Monthly Archives: August 2026

బాధిత దళిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి… : మేదర సురేష్‌కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో వైఎసఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేదర సురేష్‌కుమార్ పాల్గొన్నారు. బుధవారం ధర్నాచౌక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హత్యకు గురైన దళితులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 మంది దళితులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని ఈ కేసులపై సమగ్ర విచారణ జరపాలన్నారు. బాధిత దళిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. న్యాయం కోసం బాధితులకు అండగా నిలుస్తామని కార్యక్రమంలో పాల్గొన్ని సంఘీభావం తెలిపారు.

Read More »

ట్రాఫిక్ నిబంధనలపై నే ప్రాణ రక్షణ… : కొల్ల జయశ్రీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని జైహో వాకర్స్ క్లబ్ విజయవాడ అధ్యక్షురాలు న్యాయవాది కొల్ల జయశ్రీ, పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఈ క్లబ్ అప్పటి నుంచి విజయవాడ నగరంలో వినూత్న సేవా కార్యక్రమాలతో దూసుకుపోతోంది. నిరంతర సేవా పథంలో క్లబ్ సెక్రటరీ రమాదేవి ట్రెజరర్ ఆంజనేయరాజు లైబ్రేరియన్ రమాదేవి సమన్వయంతో క్లబ్ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బందర్ రోడ్డు ఠాగూర్ లైబ్రరీలో జైహో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి …

Read More »

APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి మరో ముందడుగు

-ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్యమే లక్ష్యం – రూ.22లక్షల నూతన Fully Automated ImmunoAssyAnalyzerప్రారంభం -ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లే అవసరం తగ్గింపు – APSRTC ఉద్యోగులకు ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి -99%కిపైగా ఖచ్చితత్వంతో పరీక్షలు – గంటలో 100 నమూనాల వరకు ఫలితాలు -ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు మరింత మెరుగైన వైద్య సేవలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, విద్యాధరపురంలోని APSRTC సెంట్రల్ హాస్పిటల్‌లో రూ.22 లక్షల విలువైన …

Read More »

అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో గ్రామసభల నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ బుధవారం, 2026 ఆగస్టు 12న నార్త్ ఈస్ట్ గ్రిడ్‌లో భాగమైన వెంకటపాలెం, ఈస్ట్ గ్రిడ్‌లో భాగమైన కృష్ణాయపాలెంలో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామసభల్లో అమరావతి మాస్టర్ ప్లాన్, …

Read More »

ఈ నెల 17, 18, 19 తేదీల్లో సీసీఎల్ఏ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరసన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ అత్యవసర సమావేశం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సమావేశం ది.19-08-2026 బుధవారం విజయవాడలో నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ప్రధాన కార్యదర్శి బి. మధుబాబు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

Read More »

ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడం రాజకీయ పతనానికి నిదర్శనం

-16 వేలకుపైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన లోకేష్‌ను చూసి ఓర్వలేక విషప్రచారం -ఐదేళ్లలో డీఎస్సీ ఇవ్వలేని జగన్‌.. ఇప్పుడు నీతులు చెబుతారా? -అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్‌ లక్ష్యం -గొడ్డలి పార్టీ వైఖరి పై మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడ (గొల్లపూడి), నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభకు రావడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌రెడ్డికి భయమెందుకని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. మండలి రద్దు చేస్తానని …

Read More »

ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్ వినియోగం

-విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ వినియోగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 270 మిలియన్‌ యూనిట్లకు పైగా డిమాండ్‌ రాష్ట్రంలో రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ …

Read More »

కేంద్ర సహకారం.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతికి మహర్దశ

-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుండటం రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాజధాని అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో అమరావతికి పూర్వ వైభవం వస్తోందని నేడొక ప్రకటనలో పేర్కొన్నారు అమరావతి అభివృద్ధి పనుల్లో భాగంగా గురువారం రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు …

Read More »

ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ అభా ఐడీతో చికిత్సను అందించాలి

-ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు అమలు తప్పనిసరి -ఈహెచ్‌ఆర్‌ నమోదుతో రోగి ఆరోగ్య చరిత్ర భద్రం -వినియోగంపై ఎన్ ఎం సి డ్యాష్‌బోర్డ్‌ ద్వారా పర్యవేక్షణ -వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీర పాండియన్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ రోగులకు అభా (ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌) ఐడీ ఆధారంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ బోధనాసుపత్రులతో పాటు ఇతర …

Read More »

గన్నవరం వ్యాక్సిన్‌ కోల్డ్‌చైన్‌ అధికారి దేవానందం సస్పెన్షన్‌

-మహిళా అధికారులపై అనుచిత వ్యాఖ్యల ఫలితం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం స్టేట్‌ వ్యాక్సిన్‌ స్టోర్‌లో కోల్డ్‌చైన్‌ అధికారిగా పనిచేస్తున్న జి. దేవానందంను సస్పెండ్‌ చేస్తూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆధారాలు ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. అలాగే దేవానందంపై అభియోగాలను కూడా నమోదు చేశారు.

Read More »