గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & హెచ్‌ఆర్) టీవీఎస్ఎన్ మూర్తి వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలోని మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను డైరెక్టర్ పరిశీలించారు.పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ సందర్శనలో CRDA …
Read More »Monthly Archives: August 2026
ఖాళీల భర్తీకి ‘జాబ్ క్యాలెండర్ ‘ను సిద్ధం చేయాలి
-5 శాతానికి మించి ఖాళీలు ఉండకూడదు -అధికారులకు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ ఖాళీల భర్తీకి ‘జాబ్ క్యాలెండర్ ‘ను రూపొందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను అదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిథిలోని ఆయా శాఖల అధికారులు ఉద్యోగ ఖాళీల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరిగేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి వెల్లడించారు. మంగళగిరి ఎపిఐఐసిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన …
Read More »ఉయ్యూరులో డయేరియా లక్షణాలపై కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక దృష్టి
-5, 18, 19వ వార్డుల్లో తాగునీటి కాలుష్యంపై సమగ్ర తనిఖీలు – ప్రతి ఇంటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశం ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ ఉయ్యూరులో డయేరియా లక్షణాల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉయ్యూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి, డయేరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న రోగులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారుల వివరాల ప్రకారం ఇప్పటివరకు 26 మంది డయేరియా లక్షణాలతోటి సిహెచ్సిలో …
Read More »భారత ఉపరాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణం…ఘనంగా వీడ్కోలు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో కార్యక్రమం ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నరు ఎస్ అబ్ధుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఆర్టిజిఎస్ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వైద్య ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం మధ్యాహ్నం 2:25 గంటలకు భారత ఉపరాష్ట్రపతి ప్రత్యేక …
Read More »డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు
-గృహ సముదాయంలో రూ.9.70 కోట్లతో మౌలిక సదుపాయాలు -రూ.5.10 కోట్లతో ఊరచెరువు అభివృద్ధి -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : అద్ధంకి మున్సిపాలిటీలోని శింగరకొండ వద్ద నిర్మిస్తున్న టిడ్కో గృహ సముదాయాలను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. టిడ్కో సముదాయంలో రూ.9.70 కోట్లతో ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయల పనులకు సోమవారం ఆయన భూమి పూజ చేశారు. అదే విధంగా రూ.5.10 కోట్లతో చేపట్టే ఊరచెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. …
Read More »దర్శిలో రూ.27 కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం
-రూ.150 కోట్లతో దర్శి నియోజకవర్గంలో విద్యుత్ అభివృద్ధి పనులు -రూపాయి పనిచేయకుండా వెలిగొండను ప్రారంభించిన ఘనత జగన్‌కే చెల్లింది -రాష్ట్ర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో లో ఓల్టేజీ, విద్యుత్ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. దర్శి …
Read More »ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 సంవత్సరం కన్నా ముందు ఉపాధ్యాయులుగా నియమించబడి ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారందరూ తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ యాజమాన్యం (ప్రభుత్వ / స్థానిక సంస్థ / APREIS / ప్రభుత్వ సంక్షేమ సంఘాల రెసిడెన్షియల్ / AP మోడల్ పాఠశాలలు / ప్రైవేట్ ఎయిడెడ్ / ఇతర ప్రభుత్వ) పాఠశాలలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ …
Read More »హెచ్‌ఐవీపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని 60 రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వివిధ కార్యక్రమల ద్వారా అవగాహన ను కల్పిస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు డాక్టర్ భీమవరపు కృష్ణ మోహన్ రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాటశాల 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వి.రాజమోహన్, ప్రాజెక్ట్ మేనేజర్, వాసవ్య మహిళా మండలి తెలిపారు. ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ అనేది …
Read More »గోదావరి పుష్కరాలకు భారీ స్థాయిలో వైద్య సేవల ఏర్పాట్లు
-525 ఘాట్లలో 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆసుపత్రులు -30,000 మందికి పైగా వైద్య సిబ్బంది మొహరింపు -అంబులెన్స్‌ల కోసం పత్రేక గ్రీన్ కారిడార్ -ఏప్రిల్ 30, 2027 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం -గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి -ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు-2027ను పురస్కరించుకుని వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా భారీ …
Read More »నోటీసు జారీ.. ఓటు తొలగింపు కాదు..
– అత్యంత పారదర్శకంగా నోటీసులపై విచారణ – వాస్తవ నిర్ధారణ తర్వాతే నిర్ణయం.. ఓటర్లకు భరోసా – ఓటుహక్కు పరిరక్షణ కోసమే సర్ సమగ్ర ప్రక్రియ – ఫారం-6 ద్వారా కొత్తగా ఓటు నమోదుకూ అవకాశం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా జారీచేస్తున్న నోటీసులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసు జారీ అంటే ఓటు తొలగింపు కాదని, అత్యంత పారదర్శకంగా విచారణ తర్వాతే …
Read More »
Prajavartha Online Telugu News