలో విడుదలైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈరోజు రాత్రి 11:59 గంటలకు ముగియనున్నట్లు APCPDCL సీఎండీ పి. పుల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగి ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, గడువు ముగిసేలోపు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి, అవసరమైన …
Read More »ఈ నెల 20న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో …
Read More »జీవో నెం.45 అమలులో విద్యుత్ సంస్థల జాప్యం – వేలాది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన…
-విద్యుత్ సంస్థల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు మినిస్టర్లతో కమిటీ వేసి, సుదీర్ఘ సమయంలో అన్ని విషయాలు చర్చించి, కేబినెట్ ఆమోదంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా, దాదాపు 15 వేల మందికి మేలు చేసేలా, ఈ నెల రెండవ తేదిన జారి చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.45 ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు మరియు ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచెందుకై …
Read More »
Prajavartha Online Telugu News