Breaking News

Monthly Archives: July 2026

షిఫ్ట్ ఓటర్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : షిఫ్ట్ ఓటర్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని జేడీ నగర్, తోటవారి వీధిలో ఉన్న 59వ సచివాలయాన్ని సందర్శించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయా చిరునామాల్లో నివసించని వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి …

Read More »

ఈ నెల 9న బనగానపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు

-మీ భూమి- మీహక్కు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మీ భూమి- మీహక్కు కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 9 తేదీన నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. రీ సర్వే ప్రక్రియ పూర్తైన గ్రామాల్లోని రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసేందుకు గానూ ముఖ్యమంత్రి బనగానపల్లె నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జూలై 9 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే పట్టాదారు పాస్ పుస్తకాలతో …

Read More »

రైతు కుటుంబాలు ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేలా పారిశ్రామికీకరణ

-ఇథనాల్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా ప్రోత్సాహం -19వ ఎస్ఐపీబీ సమావేశంలో 11 ప్రాజెక్టులకు ఆమోదం -రూ.9,076 కోట్ల పెట్టుబడులు – 10,531 ఉద్యోగాలకు అవకాశం -సీఎం చంద్రబాబు అధ్యక్షతన 19వ ఎస్ఐపీబీ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని… ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా భవిష్యత్‌లో పెరిగే ఇథనాల్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ 40 …

Read More »

గుమ్మడి గోపాలకృష్ణకు సీఎం చంద్రబాబు అభినందన

-కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికపై ప్రశంస అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. సీఎం చంద్రబాబును సచివాలయంలో గోపాలకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రంగస్థలం నటనకు తొలిసారి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం సంతోషకరమన్న సీఎం…గుమ్మడి గోపాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గోపాలకృష్ణ వేసే నాటకాలన్నీ బాగుంటాయని, తన …

Read More »

ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

-రేపు సంబంధిత శాఖల కార్యదర్శులతో పవన్ కళ్యాణ్ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ సమస్యల పరిష్కారానికి తక్షణ కార్యాచరణ చేపడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి సబ్సిడీలు పెండింగ్ ఉన్న అంశంపై బుధవారం ఎంఎస్ఎంఈ, ఆర్థిక, పరిశ్రమల శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం అయ్యారు. వారిని ఆప్యాయంగా పలకరించి, సమస్యలు సావధానంగా విన్నారు. …

Read More »

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు

-క్రీస్తు పూర్వం నుంచే కృష్ణా తీరాన విరాజిల్లిన విషయాన్ని చెప్పే శాసనాలు -చారిత్రక సాక్ష్యాలను వెలుగులోకి తెచ్చిన పురావస్తు శాస్త్రవేత్తలకు పవన్ కళ్యాణ్ అభినందనలు -మన వారసత్వ సంపద గుర్తింపు, సంరక్షణ మా బాధ్యత -అటవీశాఖ నుంచి నిరంతర సహకారం అందిస్తామన్న ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ(ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం అద్భుత …

Read More »

ఆరు నెలల్లో అగ్రి గోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం

-వైసీపీ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల పత్రాలు ధ్వంసం -భూముల రికార్డులు నాశనం చేశారు -సీఐడీ దగ్గరున్న హార్డ్ డిస్క్ లు సైతం మాయం -అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి అండగా ఉంటాం -ఆస్తుల పరిరక్షణకు జియో ట్యాగింగ్ -ప్రతి 15 రోజులకోసారి మంత్రుల కమిటీ సమీక్ష -అగ్రిగోల్డ్ సమస్యపై మంత్రుల సబ్ కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయిన …

Read More »

హస్త కళలను బతికిద్దాం.. దేశ మూలాలను కాపాడుకుందాం

-ప్రతి కళాకారుడికి తగిన గౌరవం దక్కాలి -ప్రపంచ మార్కెట్ తో హస్తకళల అనుసంధానం -కళాకారుల ఆరోగ్య, ఆర్థిక భరోసాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -కళాకృతులకు మార్కెట్ పెరగాలి -సాంకేతికతను ఉపయోగించుకొని మార్కెట్ విస్తరణ జరగాలి -లోకల్ టూ గ్లోబల్ అనేది మన నినాదం -రాష్ట్రంలోని 2 లక్షలకు పైగా కళాకారులంతా నా కుటుంబసభ్యులే -హస్తకళాకారులతో మాటామంతీ కార్యక్రమంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘భారతదేశపు మూలాలు హస్తకళా రంగాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కోల్పోయిన రోజున …

Read More »

ఇంద్రకీలాద్రి పై ఆషాఢ మాసం ఉత్సవాల షెడ్యూల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆషాఢ మాసం ఉత్సవాలు (ఆషాఢ సారె, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాల) షెడ్యూల్ తెలియచేసారు. ఈరోజు ఉదయం ఆలయ ట్రస్ట్ బోర్డ్ సమావేశం CV రెడ్డి చారిటీస్, పాడి వీధి,వన్ టౌన్ లో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అధ్యక్షతన జరిగింది. ఆషాఢ మాసం ఉత్సవాలు (ఆషాఢ సారె, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాల) షెడ్యూల్ వివరాలు ఈ సందర్బంగా విడుదల చేశారు. ఆషాఢ సారె సందర్బంగా …

Read More »

బాధిత కుటుంబాల ఆవేదన కలచివేస్తోంది: మంత్రి అచ్చెన్నాయుడు

– గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం – బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 లక్షల చొప్పున అందజేయాలని వైజాగ్ కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకార పడవలోని ఆరుగురు మత్స్యకారుల ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు ప్రస్తుతం అనుభవిస్తున్న వేదన, ఆందోళన, అనిశ్చితి తమను ఎంతగానో కలచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం …

Read More »