Monthly Archives: August 2026

రూ.1.30 కోట్లతో నిర్మించిన చిక్కవరం–పురుషోత్తపట్నం రహదారిని ప్రారంభించిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-రూ.53.90 లక్షలతో తాగునీటి పథకం ప్రారంభం.. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం -గోపవరపుగూడెంలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి.. మరో రూ.1.44 కోట్ల పనులకు మంజూరు – యార్లగడ్డ -గన్నవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామ అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామంలో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం …

Read More »

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రయాణికుల సౌకర్యాలపై పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం, రైల్వే భూముల సద్వినియోగం, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,340 రైల్వే స్టేషన్లను ఆధునికీకరణకు ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే 261 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యం …

Read More »

తిరుపతి, తిరువణ్ణామలై రహదారి అభివృద్ధికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీలు గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి, అన్నాదురై

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువన్నామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సి.ఎన్. అన్నాదురై కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిశారు. తిరుపతి, తిరువణ్ణామలై మార్గం రెండు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే భక్తులకు …

Read More »

సంత్ రవిదాస్ కలశ యాత్రతో సామాజిక ఏకత్వానికి పిలుపు

-కుల, మత భేదాలను వీడి సమానత్వం వైపు సాగాలి: పీవీఎన్ మాధవ్ -వారణాసి నుంచి వచ్చిన పవిత్ర కలశాలకు విజయవాడలో ఘన స్వాగతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మత భేదాలను అధిగమించి సమాజంలో సోదరభావం, సమానత్వం, ఏకత్వాన్ని బలోపేతం చేయడమే సంత్ రవిదాస్ కలశ యాత్ర ప్రధాన ఉద్దేశమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వారణాసి నుంచి తీసుకొచ్చిన పవిత్ర కలశాలతో విజయవాడలో నిర్వహించిన కలశ యాత్ర …

Read More »

నోటీసులు అందిన ఓటర్లు మీ ఓటును పరిరక్షించుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నోటీసులు అందిన ఓటర్లు మీ ఓటును పరిరక్షించుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026 (SIR-2026)లో భాగంగా బుధవారం ఉదయం శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పరిధిలో గల ఇంటింటి ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని డెప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా రూపొందించిన ముసాయిదా …

Read More »

పేదవాడిని మరింత పేదవాడుగా…పెద్దవారిని మరింత పెద్దవారిగా మారుస్తున్న మోడీ పాలన

-రాష్ట్ర సంపాదనను అంగడిలో పెట్టి అమ్ముతున్న నోరుమెదపని రాష్ట్ర పాలకులు -పాదయాత్రలో జి.కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, తిరోగమన విధానాలతో పేదవాడు మరింత పేదవానిగా , పెద్ద వాడు మరింత పెద్దవానిగా మారుస్తున్న పాలకుల అనాలోచిత విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు అధోగతి పాలవుతున్నారని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర వ్యాప్తముగా …

Read More »

“కంపెనీ Specific డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.14.08.2026 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు మన విజయవాడ లోని ఆధ్యా స్టోర్ (The Unit of Rama), పాత SBI బ్రాంచ్, ఆపోజిట్: జూడియో స్టోర్స్, D.No: 59-13-4, ఘంటసాల వారి స్ట్రీట్, గాయత్రీ నగర్, విజయవాడ నందు “కంపెనీ Specific డ్రైవ్” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి సి. మధుభూషణ్ రావు గారు …

Read More »

విత్తనం నాటిన ప్రతి రైతుకు ఫసల్ బీమా

-రైతుల ఆర్థిక భద్రతకు 100 శాతం ఫసల్ బీమా నమోదు -ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద విత్తనం నాటిన ప్రతి రైతును పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలి -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టరేట్ నుండి కలెక్టర్ లక్ష్మీశ.. జిల్లా రెవిన్యూ అధికారి యం.లక్ష్మీ నరసింహo, జిల్లాస్థాయి అధికారులతో కలసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ …

Read More »

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి

-2026లో ఎన్టీఆర్ జిల్లాలో గణనీయంగా తగ్గిన డెంగ్యూ, మలేరియా కేసులు -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుండి బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సీజనల్ వ్యాధుల నియంత్రణపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, 2025తో పోలిస్తే 2026లో ఎన్టీఆర్ జిల్లాలో డెంగ్యూ, మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. 2025లో 23 డెంగ్యూ, 41 మలేరియా కేసులు నమోదుకాగా, 2026లో …

Read More »

అవగాహనతో ఎయిడ్స్‌ను జయిద్దాం

-ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -హెచ్‌ఐవీని నియంత్రించడంలో క్రమం తప్పకుండా మందుల వినియోగం కీలకం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అవగాహన, అప్రమత్తత, సకాలంలో వైద్య పరీక్షలు, క్రమం తప్పకుండా మందుల వినియోగంతో హెచ్‌ఐవీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీ, …

Read More »