-గ్రేట్ గ్రీన్ వాల్ రెండో అంచెలో తుపాను గాలి నిరోధక వ్యవస్థగా తాటి చెట్లు -తాటి గింజల సేకరణ, నాటే ప్రక్రియ ప్రారంభం -5,499 హెక్టార్ల విస్తీర్ణంలో 55 లక్షల తాటి గింజలు నాటడం లక్ష్యం -సీజన్ ప్రారంభంలోనే 13 లక్షల తాటి గింజలు సేకరించిన అటవీ శాఖ -తాటి వనాల ఏర్పాటు ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుదీర్ఘ తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచం ఏర్పాటు దిశగా …
Read More »Monthly Archives: August 2026
‘స్థానికం’లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం
-రాష్ట్ర బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవిత -న్యాయ పోరాటానికి కూటమి ప్రభుత్వం సిద్ధం -బీసీ రిజర్వేషన్ల అమలుతో జగన్ లో గుబులు -బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు -5 ఏళ్ల పాలనలో బీసీలను అణగదొక్కారు -స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కుదింపుతో 16,800 పదవులకు బీసీలు దూరం -జగన్ ధన దాహానికి బీసీలు బలి -ఆనాడు బీసీల సంక్షేమం ఎందుకు రాలేదు..? -స్థానిక ఎన్నికల కోసమే జగన్ మొసలి కన్నీరు -వెనుకబడిన కులాలను అక్కున చేర్చుకున్న సీఎం చంద్రబాబు -సామాజిక, రాజకీయ …
Read More »స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం
-చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి -చెప్పుకోలేక ప్రచారంలో వెనకబడ్డాం -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంగళవారం నాడు సహచర మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మంత్రి గొట్టిపాటి మినిస్టర్స్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయానికి చేరుకుని మంత్రులు ఇరువురూ స్వామి …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే , ఆదేశాలతో 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య, టీడీపీ నాయకులు మన్నెం నారాయణ, కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. చిట్టినగర్ కు చెందిన బీ శ్రీనివాసరావు (58) …
Read More »“సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో 16 మంది గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి “సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో గర్భిణీల కోసం ప్రారంభించిన ఉచిత మొబైల్ 2డీ ఎకో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. చిట్టినగర్ లోని ,సర్కిల్ వన్ కార్యాలయం వద్ద నాలుగో విడత , మంగళవారం నిర్వహించిన ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ లను గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ ల ద్వారా మహిళలో గర్భధారణ సమయంలో వచ్చే గుండె జబ్బులు ముందుగానే గుర్తించి ప్రాణాంతక సమస్యలను …
Read More »కాంట్రాక్ట్ మెడికల్, పారా మెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి సత్యకుమార్ కి విజ్ఞప్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మెడికల్, పారా మెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అలైడ్ మెడికల్ హెల్త్ సైన్సెస్ & పారా మెడికల్ జేఏసీ ముఖ్య ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రిని తన చాంబర్లో మంగళవారం సాయంత్రం వీరు కలుసుకుని సర్వీస్ విషయాల్లో సానుకూల నిర్ణయం తీసుకో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లో క్రమబద్ధీకరించే వరకు …
Read More »జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై సానుకూలంగా..సానుభూతితో పరిశీలిస్తాం
-స్టైపెండ్ పెంపుపై ఉన్నత స్థాయి అధికారుల కమిటీ త్వరలోనే జూడా ప్రతినిధులతో భేటీ -రిటైర్మెంట్ వయసు పెంపుపైనా పునఃపరిశీలన -నాన్ క్లినికల్ పోస్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ అభ్యర్థుల అంశాన్నీ పరిశీలిస్తాం -సమ్మె విరమించిన జూడాలకు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూనియర్ డాక్టర్ల (జూడా) డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని.. ఇతర రాష్ట్రాల్లో …
Read More »నేషనల్ ఫోటో కాంటెస్ట్-2026 అవార్డుల ప్రధానోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫోటో జర్నలిస్టు నైపుణ్యం,శ్రమ కలగలిసిన కళాకారుడని సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్మలిస్టుల అసోసియేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో నేషనల్ ఫోటో కాంటెస్ట్-2026 అవార్డుల ప్రధానోత్సవం మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. సి.ఆర్.మీడియా అకాడమీ, ఏపి స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరర్ కమీషన్ లు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఒక ఫోటో ‘వార్తకు’ …
Read More »రాలిస్ నుంచి రెండు నూతన పంట సంరక్షణ ఉత్పత్తులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఎదుర్కొంటున్న పంట వ్యాధులు, పురుగు సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే లక్ష్యంతో టాటా గ్రూప్‌కు చెందిన రాలిస్ ఇండియా లిమిటెడ్ రెండు నూతన పంట సంరక్షణ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. విజయవాడ లబ్బీపేటలోని జీఆర్‌టీ హోటల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘మార్సెలస్’, ‘సైలెంట్రా’ ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాలిస్ ఇండియా ఎండీ, సీఈఓ డా. జ్ఞానేంద్ర శుక్లా మాట్లాడుతూ, మారుతున్న పంట రక్షణ సవాళ్లకు అనుగుణంగా వినూత్న పరిష్కారాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు. …
Read More »ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026 :’డాక్టర్ వైఎస్సార్ & డాక్టర్ కేవీపీ ఫౌండేషన్’
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యవసాయ రంగం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాలలో అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) కు ‘డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026’ ను ప్రకటించారు. ఈ అవార్డు కింద రూ. 25 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. 2026 సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలోని ‘కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’లో నిర్వహించే కార్యక్రమంలో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ తరఫున ఆ సంస్థ ఛైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య …
Read More »
Prajavartha Online Telugu News