విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర సోమవారం సాయంత్రం మారుతి నగర్‌లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) 2026లో భాగంగా జరుగుతున్న హియరింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఒక హియరింగ్‌ను నిర్వహించడంతో పాటు, బీఎల్‌వోలు నిర్వహిస్తున్న హియరింగ్‌లను సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ 2026లో భాగంగా అన్మ్యాప్డ్ కేసులకు సంబంధించి అర్హులైన ఓటర్లకు నోటీసులు జారీ చేసి, నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో హియరింగ్‌లు …
Read More »Monthly Archives: August 2026
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో పరిష్కరించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు …
Read More »మారిస్ స్టెల్లా కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు – 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాల (అటానమస్), విజయవాడలోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు – 2026ను ఆగస్టు 24న కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశం అంతరిక్ష విజ్ఞానం మరియు సాంకేతిక రంగాల్లో సాధించిన విశేష విజయాలను స్మరించుకోవడంతో పాటు, అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగంలో అవకాశాలను అన్వేషించేందుకు యువతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం “India’s Space Journey Towards Viksit Bharat 2047” (వికసిత్ భారత్ …
Read More »ఉన్నత పాఠశాల లు గా అప్గ్రేడ్ చేయబడిన పాఠశాల లకు వాచ్ మెన్ లను నియమించండి… : ఆప్టా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారం లో వచ్చిన తర్వాత విద్యా సంస్కరణ లో భాగంగా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల లను ఉన్నత పాఠశాలలు గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అప్గ్రేడ్ కాబడి సంవత్సరం పూర్తి కాబడిన ఆ పాఠశాల లకు ఇంత వరకు వాచ్ మెన్ లను నియమించ లేదు అని వెంటనే వాచ్ మెన్ లను నియమించాలి అని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ …
Read More »ఘనంగా హెచ్‌సీఎల్ గ్రూప్ 50వ వార్షికోత్సవ వేడుకలు
-విజయవాడలో సిద్ శ్రీరామ్ సంగీత కచేరీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్‌సీఎల్ గ్రూప్ తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఉద్యోగుల కోసం ప్రత్యేక సంగీత కచేరీని నిర్వహించింది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు సిద్ శ్రీరామ్ ఈ కార్యక్రమంలో తన సంగీతంతో అలరించారు. హెచ్‌సీఎల్‌టెక్ క్యాంపస్‌లో జరిగిన ఈ వేడుకలో హెచ్‌సీఎల్ గ్రూప్, శివ్ నాడార్ ఫౌండేషన్‌కు చెందిన 3,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హెచ్‌సీఎల్ గ్రూప్, హెచ్‌సీఎల్‌టెక్ …
Read More »శబరిమల పవిత్రతను కాపాడాలి.. భక్తుల సమస్యలు పరిష్కరించాలి
-గురుస్వాముల రాష్ట్ర సమ్మేళనంలో పీవీఎన్ మాధవ్.. టీటీడీ తరహాలో వ్యవస్థకు డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శబరిమల అయ్యప్ప క్షేత్ర పవిత్రతను కాపాడటంతో పాటు అయ్యప్ప భక్తులకు మెరుగైన యాత్రా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. నవంబరు 15 నుంచి జనవరి 20 వరకు జరిగే అయ్యప్ప సీజన్‌లో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో …
Read More »మహిళా సాధికారతకు బీజేపీ పెద్దపీట
-వికసిత్ భారత్‌లో యువతదే కీలక పాత్ర -పార్టీ పదవుల్లో 33 శాతం మహిళలకు కేటాయింపు -చట్టం చేసే ముందు ఆచరించి చూపిస్తున్నాం -పదవుల కోసం కాదు.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి రావాలి -యువత భవిష్యత్ ప్రజాప్రతినిధులుగా ఎదగాలి: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారతకు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. చట్టాలు చేసే ముందు వాటిని ఆచరించి …
Read More »మంత్రి అనగాని సత్యప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో జరగనున్న అమరావతి ఛాంపియన్‌షిప్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, తిరుపతి ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం …
Read More »రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
-ఉపరాష్ట్రపతితో కలిసి మొక్కజొన్న కొత్త వంగడాన్ని ఆవిష్కరించనున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్, బ్రాండింగ్‌తో మార్కెట్‌కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగానికి ఏలూరు జిల్లా ముసునూరు వేదిక కానుంది. దేశంలో తొలి నాన్-GMO పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా ఆవిష్కరించనున్నారు. ఏలూరు జిల్లా జిల్లా ముసునూరులో గోర్మే పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యు పరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని …
Read More »“మూడు దశాబ్దాల కలగా ఉన్న వెలిగొండ నిర్వాసితుల జీవితాలకు వెలుగు“
-రాష్ట్రానికి పోలవరం జీవనాడి – పశ్చిమ ప్రకాశం ( మార్కాపురం జిల్లా) కి వెలిగొండ జీవనాడి. -ఫ్లోరైడ్ మరియు కరువు సమస్యలకు చెక్ -సాగు, త్రాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి వనరుల లభ్యత -పోలవరం నుండి బొల్లాపల్లికి, బొల్లాపల్లి నుండి వెలిగొండ ( నల్లమల్ల సాగర్ ) కి అనుసంధానం ద్వారా దీర్ఘాకాలిక నీటి వనరుల లభ్యత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దశాబ్దాలుగా కలగా మిగిలిన వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి చేసి 1.09 లక్షల ఎకరాలకు …
Read More »
Prajavartha Online Telugu News