Breaking News

Monthly Archives: July 2026

సమస్యలు సాధన కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధ పడాలి

-సమగ్ర శిక్ష పీటీఐ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రనాయకులు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఆర్ట్, వర్క్, వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు ఇతర విభాగాల కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని సమగ్ర శిక్ష పీటీఐ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి సైకం శివకుమారి రెడ్డి,రాష్ట్రప్రధానకార్యదర్శి శంకరరావు పిలుపు నిచ్చారు. ఆదివారం విజయవాడలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమగ్ర శిక్ష ఆర్ట్, వర్క్, …

Read More »

పిల్లల్లో కళా నైపుణ్యం పెంపొందించుటకై త్రెడ్ బ్యాంగిల్స్ తయారీ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ప్రతి ఆదివారం నిర్వహించు చదవటం మాకు ఇష్టం కార్యక్రమంలో భాగంగా ఆదివారం విద్యార్థులకు వినూత్నంగా దారంతో రకరకాల గాజులు తయారు చేయటం నేర్పించబడును. శాఖమూరి హైందవి ప్రత్యేకంగా గుంటూరు నుంచి విచ్చేసి విద్యార్థులకు దారంతో గాజులు తయారు చేసే విధానం నేర్పించి వాటిపైన వివిధ రకాల కుందన్స్ అంటించి అందమైన గాజులుగా తయారు చేశారు. ఆమె మాట్లాడుతూ పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుతోపాటు ఎటువంటి వాటిపై శిక్షణ తీసుకోవడం …

Read More »

ఆర్టీసీ పరిరక్షణ – ప్రజా రవాణా బలోపేతమే జేఏసీ లక్ష్యం…

-20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంతకాల సేకరణ -27న జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వినతిపత్రం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని మరింత బలోపేతం చేయడంతో పాటు, స్త్రీశక్తి పథకం అమలుతో రోజుకు సుమారు 15 లక్షల మంది అదనపు ప్రయాణికులు పెరిగిన నేపథ్యంలో, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రజా రవాణా సేవలను విస్తరించాలని కోరుతూ ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ …

Read More »

ప్రభుత్వ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రోత్సాహకాలు ఇవ్వాలి-ఎస్.టి.యు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యాశాఖ మండలాల వారీగా పదవ తరగతి ప్రతిభావంతులకు షైనింగ్ స్టార్స్ పేరుతో అందిస్తున్న రూ.20 వేల ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలని ఎస్.టి.యు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్‌లు ప్రభుత్వాన్ని కోరారు. నిన్న పాఠశాల విద్యాశాఖ జిల్లాల్లో విడుదల చేసిన షైనింగ్ స్టార్స్ ఎంపిక జాబితాలు పరిశీలిస్తే మూడు వంతుల మంది ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులే ఉన్నారని, కేవలం పావు వంతు మాత్రమే ప్రభుత్వ విద్యార్థులు …

Read More »

గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

-శాస్త్రోక్తంగా ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు -జూలై 20న వైభవంగా పార్వేట ఉత్సవం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున రాత్రి గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయహస్తంతో దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన …

Read More »

సత్యసాయి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం – ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు

-సీతారాంపురంలో సత్యసాయి ట్రాఫిక్ పోలీస్ బూత్ ప్రారంభించిన బొండా ఉమా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ సీతారాంపురం సిగ్నల్ వద్ద ఆదివారం శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ బూత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు …

Read More »

భక్తి, ఆధ్యాత్మికత సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయి – బొండా ఉమ

-సెంట్రల్ నియోజకవర్గంలో వైభవంగా శ్రీ పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకున్న – MLA బొండా ఉమామహేశ్వరరావు -5000 కిలోల లడ్డుతో అలంకరించిన రథాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని BRTS సత్యనారాయణపురం సరదా కళాశాల ఎదురుగా ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శ్రీ పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా 5000 కిలోల లడ్డుతో అలంకరించిన రథాన్ని ప్రభుత్వ విప్, …

Read More »

జీవీఆర్ నగర్‌లో జీఆర్టీ చికెన్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 30వ డివిజన్ దేవీనగర్ 8వ రోడ్డు GRT చికెన్ సెంటర్ మరియు అరుణాచలేశ్వర కేటరర్స్ టిఫిన్స్ & ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గద్దె రవితేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఆర్టీ చికెన్ సెంటర్ ను ఆదివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ జీవీఆర్ నగర్, దావు బుచ్చయ్య కాలనీ, వినాయక్ నగర్, రామకృష్ణాపురం ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్లు ఏర్పడుతున్న …

Read More »

ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలను విజయవంతం చేయాలి…

-సెప్టెంబరు 1న చలో దిల్లీకి సన్నద్ధం కావాలి -సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఆగస్టు 6 నుంచి 15 వరకు జరగనున్న పార్టీ ప్రచార యాత్రలు, పాదయాత్రలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. సెప్టెంబరు 1న చలో దిల్లీకి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఆదివారం విజయవాడ చంద్రం బిల్డింగ్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం దోనేపూడి శంకర్ అధ్యక్షతన …

Read More »

సోనమ్ వాంగ్ చుక్‌తో కేంద్రం చర్చలు జరపాలి

-మోదీ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం -82 పరీక్ష పేపర్ల లీక్‌లు.. పరీక్షల రద్దులు… -ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలి -అయోధ్య నిధుల దుర్వినియోగంపై సుప్రీం న్యాయమÖర్తితో విచారణ -ఏపీలో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విడనాడాలి -గుంటూరు జిల్లాలో మహిళ వివస్త్ర ఘటన దారుణం -సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దాదాపు 82 పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకోవడంతో దేశ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా మారిందని …

Read More »