అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో, విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ భూవరాహ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పవిత్ర మహోత్సవాలు 24-08-2026 నుండి 26-08-2026 వరకు మూడు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మహోత్సవాలలో భాగంగా ఈరోజు, 25-08-2026 మంగళవారం, రెండవ రోజు కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఉదయం 09:00 గంటలకు శ్రీ భూవరాహ వ్రతం వైభవంగా నిర్వహించబడింది. …
Read More »Monthly Archives: August 2026
పశువైద్యశాఖలో ఖాళీగా ఉన్న రాష్ట్ర డైరెక్టర్ పోస్ట్ తో సహా పశు వైద్యుల పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి…
-కరువు పరిస్థితుల్లో పశువులకు మేత, నీరు, వైద్యం అందించాలి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పశుసంవర్ధకశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులన్నింటినీ ప్రభుత్వం తక్షణమే భర్తీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిలు ఎ.కాటమయ్య పి. జమలయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర డైరెక్టర్ పోస్టుతో సహా సుమారు 500 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆగస్టు 6వ తేదీ నుంచి పశుసంవర్ధకశాఖ రాష్ట్ర డైరెక్టర్ …
Read More »ప్రతిసారి జూడాల స్టైపెండ్ 15 శాతం పెంచడం పూర్తిగా అనుచితమన్న జగన్ రెడ్డి
-తమిళనాడు, కేరళ తరహాలో 3 నుంచి 4 శాతం పెంచడం సబబు అని స్పష్టంచేసిన మాజీ సీఎం -నవంబరు, 2022లో మెమో జారీ చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం -సమ్మె చేస్తున్న జూడాలపట్ల మొసలికన్నీరు కారుస్తున్న జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలు వెర్రివాళ్లు.. తానేం చెప్పినా నమ్ముతారనే ధోరణి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిలో దినదినాభివృద్ధి చెందుతోందని… జూనియర్ డాక్టర్ల(జూడాల) సమ్మెపై జగన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ఇందుకు సజీవ తార్కాణమని రాష్ట్ర …
Read More »విశాఖపట్నంలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ఆధ్వర్యంలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో 2026ను సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్, బీచ్ రోడ్‌లో నిర్వహించనున్నారు. ఏపీ ఛాంబర్స్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ బిజినెస్ ఎక్స్‌పో 2026 బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ఛాంబర్స్ చేపట్టిన …
Read More »యువకవులకు సిద్ధార్థ కళాపీఠం ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగం సంయుక్త నిర్వహణలో ఈనెల 29న విజయవాడ సిద్ధార్థ కళాశాల సెమినార్ హాలులో నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులతో యువకవితా గానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమగడ్డ లలితప్రసాద్ తెలిపారు. మంగళవారం పి.బి. సిద్ధార్థ వెబినారు హాలులో యువ కవితాగానం కరపత్రం విడుదల కార్యక్రమంలో ఆయనతోపాటు కళాపీఠం కార్యదర్శి బివిఎస్ ప్రకాశ్, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, …
Read More »శాఖల్లో సమర్ధత – సేవల్లో నాణ్యత
-సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం డేటా ఇంటిగ్రేషన్ -డెంగీ, మలేరియా నివారణకు హాట్‌స్పాట్‌ల గుర్తింపు -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చెయిన్… వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్‌లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలన్నారు. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి …
Read More »ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం
-అంతర్జాతీయ మార్కెట్లకు మన వ్యవసాయ ఉత్పత్తులు -ఆంధ్రా పాప్ కార్న్, అరకు కాఫీ, కోస్తా కోకో గ్లోబల్ బ్రాండ్లుగా మారాలి -దేశీయ రకం హైబ్రీడ్ పాప్ కార్న్ మొక్కజొన్న విత్తనాలు విడుదల -ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడించే ప్రక్రియను చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పిలుపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరిగి రైతులకు ప్రయోజనం …
Read More »సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు GST రాయితీ కల్పించాలి: కేంద్ర మంత్రులకు లంకా దినకర్ విజ్ఞప్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ భూముల్లో సుబాబుల్ (Leucaena leucocephala), యూకలిప్టస్ (జమాయిల్) వంటి అగ్రో-ఫారెస్ట్రీ పంటలను సాగు చేస్తున్న రైతులకు GST నుంచి తగిన రాయితీ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, కేంద్ర టెక్స్‌టైల్స్, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ వేదప్రకాశ్ గోయల్ కి లంకా దినకర్ 24 …
Read More »తిరుపతి జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభం
-మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత: హోం మంత్రి వంగలపూడి అనిత తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల భద్రత, రక్షణకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించేందుకు తిరుపతి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళల భద్రత, గౌరవం, రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని తెలిపారు. మహిళలపై జరిగే …
Read More »అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీలు ప్రారంభం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింతగా ప్రోత్సహించడం, యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం, ప్రతిభావంతులైన క్రీడాకారులకు మెరుగైన పోటీ వేదికను కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీలను సోమవారం తిరుపతిలో ఘనంగా ప్రారంభించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) చైర్మన్ అనిమిని రవి నాయుడు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ …
Read More »
Prajavartha Online Telugu News